నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలోని నాగర్లపల్లి గ్రామానికి చెందిన మెంతుల ఐలయ్య (53) శనివారం వడదెబ్బతో మృతి చెందారు.స్థానిక కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్,మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఐలయ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయట పనులు ముగించుకుని బర్లను కాస్తుండగా తీవ్ర ఎండ వేడికి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు.విషయం తెలుసుకున్న 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ గ్రామస్తులతో కలిసి మృతుని నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులు బయోడిగ్రేడబుల్ కవర్లను వాడాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ సూచించారు. శనివారం ఉదయం ప్రీతి టిఫిన్ సెంటర్‌లో హోటల్ యజమాని ప్రవీణ్‌కు బయోడిగ్రేడబుల్ ఆరోగ్య కవర్లను ఆమె అందజేశారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ అధిక వేడి కలిగిన టీ, సాంబార్, ఇతర వేడి ఆహార పదార్థాలను బయోడిగ్రేడబుల్ కవర్లలో తీసుకోవచ్చని, వీటి వాడకంతో క్యాన్సర్ వంటి వ్యాధులు రావన్నారు. ఏఎస్ఆర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ భూమిలో కలిసిపోయే ఈ బయో కవర్ల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఏఎస్ఆర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపల్ శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుంటాయని చెప్పారు. బయో కవర్లు కావాల్సినవారు 9985040978, 9848731408 నంబర్లలో సంప్రదించాలన్నారు.ఈకార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరిగాని సుదర్శన్ గౌడ్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ నవీన్, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, ధోనాల రవి, హోటల్ యజమానులు నవీన్, కిరణ్, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలోని మార్కండేయ కాలనీలో శరత్ మాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఆప్తమాలజిస్ట్ మమత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 50 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్తమాలజిస్ట్ మమత మాట్లాడుతూ చాలావరకు వయసు పైబడిన వారు కంటికి సంబంధించిన క్యాట్రాక్ట్, టెరీజియం,చూపు మందగించుట,రెటీనా వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. పేదవారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఎర్ర పల్లవి, మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్, సలహాదారులు జడల శ్రీనివాస్, పెండెం రాజేశ్వరి తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామం లో హనుమాన్ శోభా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. శోభాయాత్రలో హనుమాన్ విగ్రహాన్ని అలంకరించి ఊరే గింపుగా తీసుకెళ్లారు. యువ కులు, మహిళలు, చిన్నారు లు ఉత్సాహంగా పాల్గొని భక్తిపరవశంలో మునిగిపో యారు.భజనలు నిర్వహి స్తూ శోభాయాత్రను ఆకట్టుకు నేలాతీర్చిదిద్దారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభా యాత్ర కొనసాగి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమం ప్రశాం తంగా సాగేందుకు స్థానికులు, నిర్వాహకులు తగిన ఏర్పా ట్లు చేశారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి బానోతురాజు, మాలోతుభాష,రాజు,భాస్కర్,రమేష్, జర్పులరాజు, బానో తుఅరుణ్ భక్తులు పాల్గొ న్నారు.
పట్టణంలోని 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నూతన పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన ఒంటేరు శ్రావణ్ కుమార్‌కు స్థానిక కౌన్సిలర్ అల్లే దశరథం,వార్డు అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు,వార్డు ప్రజలు కలిసి ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు.అలాగే పరకాలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహేందర్, బోయిని తిరుపతి,సాదు రాజు,పెద్దరాజు,శోభన్, నాగవెల్లి,సరోతం,పెద్దరాజు, నాయకులు,కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో చిట్యాల రోడ్ లో చింతల హనుమాన్ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం ఆంజనేయ స్వామి భక్తులు స్వామివారి పల్లకి సేవలో శ్రీ ఆంజనేయస్వామి మాలాధారణ భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు
వనపర్తి లో జనగణన అవగాహన ర్యాలీ లో కలెక్టర్ ఎస్పీ వనపర్తి నేటీదాత్రి .
శనివారం జిల్లా కేంద్రంలో భాగంగా స్వీయ జనగణ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి డి ఎస్పీ గిరిబాబు టౌన్ ఎస్సై హరి ప్రసాద్ అధికారులు సుధీర్ రెడ్డి హరికృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బాలుర జూనియర్ కళాశాల నుండి ర్యాలీ రాజావారి బంగ్లా పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించారుఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కరోనా ఉన్న సందర్భంగా 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ అప్పుడు నిర్వహించ లేదని , ఇప్పుడు దేశములో డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 11 నుండి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్థారని కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు జనగణ గురించి విజవంతము చేయటకు పత్రికలు మీడియా ద్వారా ప్రజలకు తెలిపాలని కలెక్టర్ విలేకరుల కు విజ్ఞుప్తి చేశారు
ప్రపంచంలో ప్రతి మనిషి జీవితాన్ని మలిచే తొలి శక్తి అమ్మ. బిడ్డ జన్మించక ముందే తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొత్త జీవితానికి రూపం ఇచ్చేది తల్లే.తన కష్టం,బాధలను మరిచి పిల్లల సంతోషంలో ఆనందాన్ని వెతికే మహోన్నత వ్యక్తిత్వం అమ్మది.ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం జరుపుకునే ప్రపంచ మాతృదినోత్సవం తల్లుల త్యాగాలను గుర్తు చేసే ప్రత్యేక రోజు.కానీ నిజానికి అమ్మకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఒక రోజు సరిపోదని పలువురు భావోద్వేగంగా చెబుతున్నారు.ఎందుకంటే తల్లి ప్రేమకు హద్దులు ఉండవు ప్రతిఫలం ఆశించని ఏకైక బంధం కూడా అదే.కాలం మారుతున్నా అమ్మ పాత్ర మాత్రం మారడం లేదు.గ్రామాల్లో పొలాల్లో కష్టపడుతూ కుటుంబాన్ని ఆదుకుంటున్న తల్లులు ఒక వైపు ఉంటే,పట్టణాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న తల్లులు మరోవైపు కనిపిస్తున్నారు.కుటుంబానికి బలమైన ఆధారంగా నిలుస్తూ ఎన్నో బాధ్యతలను మౌనంగా భరిస్తున్నారు.పిల్లల విజయాల వెనుక తల్లి కష్టం దాగి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
చిన్ననాటి నుంచి మంచి విలువలు నేర్పుతూ సమాజానికి మంచి పౌరులను అందించడంలో తల్లుల పాత్ర కీలకమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.తల్లి చెప్పే మాటల్లో ప్రేమతో పాటు జీవితం నేర్పే అనుభవం కూడా దాగి ఉంటుందని పేర్కొంటున్నారు.మాతృదినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.విద్యాసంస్థల్లో విద్యార్థులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.సోషల్ మీడియాలో కూడా అమ్మతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు.అమ్మ ఉన్న చోటే ఆప్యాయత ఉంటుంది అనే మాట ప్రతి కుటుంబంలో నిజమవుతోంది.జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదని పలువురు పేర్కొంటున్నారు.తల్లిదండ్రులను గౌరవించడం,వారిని ఆనందంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.ప్రపంచం ఎంత వేగంగా మారిన అమ్మ ఒడిలో దొరికే ప్రేమ,భరోసా మాత్రం ఎప్పటికీ మారదని ఈ మాతృదినోత్సవం మరోసారి గుర్తుచేస్తోంది.
`కౌంటర్లు ఆవేశంగా ఇవ్వకుంటే వెనుకబడినట్లు అసలే కాదు.
brs party
`ఆవేశ పూరిత మాటలు అన్ని పార్టీలకు అనర్ధమే.
`ప్రత్యర్థుల మాటలే బి ఆర్ ఎస్ కు బలం!
`ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు.. వాళ్లకు అన్ని తెలుసు!
`గతంలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేసేవి!
`అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలని అనే వారు!
`కాలం మారిన రాజకీయాలు అధికారంలో వున్న వాళ్ళు చేస్తున్నారు.
`బీఆరఎస్ నాయకులకు అహంకారం అని ప్రత్యర్థి పార్టీలు పదే పదే రాజకీయం చేస్తున్నాయి.
`ఆవేశ పూరిత రాజకీయాలు ఎప్పుడూ రాణించవు.
`సానుభూతి రాజకీయాలు ఎప్పుడూ ఓడిపోవు.
`ప్రజల మన్ననలు పొందాలంటే ఓపిక ఎంతో అవసరం.
`ప్రత్యర్థి పార్టీలను తిట్టే కాలం చాలా ముందుంది.
`కేసీఆర్ అంటే తెలంగాణా ప్రజలకు ఒక వర ప్రసాదం.
`కేసీఆర్ పాలన రామ రాజ్య పాలన.
`త్రేతా యుగ పాలనా చదువుకున్నాం.. కేసీఆర్ పాలనా కళ్ళనిండా చూశాం.
`తెలంగాణ లో ఎడారి బతుకు దుర్భర జీవితం గడిపాం.
`అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు అనుభవించాం
`తెలంగాణ తెచ్చిన కెసిఆర్ పాలనలో పరమాన్నం తిన్నాం.
`తెలంగాణ సాధించిన యోధుడుగా అయన పేరు ఎవరూ చేరిపేయలేరు.
`విమర్శలు చేసే వారికి కూడా ఆ విషయం తెలుసు.
`కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చిన్న పిల్ల వాడికి కూడా తెలుసు.
`తెలంగాణ రాక ముందు తెలంగాణ పరిస్థితులు ఎవ్వరూ మర్చిపోలేదు.
`నరకం లాంటి రోజులను చూసిన తెలంగాణ రైతు ఆ బాధలు మర్చిపోలేడు.
`పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆఖరుకు సానుభూతి మీదనే గెలిచాడు.
`ఇప్పుడు ఆవేశ పడితే వచ్చేదేమి లేదు.
`ఇప్పుడు ఎంత ఒదిగి వుంటే బి ఆర్ ఎస్ కు అంత మేలు.
`అవతలి వాళ్లు ఒక్కటంటే పది అనే శక్తి బి ఆర్ ఎస్ కు వుంది.
`బి ఆర్ ఎస్ చెప్పుకోవడానికి ఎంతో వుంది.
`కెసిఆర్ పాలన ఎంత స్వర్ణ యుగమో కొమ్మ, రెమ్మ కూడా చెబుతుంది.
`పల్లె నుంచి మొదలు పట్నం దాకా ప్రతి మట్టి రేణువు చెబుతుంది.
`ప్రత్యర్థి పార్టీల మాటలకు కౌంటర్ ఇవ్వకపోతే వెనుకబడినట్లు కాదు.
`బీఆరఎస్ నాయకులు చెప్పడానికి అనేక సమాధానాలున్నాయి.
`చూపించడానికి అనేక సాక్షాలున్నాయి.
హైదరాబాద్, నేటిధాత్రి:
తిట్టిన వారెప్ప్పుడూ గొప్పవారు కాదు. పడ్డవారెప్ప్పుడూ చెడ్డవారు కాదని సామెత. సమాజంలో ఇద్దరు వ్యక్తులు అనాలోచితంగా, అకారణంగా తిట్టుకుంటారేమో గాని, రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలు పనిగట్టుకొని తిట్టుకుంటారు. రెచ్చగొట్టుకుంటారు. ఆవేశ పూరితంగా మాట్లాడుతుంటారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ వాయిస్ కొంత బలంగా వెళ్తుంది. ఆ పార్టీ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అదే ప్రతిపక్షంలో వున్న పార్టీ మాటలు వక్రీకరణకు గురౌతాయి. గతంలోనూ జరిగింది. ఇప్ప్పుడూ జరుగుతుంది. రేపు కూడా జరుగుతుంది. కాకపోతే ప్రతిపక్షానికి చెందిన బిఆరఎస్ కొంత ఆచి తూచి అడుగులేయాలి. కేంద్ర, రాష్ట్ర పాలక పక్షానికి చెందిన పార్టీలు పనిగట్టుకొని తిడుతున్నాయంటే బిఆరఎస్ బలంగా వున్నట్లే లెక్క. ఆ విషయం బిఆరఎస్ నేతలు కూడా అవగాహన పెంచుకోవాలి. పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయి. ఈ రెండేళ్ల కాలంలో బిఆరఎస్ అనేక ఓటములను ఎదుర్కొన్నది. ఆఖరుకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అనుకున్నంత మేర విజయం సాదించలేదు. కాని కేంద్ర,రాష్ట్ర పాలక పక్షాలు మాత్రం బిఆరఎస్‌ను తిడుతూనే వున్నాయి. కేసిఆర్, కేటిఆర్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తూనే వున్నాయి. కారణం ప్రజల్లో బిఆరఎస్ బలంగా వుండడమే కారణం. అది బిఆరఎస్ నేతలకు ఇంత వరకు అర్ధం కావడం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్తాం.. బిఆరఎస్ అధికారంలో వున్న సమయంలో సిఎం. రేవంత్‌రెడ్డిని అనరాని మాటలన్నారు. ఆ సమయానికి అవే పెద్ద మాటలుగా సమాజం అనుకున్నది. ప్రతి సందర్భంలోనూ రేవంత్‌రెడ్డిని తిడుతూ హీరోను చేసిందే బిఆరఎస్ పార్టీ. రేవంత్‌రెడ్డి అడుగు తీసి, అడుగు వేయకుండా కట్టడి చేసింది. జనం మధ్యకు వెళ్లకుండా చేసింది. ఆపాలని ఎంతో ప్రతయ్నం చేసింది. సందర్భం దొరికనప్ప్పుడల్లా అరెస్టు చేసింది. ఆ సమయంలో మంత్రిగా వున్న మల్లారెడ్డి సిఎం. రేవంత్‌రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. ఏకంగా రేవంత్‌రెడ్డి కూతరు పెండ్లికి కూడా తానే డబ్బులు ఇచ్చానన్నాడు. ఇలా పదే పదే బిఆరఎస్ నాయకులు తమ నోటికి పనిచెప్పారు. అదే సమయంలో కరీంనగర్ ఎంపి.కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను కూడా అరెస్టులు చేసింది. ఆయనదీక్ష చేస్తుంటే చిటికీలు పగలగొట్టి మరీ ఆయనను అరెస్టు చేసింది. నిజామాబాద్ ఎంపి. అరవింద్ ఇంటిమీద దాడి బిఆరఎస్ నేతలు దాడి చేశారు. కాని ఆ నాయకులు తిరిగి స్పందించడానికి పెద్దగా వీలు కాలేదు. బిఆరఎస్ తిట్టిన తిట్లు, వేధింపులు ఆ నాయకులకు సానుభూతిగా మారాయి. గత ఎన్నికల్లో బిఆరఎస్ ఓటమికి కారణమయ్యాయి. ఈ విషయం బిఆరఎస్ నాయకులు ఆత్మావలోకనం చేసుకోవాలి. కాకపోతే అప్ప్పుడు బిఆరఎస్ నేతలు ఇష్టానురీతిన మాట్లాడలేదు. కాని ఇప్ప్పుడు అదే కాంగ్రెస్, బిజేపి నాయకులు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. సహనం మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎప్పటికైనా సరే బిఆరఎస్‌కు మేలు చేస్తాయి. సానుభూతిని పెంచుతాయి. కాంగ్రెస్, బిజేపి నాయకులు తిడుతుంటే బిఆరఎస్ నాయకులు మౌనంగా వుంటే తప్ప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆవేశం వద్దు. మాటకు మాట సమాధానం చెప్పడంలో కూడా బిఆరఎస్ నాయకులు ఎంతో విజ్ఞత ప్రదర్శించాల్సి వుంటుంది. కాంగ్రెస్, బిజేపి నాయకులు మాటల దాడి చేస్తుంటే, బిఆరఎస్ పెద్దలు మౌనంగా వుంటూ కార్యకర్తలు ఊరుకోకపోవచ్చు. మాటకు మాట సమాదానం చెప్పాలని కోరుతుండొచ్చు. మనమేం తక్కువ అని పార్టీ పెద్దలను రెచ్చగెట్టే ప్రయత్నాలు కూడా కార్యకర్తలు చేస్తుండొచ్చు. అలా అని ఎక్కడ వెనుకబడిపోతామో అని పార్టీ నాయకులు, పెద్దలు ఆవేశానికి గురికావొద్దు. కేటిఆర్ మీద గతంలో చేసిన ఆరోపణలే ఇప్ప్పుడూ చేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఆరోపణలు ఏమీ లేవు. ప్రజలు ఎంతో విజ్ఞులు. అన్ని విషయలు నిశితంగా గమనిస్తుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయింది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సుతప్ప మరేం రాలేదన్న సంగతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి తెలియంది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఏదేదో మాట్లాడుతుంటారు. అది నైతికత కాకపోవచ్చు. కాని రాజకీయాల్లో తప్ప్పు కాదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సహజం. ప్రజల దృష్టి మళ్లించడం అవసరం. మీడియా కవరేజీవుంటుంది. అదికార పక్షం నేతల మాటలు ప్రజల్లోకి తొందరగా వెళ్తాయి. అందువల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకులుగా ఎవరున్నా చేస్తుంటారు. అయితే ఒక దశ దాటితే మీడియా కూడా ఎటు వైపు నిలవాలో అటే నిలుస్తుంది. ఎన్నికల నాడు జనం ఎటు వైపు నిలస్తున్నారో అటు వైపు వార్తలు వండి వారుస్తుంది. ఇది బిఆరఎస్ నేతలకు తెలియందికాదు. ఈ విషయాలన్నీ కేసిఆర్‌కు తెలియకుండానే ఆయన మౌనంగా వుంటున్నారా? ఇప్ప్పుడు పార్టీ నాయకులను కూడా ఆయన కట్టడి చేయలేరు. ప్రతిపక్షం అంటేనే చిటికెల పందిరి. నాయకులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అధికారంలో వున్నప్ప్పుడే కేసిఆర్ లాంటి నాయకుడే ఆవేశానికి పోయి అనర్ధం తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో వున్న నాడు రేవంత్‌రెడ్డి విసిరిన సవాళును స్వీకరించి మొదటికే మోసం తెచ్చుకున్నారు. ముప్పై మంది ఎమ్మెల్యేలను మార్చకుండా ఎన్నికలకు పోయే దమ్ముందా? అని సిఎం. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారు. ఓ మహిళను అత్యాచారం చేసి, చంపిన మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , కుమారుడు వనమా రాఘవకు టికెట్ ఇచ్చారు. ఇది ప్రజలు ఆహ్వానిస్తారా? తెలంగాణ రాజీకీయాలను కుదుపు కుదిపన కీచక రాఘవకు టికెట్ ఇస్తే గెలుస్తారని ఇచ్చారా? అంటే సిఎం. రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు స్వీకరించి టికెట్ ఇచ్చారు. బోల్తా పడ్డారు. అలా ఆనాడు ప్రజా వ్యతిరేకత వున్న 30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు. పార్టీ ఓటమికి కారకులయ్యారు. ఇంకా ఆవేశాన్ని తగ్గించుకోకపోతే ఎలా? కాంగ్రెస్, బిజేపి పార్టీలకు సమాధానమివ్వడానికి బిఆరఎస్ నాయకులకు అనేక సాక్ష్యాలున్నాయి. తెలంగాణ రావడానికి కారణం ఎవరు? అని దేశంలో ఎవరిని అడిగినా కేసిఆర్ పేరు చెబుతారు. అది చరిత్ర. ఎవరు చింపేస్తే చిరిగిపోయే కాగితం కాదు. తెలంగాణ కోసం కొట్లాడిందెవరో, తెచ్చిందెవరో..ఎలా సాధ్యమైందో, దానికి కారణమెవరో అనేది అందరికీ తెలుసు. అలాంటి కేసిఆర్ పదేళ్ల కాలంలో చేసిన ప్రగతి ప్రజలకు కూడా తెలుసు. అయినా కళ్లముందు ఆ పదేళ్ల కాలాన్ని ఆవిష్కరించండి. కొత్త తరానికి చెప్పండి. తెలంగాణ రాకముందు వున్న చీక బతుకులను గురించి నేటి తరానికి వివరించండి. వారి కుటుంబాలలో వున్న పెద్దలను అడిగి తెలుసుకోండని చెప్పండి. తెలంగాణ ఉద్యమ డాక్యుమెంటరీలు తయారు చేయండి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్దిని చూపించండి. పదేళ్ల కాలంలో నిండిన చెరువులు, ఇప్ప్పుడు ఎండిన చెరువులు ఎలా వున్నాయో చూపించండి. పదేళ్లుగా ఎండిపోని కాకతీయ కాలువలో నీటి చుక్క ఎందుకు లేదని అడగండి? కేసిఆర్ పాలనలో కొనుగోలు జరిగిన తీరు, కల్లాలలకే వచ్చి వడ్లు కొన్న విధానం చూపించండి. ఐకేపి సెంటర్ల ఏర్పాటు ఎవరు చేశారో చెప్పండి. రైతుల పక్షాన పోరాటం చేయండి. ఆరు గ్యారెంటీల మీద ఉద్యమాలు చేయండి. అదికార కాంగ్రెస్‌ను తిట్డడానికి ఇంకా చాల కాలం వుంది. ఎన్నికల ముందు ఏం తిట్టాలనుకుంటున్నారో అవి అప్ప్పుడు తిట్టండి. జనం వింటారు. కాంగ్రెస్, బిజేపి నాయకులు తిట్టే తిట్ల వల్ల బిఆరఎస్ సానుభూతి సంపాదించుకోవాలి. అంతే కాని తిట్టుకు తిట్టే సమాధానం అంటే, అదికారంలో వున్న వాళ్లు ఒక్క తిట్టుకు పది తిడతారు. అధికారంలో చేతిలో వుండడంతో దాడులు చేస్తారు. కేసులు నమోదు చేస్తారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ఎంచుకున్న సానుభూతి విధానం అప్ప్పుడే మర్చిపోయారా? గెలిచి పాలకపక్షం మీద పోరాటం చేయడం మితి మీరి మాట్లాడడం కాదు. అలాగే బిఆరఎస్ నాయకురాలు పావనీ గౌడ్ కాళేశ్వరం గురించి వీడియోలు చూపిస్తూ రాజకీయం చేసినప్ప్పుడు అందరూ బేష్ అన్నారు. ఇప్ప్పుడు ఆమె కూడా నోటికి పని చెబుతున్నారు. హద్దులు దాటే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో బిఆరఎస్‌కు రావాల్సిన మైలేజీని ఇలాంటి నేతలే చెడగొడుతున్నారు. కరీంనగర్ రాజకీయంలో బిఆరఎస్‌కు కలిసి వస్తుందనుకున్న సానుభూతిని ఒక్కరోజులోనే రాకుండా చేసుకున్నారు. స్వయంకృతాపరాధంతో మైలేజీ దక్కండా చేసుకుంటున్నారు. ఆవేశం అనార్దాలకు హేతువు. సహనం అన్ని కార్యాలకు మÖలం.
హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాది నటేశ్వర్‌కు ఘన సన్మానం శ్రీరాంపూర్ : నేటి దాత్రి
నటేశ్వర్ కు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఘన సన్మానం జరిగింది. రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్‌గా సేవలందిస్తున్న నటేశ్వర్‌ను కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సన్మానించి అభినందించారు.సామాజిక సేవలో భాగంగా 50 సార్లు రక్తదానం, 29 సార్లు ప్లేట్లెట్స్ దానం చేయడం, గోసంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, యోగ మాస్టర్, మానసిక-శారీరక కోచ్ గా సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు.భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నటేశ్వర్ మాట్లాడుతూ.. అందరి ప్రేమాభిమానాలు జీవితాంతం మరువలేనివని, ఇలాగే ఆశీస్సులు అందించాలని కోరారు
కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంతి బండి సంజయ్ కుమార్ ను నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా
డా జాడి రామరాజు నేత
ఏటూరునాగారం, నేటిధాత్రి
శుక్రవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ కెసిఆర్ కేటీఆర్ మెప్పు కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా లేక మరోసారి మాట్లాడకుండా బాడితే పూజ చెయ్యాలో పాడి కౌశిక్ రెడ్డి కి మద్దతుగా మాట్లాడుతున్నా అగ్గిపెట్టె హరీష్ రావు చెప్పుతే బాగుంటదని అన్నారు అదేవిదంగా బి ఆర్ ఎస్ నాయకుడు ఎమ్మెల్యే కావడానికి బిడ్డను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి గెలిసిన నాటి నుండి నేటి వరకు గొడవ పెట్టుకొని పార్టీ కానీ రోజు కానీ ఉన్నదా అన్నారు ఏదైనా సమావేశం పెట్టిన పాడి కౌశిక్ రెడ్డి గొడవలు సృటించి కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం ఎవ్వరితో పడితే వారితో గొడవలు పెడితే అందరు ఊరుకోరు అనేది బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాడి కౌసిక్ రెడ్డి లాంటి చిల్లర రాజకీయ నాయకులకు చెప్పవలసిన భాద్యత కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావే భాద్యత అవించాలని అన్నారు అదేవిదంగా కెసిఆర్ కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు నేరెళ్ల సంఘటన కానీ సిరిసిల్ల పెద్దపల్లి అడ్వా్కేట్ దంపతులను హత్యలు చేసిన చరిత్ర బి ఆర్ ఎస్ ప్రభుత్వం కదా అన్నారు అధికారం లో ఉండగా భూ కబ్జాలు ప్రతి పక్ష పార్టీ లు లేకుండా అక్రమ కేసులు పెట్టిన తెరాస నాయకులు నేడు పాడి కౌసిక్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల ను ఇతర పార్టీ నాయకుల పై మాట్లాడించి ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని కెసిఆర్ కేటీఆర్ లాంటి నాయకులు చూస్తున్నారని అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు ప్రజల సమస్యలను పక్కకు నెట్టి క్రిస్టియన్ ముస్లిం ఓట్ల కోసం బీజేపీ పార్టీ నాయకులపై చిల్లర మాటలు మాట్లాడుతూనే హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరామ చంద్రుని పైకూడా రాజకీయాలు చేసుకుంటూ హిందువులను కించపరుస్తున్నారని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేధావులు హిందూ బందువులారా ఒక్కసారి అలోచించి అర్ధం చేసుకొని క్రిస్టియన్ ముస్లిం ఓట్ల కోసం హిందూ దేవుళ్లను కించపరస్తూన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కాంగ్రెస్ ను భూష్టాపీతం చేద్దాం మన ఆస్తిత్వాన్ని మనం కాపాడు కోవలసిన భాద్యత హిందూ బంధువుల అందరిపై ఉన్నదాని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు
గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ఉగ్గె మానిక అధ్యక్షతన ‘రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రశాంత్, మానస, మండల వ్యవసాయ అధికారి హారిప్రసాద్, ఏఈఓ సుష్మిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్త ప్రశాంత్ మాట్లాడుతూ అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటంతో భూసారం తగ్గి నేల ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపారు. యూరియాను తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలని, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. ఒకే పంట వరుసగా సాగు చేస్తే దిగుబడితో పాటు ధరలు కూడా పడిపోతాయని, పత్తి, మొక్కజొన్నలతో పాటు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పారు.మండల కాంగ్రెస్ నేత ఆకుల రుద్ర ప్రసాద్ మాట్లాడుతూ పూర్వీకుల పద్ధతులు వదిలి రసాయనాలు వాడటంతో భూమి నాశనం అవుతోందన్నారు. గ్రామంలో రైతుతో కమిటీ ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్‌లో రసాయనాల వినియోగం తగ్గిస్తామని, చంద్రయ్యపల్లెను జిల్లాలోనే సేంద్రియ సాగుకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా గ్రామ సర్పంచ్ ఎర్పుల సునిత కుమరస్వామి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంలో ఎస్సై క్రాంతి కిరణ్ సర్పంచ్ ఎర్పుల సునీత కుమారస్వామి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లోఆరు కెమెరాలు అమర్చినట్లు వాటి విలువ సుమారు 85000/-నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. గ్రామాభివృద్ధికి సర్పంచ్ తీసుకున్న ఈ చర్య అభినందనీయం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి అని పిలుపునిచ్చారు. గ్రామస్తులు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. 24 గంటల నిఘాతో గ్రామంలో భద్రత పెరుగుతుందని, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కుండే బాల కుమార్ మంద ప్రవీణ్ గ్రామ పెద్దలు సంకు శ్రీనివాస్ రెడ్డి ఎసల్ల సత్యనారాయణ, సుధ గాని విజేందర్,మంచాల కుమారస్వామి, కారోబార్ కంచ కట్టయ్య,ఏర్పుల కృష్ణ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాతలను వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలస శంకర్ గౌడ్ వనపర్తి రెడ్‌క్రాస్ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, స్వచ్ఛంద మానవతావాద సంస్థ అన్నారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించడం, వారికి సహాయం చేయడం రక్త దాన సంస్థ ఉద్దేశం అని అన్నారు ఈకార్యక్రమంలో గంధం నాగరాజు డా బండారు శ్రీనివాస్ మురళి వసీం అక్రమ్ గోవిందు శ్రీమతి లక్ష్మి నర్స్ సంతోష్ కుమార్ తిరుపతయ్య పాల్గొన్నారని శంకర్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు
బీసీ హక్కుల కోసం గొంతెత్తినందుకే నాపై రాజ్యాంగ విరుద్ధ సస్పెన్షన్ — పెరుమాండ్ల చరణ్ గౌడ్
కేసముద్రం/ నేటి దాత్రి
మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై భారత యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి కారణాలు చూపకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగ విరుద్ధం అని పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇస్తామని ప్రకటించారని. కానీ నేడు వాస్తవ పరిస్థితుల్లో మాత్రం బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీ యువతకు అవకాశాలు దక్కడం లేదని. పార్టీ కోసం కష్టపడిన అనుబంధ సంఘాల కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం బాధాకరం అని అన్నారు. నేను 2011 నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని. ఎన్ఎస్‌యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారని. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపై హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా అని. పార్టీ కోసం లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొన్నానని , కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోలేదు అని గుర్తుచేశారు.మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంపై నేను చేసిన నిరసన పూర్తిగా శాంతియుతం, ప్రజాస్వామ్యబద్ధమైనది. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశారు. కానీ దానికి ప్రతిఫలంగా నాపై సస్పెన్షన్ విధించడం బీసీ సమాజాన్ని అణచివేయడమే అని మండిపడ్డారు. ఈ ఘటన ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదని. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అని చెప్పే నాయకత్వం వాస్తవానికి బీసీ యువత గొంతును ఎంతవరకు అణచివేస్తుందో చూపించే ఉదాహరణ. బీసీ హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా? పార్టీ కోసం 15 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు ఇదేనా గౌరవం అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలలో, ముఖ్యంగా బీసీ యువతలో తీవ్రంగా వినిపిస్తున్నాయని అన్నారు. అందువల్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని, బీసీ సమాజానికి న్యాయం చేయడంతో పాటు తన పై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు.బీసీలకు న్యాయం జరిగే వరకు, కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడే కార్యకర్తలకు గౌరవం దక్కే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని ఎన్ ఎస్ యు ఐ మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల చరణ్ గౌడ్ స్పష్టం చేశారు.
పట్టణ కేంద్రంలోని సింగిల్ విండో(పీఏసీఎస్)చైర్మన్‌గా గుండెబోయిన నాగయ్య,వైస్ చైర్మన్‌గా చెందుపట్ల రాజిరెడ్డి శుక్రవారం మరోసారి బాధ్యతలు చేపట్టారు.కోర్టు ఆదేశాల మేరకు పాలకవర్గం తిరిగి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.సింగిల్ విండో కమిటీ పదవీకాలం 2025 ఫిబ్రవరి 14తో ముగియగా ప్రభుత్వం మొదట ఆరు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం 2025 ఆగస్టు 14న మరోసారి ఆరు నెలల పొడిగింపు కల్పించింది.అయితే మధ్యలోనే 2025 డిసెంబర్ 19న పాలకవర్గాన్ని రద్దు చేస్తూ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం కోర్టు పాలకవర్గాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో గుండెబోయిన నాగయ్య ఆధ్వర్యంలోని పాలకవర్గం తిరిగి బాధ్యతలు చేపట్టింది.ఈ సందర్భంగా డైరెక్టర్లుగా పంచగిరి శ్రీనివాస్,పిట్ట రమేష్,చెర్లపల్లి సునీత, కొలపాక అర్జున్,పోతరాజు సదయ్య,కోడపాక కృష్ణరాజు,కడుబేరి దేవేందర్ రెడ్డి,మంచుబోయిన కొంరయ్య, కొరివుల సిద్ధు,నాగుల అశోక్,బురి బిక్షపతి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ గుండెబోయిన నాగయ్య మాట్లాడుతూ మరికొన్ని రోజులు ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు,కార్యాలయ సిబ్బంది,పలువురు రైతులు పాల్గొన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి మండల సమైక్య సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో 14 నుంచి 18 ఏళ్ల బాలికలకు ప్రత్యేక స్నేహ సంఘాలు ఏర్పాటు చేసినట్లు మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ తెలిపారు. వేసవి సెలవుల్లో భాగంగా స్నేహ సంఘాల సమావేశాల ద్వారా కిశోర బాలికలకు భద్రత, విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం అంశాలపై శిక్షణలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు.శుక్రవారం జరిగిన సమావేశంలో పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి శోభవతి చరవాణి ద్వారా బాలికలతో మాట్లాడారు.
వేసవి సెలవులను ప్రణాళిక ప్రకారం వినియోగించుకోవాలని, తల్లిదండ్రులకు సాయపడాలని, మిగిలిన సమయంలో గొప్పవారి జీవిత చరిత్రలు చదవాలని, శారీరక దృఢత్వం ఇచ్చే ఆటలు ఆడాలని సూచించారు. అవసరానికి మాత్రమే మొబైల్ వాడాలని, అనవసర కాలక్షేపానికి దూరంగా ఉండాలని చెప్పారు.డాక్టర్ రేవతి మాట్లాడుతూ రక్తహీనత వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. మంచి ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు విరివిగా తీసుకోవాలని, హిమోగ్లోబిన్ 12 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు.ఈసమావేశంలో సర్పంచులు వీరగోని రాజ్‌కుమార్, పోగుల వనిత తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో సీసీలు బొజ్జ సురేశ్, నల్ల నర్సయ్య, సమైక్య అధ్యక్షులు రాధిక, శారద, శిల్ప, వివిధ గ్రామాల వివో ప్రతినిధులు, వివోఏలు పాల్గొన్నారు.
“ఆన్లైన్ సైట్” సాకుతో ఆలస్యం… దళారుల దోపిడీకి రైతుల బలి
అయినవోలు మండలంలో మొక్కజొన్న – వరి కొనుగోళ్లలో రాజకీయాలు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్న రైతుల గోడు పట్టదా??స్పందించని ఎమ్మెల్యే – నైరాశ్యంలో రైతులు
నేటి ధాత్రి అయినవోలు :-
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలో రైతులు పండించిన పంటకు సరైన ధర దక్కాలనే ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తుంటే, అక్కడ ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత, తూకాల ఆలస్యం, “ఆన్లైన్ సైట్ పనిచేయడం లేదు” అనే సాకులు… మరోవైపు వరి కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులుగా కాంటాలు కాక రైతులు పడుతున్న అవస్థలు ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యమని ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్లక్ష్యం మాత్రం రైతుల నష్టాలకు కారణమవుతోంది. కొనుగోలు ప్రక్రియలో జాప్యాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రంగంలోకి దిగి, తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మొక్కజొన్న రైతుల దుస్థితి
అయినవోలు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన రైతులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. గోనె సంచులు లేవని, సర్వర్ పనిచేయడం లేదని, ఆన్లైన్ నమోదు కాలేదని చెబుతూ అధికారులు కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూకాలు వేయడంలోనూ తీవ్ర ఆలస్యం జరుగుతుండటంతో రైతులు ఎండలో, రాత్రిళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చివరకు విసిగిపోయిన రైతులు ప్రభుత్వ ధర కోసం ఎదురు చూడలేక, దళారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగి రైతు అప్పుల్లో కూరుకుపోతుంటే… మరోవైపు పండించిన పంటకు సరైన ధర దక్కకపోవడం రైతును మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
నందనం గ్రామంలో వరి రైతుల ఆందోళన
అదే మండలంలోని నందనం గ్రామంలో వరి కొనుగోలు కేంద్ర పరిస్థితి కూడా భిన్నంగా లేదని రైతులు చెబుతున్నారు. నెలరోజులుగా వడ్లు కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు పడే సూచనలు ఉండటంతో ధాన్యం తడిసిపోతుందేమోనని భయపడుతున్నారు.
సీఈవో నిర్లక్ష్యం వల్లే కాంటాలు జరగడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. “పంట పండించడం వరకే రైతు బాధ్యతా..? కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా..?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడం
అధికారులు సమయానికి స్పందించకపోవడం వల్ల రైతుల సహనం క్రమంగా కోల్పోతున్నారు.
“ఆన్లైన్ సమస్య” నిజమా..? సాకా..?
ప్రతి సమస్యకూ “సైట్ పనిచేయడం లేదు” అనే ఒకే సమాధానం చెప్పడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. సాంకేతిక సమస్యలు నిజంగానే ఉన్నాయా..? లేక కొనుగోళ్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి దళారులకు అవకాశం కల్పిస్తున్నారా..? అనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఒక ఉద్యోగి ప్రశాంతంగా గోనె సంచులు పక్కదారి పట్టిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి
రైతు పండించిన ధాన్యం కొనుగోలు కాక కొనుగోలు కేంద్రాల వద్దే పాడైపోతే, రైతు సంక్షేమం గురించి చెప్పే మాటలు ఎంతవరకు నిజమన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గోనె సంచుల కొరత నివారించాలి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.తూకాలు పారదర్శకంగా నిర్వహించాలి ఆన్లైన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. దళారుల దోపిడీని అరికట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అప్పుడే రైతులకు న్యాయం జరిగినట్లవుతుంది. లేదంటే కొనుగోలు కేంద్రాలు రైతులకు సహాయక కేంద్రాలుగా కాకుండా, కష్టాల కేంద్రాలుగానే మిగిలిపోతాయి.
రేపటి కరీంనగర్ నగర బందుకు నగర ప్రజలు సహకరించాలి-భూక్యా తిరుపతి నాయక్
కరీంనగర్, నేటిధాత్రి:
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కరీంనగర్ చరిత్రలో ప్రప్రథమంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని,అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం రోజున కరీంనగర్ నగర బంద్ కు పిలుపునిస్తున్నామని, ఈబందుకు కరీంనగర్ నగర అన్ని వర్గాల ప్రజలతో పాటు, వ్యాపార వాణిజ్య సంస్థలు, బందుకు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని, ఈబందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ శాంతియుతంగా బంధులో పాల్గొని సహకరించాలని కొత్తపెళ్లి మండల మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
సి.ఎస్.ఐ మిషన్ హైస్కూల్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్.జే.థామస్ మరణం పట్ల పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన థామస్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థించారు.థామస్ విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ గత 50 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.క్రమశిక్షణ,సేవాభావం,విలువల బోధనలో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.ఈ సందర్భంగా థామస్ కుటుంబ సభ్యులకు మొలుగూరి బిక్షపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జాఫర్ రిజ్వి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.