డిడిఎస్ ఆధ్వర్యంలో దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప…

డిడిఎస్ ఆధ్వర్యంలో దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిడిఎస్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా డిడిఎస్ సంఘం చేపడుతున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. డిడిఎస్ సంఘం ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ పప్పులు, ధాన్యాలు, బియ్యం వంటి ఆహార పదార్థాలు ప్రపంచంలోనే అరుదైన, విలువైన వ్యవస్థకు నిదర్శనమని వారు
పేర్కొన్నారు. ఇలాంటి ఆర్గానిక్ వ్యవస్థలు విస్తృతంగా కొనసాగితే ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ನೆಟಿ పరిస్థితుల్లో భూమిలో సారవంతం తగ్గిపోవడం, పాడి పశువుల సంఖ్య తగ్గడం వల్ల సహజ ఆహారాలు కొరతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటోందని, దీనికి ప్రత్యామ్నాయంగా డిడిఎస్ లాంటి సంస్థలు ప్రోత్సహిస్తున్న ఆర్గానిక్ సాగు విధానాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, రైతులు కలిసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్గానిక్ వ్యవసాయ ప్రాముఖ్యతపై చర్చించారు.

జీవన ఎరువులఫై రైతులకు అవగాహ సదస్సు..

జీవన ఎరువులఫై రైతులకు అవగాహ సదస్సు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సొసైటీ ఆవరణలో జీవన ఎరువుల వాడకం వలన లభించే లాబాల పట్ల వరంగల్ జిల్లా జాతీయ ఆహార భద్రత మిషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్ అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ ఆహరా భద్రత మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్ టెంట్
పి సారంగం టెక్నీకల్ అసిస్టెంట్ యం. రవి కుమార్ మాట్లాడుతూ జీవన ఎరువులు ప్రకృతిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులను ఉపయోగించి వాడడం వలన భూసారాన్ని పెంచి, పంటలకు అవసరమైన పోషకాలను అందించి, మొక్కల పెరుగుదల ఆరోగ్యకరంగా ప్రోత్సహిస్తాయన్నారు.

రసాయన ఎరువుల వాడకం తగ్గి వాతావరణ కాలుష్యాన్ని అరికడతాయని పేర్కొన్నారు.తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వలన అనేక నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.అలాగే సేంద్రియ ఎరువులు తయారుచేసే విదానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించారు.ఈ సదస్సులో పలువురు అధికారులు,రైతులు పాల్గొన్నారు

సేంద్రియ గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి నూతన ఆరంభం..

సేంద్రియ గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి నూతన ఆరంభం..

జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హన్మకొండ, నేటిధాత్రి:

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా, సేంద్రియ వ్యవసాయం మరియు చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం రోజున పబ్లిక్ గార్డెన్స్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళ వేదికలో ఏర్పాటు చేసిన జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నేటి మారుతున్న మోడరన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవి అన్నారు.ఈ సంత ద్వారా స్థానిక రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. వినియోగదారులు కూడా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా రైతుల వద్ద నుండే పొందగలరు అని తెలిపారు.
తరువాత, ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంతలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రైతులు, చేనేత కార్మికులు, గిరిజన కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి ఉత్పత్తుల ప్రత్యేకతలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ప్రదర్శించిన సేంద్రియ పంటలు, చేనేత వస్త్రాలు, గిరిజన హస్తకళా ఉత్పత్తులను అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version