రేపటి కరీంనగర్ నగర బందుకు నగర ప్రజలు సహకరించాలి-భూక్యా తిరుపతి నాయక్
కరీంనగర్, నేటిధాత్రి:
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కరీంనగర్ చరిత్రలో ప్రప్రథమంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని,
దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని,అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం రోజున కరీంనగర్ నగర బంద్ కు పిలుపునిస్తున్నామని, ఈబందుకు కరీంనగర్ నగర అన్ని వర్గాల ప్రజలతో పాటు, వ్యాపార వాణిజ్య సంస్థలు, బందుకు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని, ఈబందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ శాంతియుతంగా బంధులో పాల్గొని సహకరించాలని కొత్తపెళ్లి మండల మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
