హజ్ యాత్రికులను సన్మానము చేసిన తెలుగుదేశం పార్టీ నేత దస్తగిరి వనపర్తి నేటీదాత్రి .
హజ్ యాత్రకు వెళుతున్న హనీఫ్ హజీమ్ సలీమ్ హబూ బకార్ గుల్ మహ్మద్ ఫయాజ్ ఇంతీయాజ్ ఫారూఖ్ లను వనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎండి దస్తగిరి శాలువతో సన్మా నము చేశారు సయ్యద్ పాష అబ్దుల్లా బాసీద్ హజ్ యాత్రకు వెళ్లే వారిని సన్మానము చేశారని దస్తగిరి ఒక ప్రకటన లో తెలిపారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీనేత ఎండి రహీం అఫ్జల్ సయ్యద్ అక్తర్ ఎర్ర శ్రీను గులాం కాదర్ తదితరులు పాల్గొన్నారని దస్తగిరి తెలిపారు
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని బొల్లోని పల్లి గ్రామంలో పోలు దాసరి భద్రయ్య నిర్మల దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ మేరకు చరణ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలలు సాకారం చేసే దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇండ్లలో, తాత్కాలిక గుడిసెలో జీవిస్తున్న సామాన్య ప్రజలకు ఈ పథకం ఆశా కిరణంగా మారిందన్నారు. ప్రతి కుటుంబానికి గౌరవ ప్రధానమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగమంతం చేసే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ సిద్ధ సంతోష్, ఉప సర్పంచ్ బోళ్ల సర్వేశం, నాయకులు జిల్లా మునిందర్, కుసుంబ రఘుపతి, బత్తిని మల్లయ్య, జెట్టి రామ్మూర్తి, మోహన్, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి నియోజకవర్గంలో రైతులుపండించిన వడ్లను కొంటామని వనపర్తి ఎమ్మెల్యే తుడ మేగారెడ్డి రైతుల కు హామీ ఇచ్చారు వనపర్తి నియోజకవర్గంలో రైతులు ఆందోళన చెందవద్దు అని కోరారు శుక్రవారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్న ఎమ్మెల్యే ప్రారంభించారు_ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు లారీలు, గన్ని బస్తాల సమస్య ఉన్న అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారన ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనేత జగత్పల్లి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు
చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం మొగుళ్ళపల్లి నేటి దాత్రి
అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ నవత ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యునాని వైద్యుడు డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ సంధ్య, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నవత మాట్లాడుతూ తలసేమియా అనేది వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలో తగినంత హీమోగ్లోబిన్ ఉత్పత్తి కాక రక్తహీనత సమస్య తలెత్తుతుందని వివరించారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని, సమయానికి గుర్తించకపోతే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు.
తలసేమియా నివారణలో ముందస్తు జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, పెళ్లికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం, గర్భిణీలు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని అవగాహన కల్పించారు. అలాగే తలసేమియా బాధితులకు తరచుగా రక్తం అవసరమవుతుందని తెలియజేస్తూ రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో ప్రజలకు తలసేమియా లక్షణాలు, చికిత్స విధానాలు, పోషకాహారం అవసరం, ఆరోగ్య పరిరక్షణ చర్యలపై విపులంగా వివరించారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి సాగర్.
చిట్యాల, నేటిదాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ ఏకైక కుమార్తె దీపిక వెడ్స్ సాయిచరణ్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన చిట్యాల మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు అల్లం రవీందర్ గారు. వీరి తో పాటు మాజీ జెప్టీటీసీ గొర్రె సాగర్ ,మండల్ యూత్ ప్రెసిడెంట్ తౌటం నవీన్ గారు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ లో ప్రజాదరణ పొందుతున్న శ్రీ వినాయక కర్రీ పాయింట్ చపాతి సెంటర్ నేటి ధాత్రి:-( శ్రీరాంపూర్)
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పట్టణంలోని ఎస్ బి ఐ బ్యాంక్ సమీపంలో ఉన్న శ్రీ వినాయక కర్రీ పాయింట్, చపాతి సెంటర్ స్థానిక ప్రజల మధ్య మంచి గుర్తింపు పొందుతున్నది. రుచికరమైన కర్రీలు , వేడివేడి చపాతీలతో ఈ ఆహార కేంద్రం ప్రతిరోజు అనేక మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. తక్కువ ధరల్లో నాణ్యమైన భోజనం అందించడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఇక్కడ ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులు అలాగే స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో దీనిని తమ ప్రాధాన్య భోజన స్థలాలుగా ఎంచుకున్నారు. శుభ్రత, రుచి, వేగవంతమైన సేవల కారణంగా శ్రీ వినాయక కర్రీ పాయింట్ చపాతి సెంటర్ శ్రీరాంపూర్ లో ప్రముఖ ఆహార కేంద్రంగా నిలుస్తున్నది.
కొమ్మాల పశువుల అంగడి వద్ద అక్రమ పశువుల రవాణా నివారణపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గీసుగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ఫ్లెక్సీలు శుక్రవారం ఏర్పాటు చేశారు.పశువులను అక్రమంగా రవాణా చేయడం, అధిక సంఖ్యలో లోడ్ చేయడం, సరైన పత్రాలు లేకుండా తరలించడం, జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని సీఐ విశ్వేశ్వర్ ప్రజలకు తెలిపారు. పశువుల రవాణాకు సంబంధిత అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో లోడ్ చేయరాదని, పశువులకు ఆహారం, నీరు, తగిన స్థలం కల్పించాలని సూచించారు. జంతువులపై క్రూరత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ పశువుల రవాణా గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. జంతు సంరక్షణ చట్టాలు, రవాణా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.
నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కలెక్టర్ ఎమ్మెల్యే చైర్మన్ వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో పూర్తి చేసిన పాత మార్కెట్ యార్డు ఇంటిగ్రేటెడ్ సమీకృత కార్యాలయం పైన ఫస్ట్ ఫ్లోర్ లో సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడిమేగారెడ్డి మున్సిపల్ చైర్మన్ మాధవి వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ ఫణీ oద్ర చంద్రశేఖర్ రెడ్డి డి పి ఆర్ ఓ సీతారాం జిల్లా మార్కెట్.కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ ఎస్ ఎల్ ఎన్ రమేష్ లక్కకుల సతీష్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో టౌన్ హాల్ అందుబాటులో కి తెస్తామని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఫస్ట్ ఫ్లోర్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర దస్తావేజు లేకరులకు షాపులు ఏర్పాటు ఒకే దగ్గర ఉండాడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మేగారెడ్డి మున్సిపల్ చైర్మన్ మాదవికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే మేగా రెడ్డి మాట్లాడుతూ అద్దె భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సొంత భవనాల లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో సబ్ రిజిస్టార్ కార్యాలయం షాప్స్ ఒకేదో దగ్గర ఏర్పాటు డాక్యుమెంటా రైటర్స్ షాపుల లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా షాప్స్ ఉన్నాయని వాటిని త్వరలో అందరి అభిప్రాయాలు సేకరించి అందుబాటులోకి తెస్తామని అదేవిధంగా లబ్ధిదారులకు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు బులియన్ మర్చంట్ బంగారు షాపులు ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కౌన్సిలర్ బ్రహ్మం 20 గుంటల స్థలం అడిగారని ఎమ్మెల్యే చెప్పారు మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 23 లక్షలతో ట్రాన్స్ఫార్మర్లు ఇతర పనులు చేయించామని చెప్పారు
పట్టణంలోని రాజీపేట ప్రాంత ప్రజలు ఈ రోజు సీఐ ఒంటేరు రమేష్ జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.జన్మదిన సందర్భంగా పరకాల సివిల్ ఆసుపత్రిలో డాక్టర్.అల్లే రాజు ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు అరటిపండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొచ్చు రాజు స్వేరో, బోట్ల నరేష్,గడ్డం రమేష్,ఏకు రఘుపతి,విక్రమ్,ఏకు బాబు, గోవిందా అజయ్,పోతుగంటి అర్జున్, ఎల్తూరి శ్రీనివాస్,ఒంటేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ రాష్ట్ర నేత,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్
నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో నిర్మించిన చారిత్రాత్మక శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కూల్చివేతపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శుక్రవారం డిమాండ్ చేశారు.పురావస్తు శాఖ పరిధిలోని కాకతీయుల నాటి వారసత్వ సంపదను స్కూల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హస్తం ఉందని పెద్ది ఆరోపించారు. మట్టి కోట మధ్యలో ఉన్న శివాలయం 100 శాతం పురావస్తు శాఖ ఆస్తి అని, కాకతీయ కట్టడాలను తాకే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.స్కూల్ నిర్మాణం ముసుగులో అర్ధరాత్రి శివాలయాన్ని వెయ్యి ముక్కలు చేసి, రెండు గజాల లోతు తవ్వారని, గుప్తనిధుల కోసమే ఈ దురాశ అని విమర్శించారు. నర్సంపేటలో ఎమ్మెల్యే మాధవ రెడ్డే కాంట్రాక్టర్ అని, ‘శ్రీమాత కన్‌స్ట్రక్షన్’ పేరుతో బినామీ టెండర్లు వేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.శివాలయ విధ్వంసంపై ఇప్పటివరకు కాంట్రాక్టర్, అధికారులపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. దోచుకున్న సంపద మొత్తం రికవరీ చేసి, శివాలయాన్ని పునర్నిర్మించాలని, బాధ్యులైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, ఢిల్లీలోని పర్యాటకశాఖ, సీఎస్, పురావస్తుశాఖ, దేవాదాయ శాఖ, డీజీపీ, గవర్నర్‌కు బీఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పునర్నిర్మించకుంటే, రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో పార్టీనే శివాలయాన్ని పునర్నిర్మిస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు.ఈకార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తక్కల్లపెల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, జిల్లా నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, నాడెం శాంతి కుమార్,బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యువరాజు, మండల శ్రీనివాస్,నాగిశెట్టి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి, ప్రచార కార్యదర్శి, పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
గుడిబండ గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన. సర్పంచ్.
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా.. చలివేంద్రం ఏర్పాటు.
బాటసారులకు సేద తీరే అవకాశం సర్పంచ్ మందుల నాగయ్య.
కోదాడ, నేటి ధాత్రి:
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు శుక్రవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో సర్పంచ్ మందుల నాగయ్య చొరవ చూపి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల ప్రజలు పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు దాహంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో (డి ఎల్ పిఓ) డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీ ఓ, గ్రామ ఉప సర్పంచ్ ఇర్ల జయసింహా రెడ్డి, సెక్రటరీ, వార్డు మెంబర్లు సిబ్బంది తదితరులు పెద్దలు పాల్గొన్నారు.
రైతులు,మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలో కొడవటంచ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజా పాలన _ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పశుసంవర్ధక చికిత్స అవగాహన శిబిరం, రైతు వారోత్సవం, రైతు వారం నీటిపారుదల శాఖ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రారంభించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు,పాడి పశువుల పెంపకదారులు మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.పాడి పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స, మేలు జాతి దూడల పెంపకం కోసం లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భాదారణ చేయించుకోవాలని రైతులకు సూచించారు.అలాగే రైతు వారోత్సవం కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో కలుపు నివారణ,చేపల వ్యాధుల నిర్వహణ,చేపల ఉత్పత్తి పెంపు చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతు వారం కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులు, కాలువలలో పూడిక తొలగింపు,జమ్ము కంపచెట్ల తొలగింపు వంటి పనులను సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి భూపాలపల్లి మార్కేట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు ప్రజాప్రతినిధులు,రైతులు, మత్స్యకారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
2027 జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్, సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోచేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్, సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి చేవెళ్ల ప్రధాన కూడలి బస్టాండ్, శంకర్పల్లి చౌరకస్తావరకు నిర్వహించిన జనగణన నడకలో సిబ్బంది బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. యాదగిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ ఛైర్పర్సన్ సమతావెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 లోగా ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలన్నారు. దీనిపై విద్యావంతులు, అధికారులు ప్రజలకు అవగాహనా కల్పించాలన్నారు.ప్రజలు సులభంగా వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రకటన పత్రాలపై ఉన్న QR కోడ్‌లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పద్ధతి ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా, తప్పులు లేకుండా ఖచ్చితమైన గణాంకాలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ B. యాదగిరి, అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
కాకతీయుల నాటి ఆలయాన్ని అదే స్థలంలో పునర్నిర్మించాలి
వేద పండితులతో ఆలయ శుద్ధి: నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్
భాజపా జిల్లా కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ గ్రామంలోని మట్టి కోటలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని అక్రమంగా కూల్చివేయడంపై నిరసనగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శుక్రవారం ‘ధర్మాగ్రహ దీక్ష’కు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 700 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేయడం హిందూ సమాజ మనోభావాలపై జరిగిన దాడి అని మండిపడ్డారు. కూల్చిన స్థలంలోనే ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నర్సంపేట ప్రజల చిరకాల కోరికను గౌరవించి పనులు ప్రారంభించే వరకు శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.అనంతరం దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గంగాజలంతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.
“హర హర మహాదేవ”, “జై శ్రీరామ్” నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.శివభక్త సంఘాలు, హిందూ ఐక్య వేదిక, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఆలయాన్ని కూల్చివేసిన కాంట్రాక్టర్, జేసీబీ డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు పోరాటం ఆగదని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జూలూరి మనీష్ గౌడ్ నర్సాపేట డివిజన్ పరిధిలోని అన్ని మండలాల అధ్యక్షులు రాధారపు అశోక్,గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, తడుక వినయ్ గౌడ్, నాయిని అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ దుంకదువ్వ రంజిత్,గంగిడి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ, కుంభం కోమల్ రెడ్డి, మహిళా నాయకులు వసంతకుమారి,మార్త సంధ్యారాణి,ప్రతాప్ రెడ్డి ,జరుపుల వీరన్న నాయక్, బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మైనింగ్ పనులు నిలపాలని.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రం శివారులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో క్వారీలో భారీ బ్లాస్టింగ్ నిర్వహించడంతో మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూకంపం వచ్చినట్టుగా భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ఇండ్లు ఊయల ఊగాయి. బ్లాస్టింగ్ తీవ్రతకు కొన్ని ఇండ్లు కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల ఇండ్ల గోడలకు పగుళ్లు వచ్చాయని, రోజురోజుకూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని వాపోయారు. హైదరాబాద్ నగరంలోని కాలుష్య సమస్యల నుంచి దూరంగా ప్రశాంత జీవనం కోసం బాలానగర్‌లో ఇళ్లు నిర్మించుకున్నామని.. ఇప్పుడు క్వారీ బ్లాస్టింగ్‌లతో ఇళ్లే ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ క్వారీ నుంచి ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో మండల కేంద్రంలో గాలి కాలుష్యం పెరిగిపోయిందని, శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో జరిగే భారీ బ్లాస్టింగ్‌లతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై శనివారం సర్పంచ్ గుమ్మల్ల వెంకటేశ్వర్, టి.పిసిసి సమన్వయకర్త దత్తాత్రేయ, వార్డు సభ్యులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. బ్లాస్టింగ్ శబ్దాలతో మండల కేంద్రంలోని ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారని బ్లాస్టింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.
మక్కల కొనుగోళ్లు నిలిపివేతపై నర్సంపేట మార్కెట్‌కు తాళం వేసిన రైతులు
కలెక్టర్ వచ్చి కొనుగోళ్లు పూర్తిచేస్తేనే ధర్నా విరమిస్తాం: ఆందోళనలో రైతులు
నర్సంపేట, నేటిధాత్రి:
అమ్మకాల కోసం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కు మొక్కజొన్నల రైతులకు కన్నీళ్లు మిగులుతున్న పరిస్థితి ఎదురవుతున్నది. గురువారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వేల కింటల్లా మొక్కలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్‌లో మక్కల నిల్వలు ఉన్నాయని చెబుతూ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం నర్సంపేట మార్కెట్‌కు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మక్కల కొనుగోళ్లు చేపట్టాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అమ్మకానికి తెచ్చిన మక్కలు తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.వరంగల్ జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ఈ రోజే మక్కల కొనుగోళ్లు పూర్తిచేస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు.నర్సంపేట మండలం బాంజీపేట గ్రామానికి చెందిన రైతులు కట్ల ఇంద్రారెడ్డి,భూషబోయిన రమేష్ మాట్లాడుతూ మార్క్ పెడ్ సహకారంతో మద్దతు ధరతో ప్రభుత్వం మక్కలు కొనుగోళ్ళు చేస్తున్నారని గత రెండు వారాల క్రితం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కు మక్కజొన్నలు తెచ్చామని తెలిపారు.ఈ నెల 2 నుండి కొనుగోళ్ళు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నాటినుండి జొన్నలవద్ద రాత్రిపగలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో వారం రోజులుగా కొనుగోళ్లు నిలిపివేశారని, 20 రోజులుగా మార్కెట్‌లో పడిగాపులు పడుతున్నామని మరికొంత మంది బాధిత రైతులు తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్, మార్క్‌ఫెడ్ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మక్కలను కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఆన్లైన్లో 24 అటెండర్ ఉద్యోగాలు ఖాళీలను చూపెడుతున్న అధికారులు
జడ్పీ సీఈఓ స్పందించి అటెండర్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 38)విడుదల చేసిన ఆర్థిక శాఖ ఏప్రిల్ 21, 2026 ఈ 38 జీవో ప్రకారం అటెండర్లతో పాటు, సాధారణ బదిలీల పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.నిబంధన ఒకే చోట 3 సంవత్సరాల సేవ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.బదిలీల కాలపరిమితి మే 1, 2026 నుండి మే 31, 2026 వరకు దరఖాస్తు చేసుకోవాలి ఈ బదిలీలు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ లేదా ఆన్‌లైన్ పద్ధతిలో, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా బదిలీలో భాగంగా జరుగుతుంది ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలలో 51 అటెండర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 24 ఉద్యోగాలను మాత్రమే ఖాళీగా ఉన్నాయని ఆన్లైన్లో చూపెడుతున్న జెడ్పి సీఈఓ కార్యాలయం అధికారులు దీనితో స్థానికంగా పనిచేస్తున్న అటెండర్స్ ఉద్యోగులు దూరప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. జిల్లాలో ఏ మండలంలో అటెండర్ ఉద్యోగాలకు ఖాళీ ఉన్నాయ్ అనేది చూపెడితే వారు వెళ్లే ప్లేస్ ను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు కానీ అలాంటిది వీలు లేకుండా కేవలం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే 24 ఉద్యోగాలకు ఖాళీ ఉన్నట్టు జడ్పీ కార్యాలయం అధికారులు చూపెడుతున్నారు దీంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 ప్రకారం జిల్లాలో ఉన్న అటెండర్ ఉద్యోగాలకు ఖాళీలు వెంటనే ఆన్లైన్లో వచ్చేలా చూడాలని జెడ్పి సీఈవో ను కోరుతున్నాం వారు వెంటనే స్పందించి ఆన్లైన్లో 51 అటెండర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఓపెన్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు
మాతో పెట్టుకోకు..! సీఎం కుర్చీ దగ్గర బీజేపీ బ్రేక్..?”
దేవుడు వరమిచ్చాడు..! ప్రజలు గెలిపించారు..! కాంగ్రెస్ తోడైంది..! కానీ… సీఎం కుర్చీ దగ్గరికి వచ్చేసరికి… ఢిల్లీ బ్రేక్ వేసిందా..?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక్క పేరు… విజయ్..! సినిమాల్లో మాత్రమే కాదు… రాజకీయాల్లోనూ “బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్” ఇచ్చిన హీరో..! పార్టీ పెట్టి చాలా తక్కువ టైమ్‌లోనే… ప్రజాదరణను ఓట్లుగా మార్చి… సీఎం కుర్చీ దాకా చేరుకోవడం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది..! అన్నీ సెట్ అనుకున్న టైమ్‌లోనే… ఒక్కసారిగా గవర్నర్ ట్విస్ట్..!
అక్కడే మొదలైంది అసలు పొలిటికల్ సినిమా..! ప్రశ్న ఒక్కటే..! ఇది రాజ్యాంగ ప్రక్రియనా..? లేక ఢిల్లీ రాసిన స్క్రిప్టా..? ఎందుకంటే… తమిళనాడులో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఎంతుందో అందరికీ తెలుసు..! సొంతంగా అధికారానికి వచ్చే సీన్ లేదు..! ప్రాంతీయ పార్టీల భుజాలపై కూర్చుంటే తప్ప అక్కడ కమలం వికసించే పరిస్థితి లేదు..! అలాంటి చోట… విజయ్‌పై ఇంత అగ్రెసివ్ స్టాండ్ ఎందుకు..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..! విజయ్ బీజేపీ వైపు చూడలేదు..! ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా NDAలోకి రాలేదు..! అదే కాదు… ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి నడవడానికి సిద్ధమయ్యాడు..! అదే ఢిల్లీ పెద్దలకు మండించిన పాయింట్ అంటున్నారు విశ్లేషకులు..!
“మాతో లేకపోతే… ఎదురుగా ఉన్నట్టే” ఇదే మెసేజ్ ఇవ్వాలనుకుందా బీజేపీ..? దేశమంతా విస్తరిస్తున్న తమ శక్తిని చూసీ… తమ ప్రత్యర్థితో చేతులు కలుపుతావా..? అనే ఆగ్రహమే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉందన్న చర్చ జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది..!
కానీ ఇక్కడ విజయ్ చేసిన పని… చాలామంది సీనియర్ రాజకీయ నేతలకే షాక్ ఇచ్చింది..! ఎక్కడా ఎమోషన్ కాలేదు..! ఎక్కడా హడావిడి చేయలేదు..! అందరి మద్దతు కూడగట్టుకుని… “నాకు సంఖ్యాబలం ఉంది” అని సైలెంట్‌గా పవర్ చూపించాడు..! గవర్నర్‌ను కలవడం..! అసెంబ్లీలో మెజారిటీ నిరూపిస్తానని చెప్పడం..! బ్యాక్‌డోర్ డ్రామాకి… ఫ్రంట్‌డోర్ ఆన్సర్ ఇవ్వడం..! ఇవి అన్నీ చూసి… “ఇతను కొత్త పొలిటీషియన్ కాదు… ఫ్యూచర్ పవర్ సెంటర్” అన్న అభిప్రాయం బలపడింది..!
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత దేశ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం క్లియర్ అయింది..! విజయ్ ఇక కేవలం సినిమా హీరో కాదు..! ఢిల్లీని కూడా అలర్ట్ చేసే స్థాయికి ఎదిగిన “పొలిటికల్ పవర్ సెంటర్”..!
15 రోజుల్లో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిలిపివేయాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమం
నర్సంపేట, నేటిధాత్రి:
15 రోజుల్లో నర్సంపేట పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ఆదేశించారు.నర్సంపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ సహకారంతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, స్పూన్లు, ప్లేట్లు, స్ట్రాలు, అలాగే 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి వందల ఏళ్లు పడుతుందని, ఇది భూగర్భ జలాలను కలుషితం చేయడమే కాకుండా పశువుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతోందన్నారు.ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో 15 రోజుల్లోగా నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.ఫంక్షన్ హాల్స్‌లో పేపర్, ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా సిరామిక్ ప్లేట్లు, గాజు గ్లాసులు వినియోగించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బయోడిగ్రేడబుల్ కవర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ప్రత్యామ్నాయంగా బయో కవర్లు వినియోగించాలని హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులను కోరారు. ఫంక్షన్ హాల్స్‌లో సిరామిక్ ప్లేట్లు, గాజు గ్లాసులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ నవీన్, కౌన్సిలర్ పొన్నాల మనిషా ప్రకాష్, ఫంక్షన్ హాల్, హోటల్, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు, ప్లాస్టిక్ దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
భాజపా జిల్లా కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న నిర్వహించే బీజేపీ నిర్వహించే మోడీ భారీ బహిరంగ సభకు నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలిరావాలని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నర్సంపేటలోని బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని, బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, వనపర్తి మల్లయ్య, కోమల్ రెడ్డి, పాలడుగుల జీవన్, పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.