తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగార నికి చెందిన బౌతు అన్నపూర్ణ సోమవారం ప్రజావాణిలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు. ఇదే విషయమై గతంలో తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించారని కానీ హద్దులు కరెక్ట్ కాదు అని మళ్లీ తమ పహారి గోడను కూలగొట్టి తమ ఇంటి లోపల పిల్లర్ వేసిందని అన్నారు. తాము భయభ్రాంతులకు గురై డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా తమపై బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యూత్ నాయకుడు ఎర్ర సుమన్ తండ్రి మోహన్ రెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్తివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు లే0కాలసాయిలు, చల్ల రాజన్న, మెరుగు రాజు, చిన్నాల మల్లేష్, కడుదూరీ సురేందర్, కూ స కళింగ రాజు, లింగయ్య, చంద్రమౌళి, రవి తదితరులు ఉన్నారు.
వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ జిల్లా అనుమతి పొందిన భూకొలతదారుల సంఘం–2025 నూతన కార్యవర్గ ఎన్నికలు రంగశాయిపేటలోని ఓ కార్యాలయంలో జనవరి 4వ తేదీ రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికలను న్యాయ సలహాదారులు గోనె విజయ్ రెడ్డి, బర్ల పూర్ణచందర్ పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా దేవునూరి రాజు ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ విభాగ సమన్వయకర్తగా మామిడాల సాయిరామ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బొమ్మెర రమ, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, సలహాదారుగా ఆవునూరి శివకుమార్‌ను నియమించారు. మహిళా విభాగం సమన్వయకర్తగా బలుగురి దీపిక, నర్సంపేట విభాగం సమన్వయకర్తగా పెంతల విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని పదమూడు మండలాలకు పదమూడు మంది సమన్వయకర్తలు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అనంతరం అధ్యక్షుడు దేవునూరి రాజు మాట్లాడుతూ, త్వరలోనే డెబ్బై గ్రామాల్లో పునః భూకొలతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామని, భూకొలతదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సభ్యులందరూ ఐకమత్యంతో నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లెల భాగ్యమ్మ ను సోమవారం మహిళా మండలి వివో (VO) అధ్యక్షులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు సర్పంచ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో .. సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ కొత్తగూడ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, తనను గౌరవించిన మహిళా సంఘాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి వివో ప్రతినిధులు, సీసీ విజయ, వివోలు సురేష్, ప్రమీల, జానకి,గ్రామ ప్రముఖులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
శాయంపేట మండలం మైలా రం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నూనె దివ్య తిరుపతినీ మున్నూరుకాపు కిసాన్ సంక్షేమ సంఘం అధ్య క్షుడు పంచగిరినర్సయ్య మరి యు ఉపాధ్యక్షులు నూనె శ్రీనివాస్ మున్నూరు కాపు సభ్యులు వీరికి అభినందనలు తెలిపి వారిని శాలువాతో సన్మానించారు.అనంతరం గ్రామ ప్రజలు మీపై నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్ ఎన్నుకు న్నారు రాజకీయాల కతీతంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు కృషిచేయాలని అదేవిధంగా గ్రామ అభివృ ద్ధికోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.
#రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన ఏ ఈ పవిత్ర.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
డిబిఎం 38 కెనాల్ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏ ఈ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కెనాల్ భూమిని ఎలాంటి సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందడంతో నిర్మాణం చేపడుతున్న స్థలాలతోపాటు గతంలో నిర్మాణం చేపట్టిన వారికి శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కెనాల్ హద్దులు దాటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపడుతున్న వారు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలని సంబంధితలను ఆదేశించారు.
#భారీ వాహనాలతో ధ్వంసం అవుతున్న సిసి రోడ్.
మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి నుండి కస్తూరిబా గురుకుల పాఠశాలకు డిబిఎం 38 కెనాల్ పై నుండి రహదారి కోసం సిసి రోడ్ నిర్మాణం చేయగా. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే సీతా రామాంజనేయ స్వామి ఆలయం ప్రక్కన రెడ్ మిక్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే దుమ్ము దూళితో విద్యార్థులు, భక్తులు, చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు కర్మాగారానికి వాహనాలు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే కెనాల్ పై భారీ వాహనాలు నడపడంతో గురుకుల పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందు పడుతున్నారని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే కెనాల్ దారి వెంబడి వాహనాలు నడపరాదని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు ఏఈ పవిత్ర తెలిపారు. ఆమె వెంట రెవిన్యూ ఏఆర్ఐ చామంతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
తెలంగాణ జాగృతి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం పిరియడ్ మందితో మొదలై, తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడినటువంటి సంస్థలో, ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీల సహకారంతో జాగృతి అంచలంచెలు ఎదిగిన విషయం వాస్తవం. అప్పటి బడుగు బలహీనవర్గాల కార్యకర్తల కృషితో కల్వకుంట్ల కవిత అధికారం వచ్చిన తర్వాత అందలమెక్కి, అధికార గర్వంతో కార్యకర్తల భుజాలను తొక్కి విలాసవంతమైన జీవితం అనుభవించి, తన గురించి పని చేసిన కార్యకర్తలను మరిచి, అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈరోజు తమ ఉనికి చాటుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో రావడం సిగ్గుచేటు. జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా రేపు సిరిసిల్ల జిల్లా పర్యటన కి వచ్చే సందర్భంలో ఎక్కడ కూడా ఆదరణ లభించకపోవడంతో డబ్బులు పంచి, జనాలను మభ్యపెట్టి కొంతమందిని కూడా పెట్టి ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే ఈ పర్యటన. పర్యటనకు ముందు సాహితీవేత్తలను, కళాకారులను, బడుగు బలహీన వర్గాలను, మేధావులతో సమావేశాలు పెడతా అని చెప్పి కనీసం వీరిలో ఎవరిని కలవడం లేదు. ఎందుకంటే వీరెవరు కూడా కవితతో కలవడానికి ఇష్టం లేక ముఖం చాటేస్తున్నారు. అందుగురించి ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడికి వెళ్లి వారిని కలవడానికి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. గుడిలోకి పోతే భక్తులతో, హాస్పిటల్ కి వెళ్తే రోగులతో, స్కూల్లోకి వెళితే విద్యార్థులతో కలిసి మాత్రమే మాకు చాలా ఆదరణ ఉందని చెప్పుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి అధికారం కోల్పోయిన తర్వాత రావడం సిగ్గుచేటు. సిరిసిల్లలో ఉన్న బీడీ కార్మికులకు కనీసం పెన్షన్ విషయంలో ఇంతవరకు మాట్లాడని కవిత ఈరోజు మాట్లాడానికి వస్తుండడం మనం ఆలోచించాలి. రాష్ట్రంలో మహిళా సాధికారత గురించి కృషి చేస్తా అన్న కవిత రాష్ట్రంలో ఎంతోమంది మహిళలకు అన్యాయం జరిగినప్పుడు పని నెత్తి కూడా మాట్లాడలేదు. ఖమ్మం జిల్లా చింతపల్లి మండలంలో మరియమ్మ లాక్ అప్డేట్ గాని, ఎల్బీనగర్ లో లక్ష్మీ అనే మహిళను అప్పటి పోలీసులు విచక్షణారహితంగా కొట్టినప్పుడు మాట్లాడలేదు, గ్రూప్ వన్ అభ్యర్థిని చనిపోయినప్పుడు కనీసం పరామర్శించిన పాపాన పోలేదు, వరంగల్ విద్యార్థిని చనిపోయినప్పుడు కూడా సానుభూతి తెలియజేయలేదు. ఇలాంటి అంశాలు ఎన్నింటినో జాగృతి బాధితుల ఐక్యవేదిక నుండి ప్రతి జిల్లాలో ఎండ కట్టడానికి జాగృతి బాధితులు మరియు వారి కుటుంబాలు కవితను ప్రశ్నించడానికి ఐక్యవేదికగా ఏర్పాటు చేయనున్నాం.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన నాయకులు విష్ణు రెడ్డి ఆదివారం రోజున 47వ, 62వ డివిజన్‌లలో వివిధ కారణాలతో మృతి చెందిన దబ్బేట ఐలేష్,గద్దల కోర్నెల్,దాట్ల బాబు,బంగారి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకు ముందు కాజీపేట పెద్దమ్మతల్లి హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)ను ఎసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ సుధాకర్ రెడ్డి తో కలిసి విష్ణు రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత డివిజన్‌ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టి పి సి సి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తన నివసరంలో కలిసి శాలువాతో సన్మానం చేసిన డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త బీసీ ఉద్యమ నేత . మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో మా ప్రాంతం నుండి బీసీ యువకుడినైన నాకు జడ్పిటిసిగా అవకాశం కల్పిస్తే అంతఃకరణ శుద్ధితో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ హక్కుల కొరకు కృషి చేస్తానని ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధన్ రాజ్ గౌడ్ అన్నారు మాలాంటి యువతను రాజకీయంగా ప్రోత్సహించాలని మహేష్ కుమార్ గౌడ్ గారిని వారు అభ్యర్థించారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానత్వం ఉంటుంది యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందని డా: ధన్ రాజ్ గౌడ్ అన్నారు అనంతరం మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ధన్ రాజ్ గౌడ్,
సీ ఎం కార్యలయము ప్రజా వాణి నుండి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి లో 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ ప్రజాభవన్ నుండి ప్రజావాణిలో వచ్చిన, దరఖాస్తులు పరిష్కరించాలని జిల్లా లో ని అధికారులను కలెక్టర్ ఆదేశించారు
డిడిఎస్ ఆధ్వర్యంలో దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప
జహీరాబాద్ నేటి ధాత్రి:
డిడిఎస్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా డిడిఎస్ సంఘం చేపడుతున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. డిడిఎస్ సంఘం ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ పప్పులు, ధాన్యాలు, బియ్యం వంటి ఆహార పదార్థాలు ప్రపంచంలోనే అరుదైన, విలువైన వ్యవస్థకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఆర్గానిక్ వ్యవస్థలు విస్తృతంగా కొనసాగితే ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ನೆಟಿ పరిస్థితుల్లో భూమిలో సారవంతం తగ్గిపోవడం, పాడి పశువుల సంఖ్య తగ్గడం వల్ల సహజ ఆహారాలు కొరతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటోందని, దీనికి ప్రత్యామ్నాయంగా డిడిఎస్ లాంటి సంస్థలు ప్రోత్సహిస్తున్న ఆర్గానిక్ సాగు విధానాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, రైతులు కలిసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్గానిక్ వ్యవసాయ ప్రాముఖ్యతపై చర్చించారు.
మీషన్ మగ్దంపురం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ షర్ట్ పంపిణీ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని ముగ్దంపురం గ్రామంలోని చందు బంజారా యూత్ అసోసియేషన్ సభ్యులకు మీషన్ ముగ్దంపురం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ కార్తీక్ గౌడ్ జెర్సీ(టీ షర్ట్) లను ప్రోత్సాహకంగా అందించారు. మండ కార్తీక్ గౌడ్ మట్లాడుతూ గ్రామంలోని యువత క్రీడ స్ఫూర్తిని పెంపొందించాలని ఉద్దేశంతో జెర్సీలను అందించడం జరిగిందన్నారు.అదే విధంగా వచ్చే సంక్రాంతి పండుగకు నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న యువకులకు షటిల్ టోర్నమెంట్ ను ,మహిళలకు ముగ్గుల పోటీలను చందు బంజారా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సురేష్,సంతోష్,అంజన్ ,లక్కీ, విజయ్, తిరుపతి,శ్రీహరి, శ్రీను, దుర్గా, మురళి తదితరులు పాల్గొన్నారు.
జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
హన్మకొండ, నేటిధాత్రి:
హన్మకొండ గుండ్లసింగారంలోని జై భవాని కాలనీలో జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్య అతిథులు జీసస్ మినిస్ట్రీస్ అధ్యక్షులు బ్రదర్ వంశీ, వైస్ ప్రెసిడెంట్ సాల్మన్ పాల్గొన్నారు. చర్చి సభ్యులు మరియు స్థానికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వంశీ మరియు సాల్మన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్
◆-: ఎంపీ షెట్కార్ కు సత్కరించిన హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఆదివారం నాడు న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద గల ఎస్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిధులు ఎంపీ సురేష్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ లు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్ కి హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జాహిరుద్దీన్ మూర్తుజ పూలమాల శాలువకప్పి ఘనంగా సత్కరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జాహిరుద్దీన్ కు పార్టీ నాయకత్వం భరోసా కల్పించి భవిషత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని అభయం ఇచ్చింది. కార్యక్రమంలో యువ నాయకులు జిషన్ పటేల్, మాజి ఎంపిటిసి మొహమ్మద్ శుకుర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండా పార్టీల ఐక్యతే దేశానికి ప్రత్యామ్నాయం-చాడ
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్తానంలో ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, నిర్భంధాలు త్యాగాలతో కూడిన చరిత్ర అని, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ లో ఆదివారం కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ శతవసంతాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ, బహిరంగ సభకు పల్లా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగరంలోని సర్కస్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ రెవెన్యూ గార్డెన్ వరకు సాగింది. అనంతరం రెవెన్యూ గార్డెన్ లో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడారు. ఈసందర్భంగా పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26తో వందేళ్లు పూర్తి చేసుకుందని, ఈదేశంలో వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం మొదట పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ అని వెంకటరెడ్డి గుర్తు చేశారు. దేశంలోని అన్ని రంగాల్లోని ప్రజలను ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి స్వాతంత్ర్య పోరాటంలో బాగస్వాములను చేసిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో బాగస్వాములైనారని, కానీ నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టీ ఆపార్టీ నాయకులు అప్పుడు లేరని అన్నారు. ఆర్ ఎస్ఎస్ మాత్రం కమ్యూనిస్టు పార్టీ కంటే ఆరు నెలల ముందు ఆవిర్భవించిందని తెలిపారు. స్వాతంత్ర్య పోరాట అనంతరం తెలంగాణాలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినోద్దీన్ లాంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు తెలంగాణ సాయిధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. నిజాం కు వ్యతిరేకంగా పోరాడి ఈప్రాంతంలోని గ్రామాలను వెట్టి నుంచి విముక్తి చేసి లక్షల ఎకరాలు పంచిన చరిత్ర సిపిఐకుందని అన్నారు. ఆపోరాటంలో వేల మంది కార్యకర్తల ప్రాణాలను త్యాగం చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదన్నారు. సాయిధ పోరాటానికి వణికి పోయిన పెత్తందారులు, భూస్వాములు, నిజాం తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేశాడని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం ఎంతగానో క్రుషి చేశారని తెలిపారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ,రాజభరణాల రద్దు వంటి కార్యక్రమాలు సిపిఐ పోరాటాల ఫలితంగానేమ అమలయ్యాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. కమ్యూనిస్టుల సూచనతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఉపాధి చట్టంలో సవరణలు చేసి రాష్ట్రాలపై భారాన్ని మోపుతుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యధాతదంగా కొనసాగించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర గొప్పదని అన్నారు. తెలంగాణ సాయిధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర… ముఫైఐదు వందల గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర, నలభై ఐదు వందల మంది ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర ఏపార్టీకి లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాంటలో కరీంనగర్ కు ప్రత్యేక స్థానముందన్నారు. అనభేరి ప్రబాకర్ రావు లాంటి వాళ్లు పేదల పక్షాన కొట్లాడి తన ప్రాణాలను ఫణంగా పెట్టి అమరుడైనారని గుర్తు చేశారు. ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమైతేనే దేశంలో ప్రత్యామ్నాయం కాగలమన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సందర్భంగా కమ్యూనిస్టులు, ప్రజాస్వామిక వాదులు ఏకం కావాలని కోరారు. అప్పుడు ఈదేశంలో మార్పు తప్పకుండా వస్తుందన్నారు. నరేంద్రమోడి అధికారంలో వచ్చాక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. కమ్యూనిస్టు సిద్దాంతం అజేయమైందని, సమసమాజ స్థాపన కోసం దోపిడి రహిత సమాజం కోసం పార్టీ శ్రేణులు క్రుషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకోవాలని కోరారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్ ప్రసంగించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహా, డిహెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అందే స్వామి, పొన్నగంటి కేదారి, శంకర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కోయడ సృజన్ కుమార్, బోయిన అశోక్, న్యాలపట్ల రాజు, నాగేల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, బోయిన తిరుపతి,పిట్టల సమ్మయ్య, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, బండ రాజిరెడ్డి, గోవిందుల రవి, కొట్ట అంజలి, ఉమ్మెత్తల రవీందర్ రెడ్డి, కళ్యాణ్, చో క్కల శ్రీశైలం, గజ్జ ఐలయ్య, మౌలానా, మచ్చ రమేష్, బ్రాహ్మణపల్లి యుగంధర్, రామారావు, వెంకటేష్, సుజాత, లక్ష్మీ మమత, బిర్లా రమ, స్వాతి, పైడిపల్లి వెంకటేష్, బోయిని పటేల్, తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల అరెస్టు అప్రజాస్వామిక చర్యరేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ
మహబూబాబాద్/ నేటి ధాత్రి
రేవా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శాంతియుతంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్నికి వెళ్లకుండా మహబూబాద్ జిల్లా శాఖ రేవా బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
గత 2024 మార్చి నుండి పదవి విరమణ ఉద్యోగస్తులందరికీ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ అనేక ఇబ్బందులను గురి చేస్తుందని, ఇప్పటికీ 46 మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వంలో చలనం లేదని నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వెళ్తున్న జిల్లా అధ్యక్షుడు సంకాబద్రి నారాయణను,ప్రధాన కార్యదర్శి గుగులోత్ కిషన్ నాయక్ను, ఉపాధ్యక్షులు రిటైర్డ్ సిఐ రవీందర్ ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్రమ అరెస్టు చేశారని తెలిపారు. ఇది అప్రజాస్వామిక చర్యని, అదేవిధంగా జిల్లాలో డోర్నకల్ లో బాధ్యుడు ఏసు రత్నాన్ని, తొర్రూర్ లో ఇట్ట సోమిరెడ్డి బృందాన్ని, పెద్ద వంగర లో ప్రభాకర్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని తెలిపారు.ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యని రాజ్యాంగపరమైన హక్కును కాలరాశారని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తన నిరసన తెలిపే అధికారం ఉన్నదని అన్నారు, సమాఖ్య ఆంధ్రలో 42 రోజులు సమ్మె చేస్తే ఒక్కసారి కూడా అరెస్టు చేయలేదని ఏరుకోరి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం అరెస్ట్ చేయడం మూర్ఖత్వం అని అన్నారు.ఇది ప్రజా ప్రభుత్వ విపల ప్రయాస మాత్రమేనని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వము మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.సోమాగోవర్ధన్ మురళీదరస్వామి, నిరంజన్, సుంకరి వెంకటేశ్వర్లు, చంద్రమౌళి తదితర రేవా సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నిజాంపేట మండలంలో తాహాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజీరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఎంపీవో నరసింహారెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల నివృత్తి కోసం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనాలన్నారు. ఉదయం 10: 30 నుండి 1 వరకు ఉంటుందన్నారు.
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాత్రి జహీరాబాద్ పట్టణం గాంధినగర్ కాలనిలో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం పర్వేజ్ మోహియోద్దీన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో వై.తరుణ్, బక్షు మోహియోద్దీన్, కె.సుభాష్ రెడ్డి,చెంగల్ జైపాల్,మారుతి,బి.దిలీప్, ఇబ్రాహీం,అహ్మద్,తదితరులు పాల్గొన్నారు
ఘనంగా దర్గా హజరత్ సయ్యద్ బుర్హాన్ ఉల్లా షా ఖాద్రీ ఉల్ చిష్టి(RA)వో బార్గా హజ్రత్ పౌపల్లా సయ్యద్ సుల్మాన్ షా ఖాద్రి ఉల్ ఛష్టి (RA) ఉర్స్ ఉత్సవాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో తకియ ఆవరణలో ఉన్న దర్గా హజరత్ సయ్యద్ బుర్హాన్ ఉల్లా షా ఖాద్రీ ఉల్ చిష్టి మరియు హజరత్ పౌపల్లా సయ్యద్ సులేమాన్ షా ఖాద్రి ఉల్ చీష్టి ఉర్స్ దర్గా సజ్జాదనషీన్ సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఇందులో భాగంగా దర్గాకు సందల్ సమర్పిస్తూ పెద్ద ఎత్తున ఖవ్వాలు కార్యక్రమం నిర్వ హించారు ఎందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. నిరంతరం సాయంత్రం కవ్వాల్ కార్యక్రమం హోరేత్యాయి ఇందులో దర్గాసజ్జాదనషీన్ సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి ప్రజా ప్రతినిధులు, అతిథి లతో ప్రత్యేక సన్మానించారు, సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి మాట్లాడు తూ.. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దర్గా లో సందల్ ఘనంగా నిర్వహించడం జరిగింది అదే విధంగా భక్తులు దర్శించు కున్నారు ఇందులో భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూసి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ దర్శించుకున్నాను అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముంతాజ్ షా,సయ్యద్ సదాక్ అలీ షా, సయ్యద్ ఫర్దీన్ షా,మాజీ కౌన్సిలర్, జాంగిర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు, హజ్రత్ మొహమ్మద్ నిజాముద్దీన్ ఖలీఫా జహీరాబాద్, హజ్రత్ మహమ్మద్ అస్లం షా ఖాద్రి చిష్టి ఖలందరి హైదరాబాద్, మొహమ్మద్ అల్లావుద్దీన్ నవనిర్మాణ ప్రజా సమితి అధ్యక్షుడు, మొహమ్మద్ రబ్బానీ ఖాన్,సయ్యద్ షరీఫ్, సయ్యద్ ముసైబ్,మహమ్మద్ జాహూర్ షా,సయ్యద్ షా ఫహద్,సయ్యద్ ఫారిస్ షా, మరియు జ్యోతి పండాల్ సీనియర్ నాయకురాలు టీఅర్పి పార్టీ, సింగర్ సంధ్య జహీరాబాద్ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గానికే పీఠమా..?
మున్సిపల్ పీఠానికి సీపీఐ కీలకం కాబోతుందా..?
రిజర్వేషన్ అనుకూలిస్తే బడా నేతలు బరిలోకి…!
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.బీఆర్ఎస్, సిపిఐ, బిజెపి పార్టీల నుంచి కూడా పలువురు టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గమే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే..క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు పాత నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడమే ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరికి మించి ఒకరు టికెట్ల కోసం స్థానిక మంత్రి వద్ద అపాయింట్మెంటు లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్ దక్కేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్టు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుండే కొత్త నేతలు అంతా కలిసి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారిన నేతలు మళ్లీ పాత పార్టీకే వెళదామా లేదా ఇదే పార్టీలో కొనసాగుదామా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పార్టీ నుండి వెళ్లిన వారిని తమ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు అన్నట్లు సంకేతాలు పంపిస్తున్నప్పటికీ, బలమైన నేతలు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలుచెబుతున్నాయి. మున్సిపాలిటీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రి ఇలాఖాలో మున్సిపాలిటీ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో అని రాష్ట్ర ప్రజానీకం,పుర ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ పీఠానికి సిపిఐ పార్టీ కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లపై చర్చ….
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అన్ని పార్టీల నాయకుల్లో రిజర్వేషన్ పై చర్చ జరుగుతుంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ ఉంటుందని సంకేతాలు వస్తున్నా సరే రొటేషన్ లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగానే ఉంది.మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ స్టేట్ ప్రాతిపాదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.