డిడిఎస్ ఆధ్వర్యంలో దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప
జహీరాబాద్ నేటి ధాత్రి:
డిడిఎస్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా డిడిఎస్ సంఘం చేపడుతున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. డిడిఎస్ సంఘం ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ పప్పులు, ధాన్యాలు, బియ్యం వంటి ఆహార పదార్థాలు ప్రపంచంలోనే అరుదైన, విలువైన వ్యవస్థకు నిదర్శనమని వారు
పేర్కొన్నారు. ఇలాంటి ఆర్గానిక్ వ్యవస్థలు విస్తృతంగా కొనసాగితే ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ನೆಟಿ పరిస్థితుల్లో భూమిలో సారవంతం తగ్గిపోవడం, పాడి పశువుల సంఖ్య తగ్గడం వల్ల సహజ ఆహారాలు కొరతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటోందని, దీనికి ప్రత్యామ్నాయంగా డిడిఎస్ లాంటి సంస్థలు ప్రోత్సహిస్తున్న ఆర్గానిక్ సాగు విధానాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, రైతులు కలిసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్గానిక్ వ్యవసాయ ప్రాముఖ్యతపై చర్చించారు.
