ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి..

ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
మండల కేంద్రాల్లోనే దరఖాస్తులు స్వీకరణ..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజా సమస్యల నివృత్తి కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నిజాంపేట మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని నేరుగా బాధితుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల దూర భారాలను దృష్టిలో ఉంచుకొని మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వివిధ సమస్యల నిమిత్తం ప్రజలు ప్రజావాణి కార్యక్రమన్నీ సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. సమస్యల సంబంధించి ఆయా శాఖల అధికారులకు దరఖాస్తులు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు

*ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 36వినతులు…

*ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 36వినతులు…

*కమిషనర్ ఎన్. మౌర్య…

తిరుపతి(నేటి ధాత్రి:

 

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ కమిషనర్ ను కోరారు. రాయల్ నగర్ 7వ క్రాస్ వద్ద ట్రాన్పోర్ట్ ఆఫీస్ ఉండడం వలన ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, చంద్రశేఖర్ కాలనిలో డ్రైనేజి కాలువలు ఏర్పాటు చేయాలని, ఎస్. కె. డి. నగర్ నందు డ్రైనేజి కాలువలను ఎలుకలు లోడేయడం వలన మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయి అరికట్టాలని, లక్ష్మిపురం కూడలి మూసివేయడం వలన ఇబ్బందిగా ఉండి పరిష్కరించాలని, కొరమీనుగుంట లో ఏర్పాటు చేయనున్నారు సెల్ టవర్ నిలుపుదల చేయాలని, టి. నగర్ లో కాలువలు శుభ్రం చేసి, దోమలు రాకుండా చర్యలు చేపట్టాలని, ఎస్. కె. డి. నగర్ లోని మునిసిపల్ స్కూల్ వద్ద శితిలావస్థ లో ఉన్న చెట్టును తొలగించాలని, గ్రీనపార్క్ అపార్ట్మెంట్ వెనుక పాడయిపోయిన కాలువలు మరమ్మతులు చేయాలని, నెహ్రు నగర్ లో అంబులెన్సు వచ్ఛేందుకు ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని, ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఆక్రమణకు గురైన రోడ్డును కాపాడాలని, ఎస్. ఎల్. Vi. నగర్లో తెలుగుగంగా నరు సరఫరా చేయాలని, సంజయ్ గాంధీ కాలని, సాయి విష్ణు లే ఔట్ లో అక్రమ నిర్మాణలను అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు..

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి…

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి…

తిరుపతి(నేటి ధాత్రి:

 

ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫిబ్రవరి 2 వ తేది సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుండి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పోన్ ద్వారా పిర్యాదులు చేసేవారు 0877-2227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ తెలియజేశారు.*
గమనిక: అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు…

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు..

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు

నిజాంపేట: నేటి ధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నిజాంపేట మండలంలో తాహాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజీరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఎంపీవో నరసింహారెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల నివృత్తి కోసం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనాలన్నారు. ఉదయం 10: 30 నుండి 1 వరకు ఉంటుందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version