మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కీ సన్మానం…

మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కీ సన్మానం

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లెల భాగ్యమ్మ ను సోమవారం మహిళా మండలి వివో (VO) అధ్యక్షులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు సర్పంచ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.
​ఈ కార్యక్రమంలో .. సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ కొత్తగూడ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, తనను గౌరవించిన మహిళా సంఘాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి వివో ప్రతినిధులు, సీసీ విజయ, వివోలు సురేష్, ప్రమీల, జానకి,గ్రామ ప్రముఖులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version