వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ జిల్లా అనుమతి పొందిన భూకొలతదారుల సంఘం–2025 నూతన కార్యవర్గ ఎన్నికలు రంగశాయిపేటలోని ఓ కార్యాలయంలో జనవరి 4వ తేదీ రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికలను న్యాయ సలహాదారులు గోనె విజయ్ రెడ్డి, బర్ల పూర్ణచందర్ పర్యవేక్షించారు.
ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా దేవునూరి రాజు ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ విభాగ సమన్వయకర్తగా మామిడాల సాయిరామ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బొమ్మెర రమ, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, సలహాదారుగా ఆవునూరి శివకుమార్‌ను నియమించారు.
మహిళా విభాగం సమన్వయకర్తగా బలుగురి దీపిక, నర్సంపేట విభాగం సమన్వయకర్తగా పెంతల విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని పదమూడు మండలాలకు పదమూడు మంది సమన్వయకర్తలు బాధ్యతలు స్వీకరించారు.
ఎన్నికల అనంతరం అధ్యక్షుడు దేవునూరి రాజు మాట్లాడుతూ, త్వరలోనే డెబ్బై గ్రామాల్లో పునః భూకొలతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామని, భూకొలతదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సభ్యులందరూ ఐకమత్యంతో నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
