ఘనంగా దర్గా ఉర్సు ఉత్సవాలు…

ఘనంగా దర్గా ఉర్సు ఉత్సవాలు…

ఘనంగా దర్గా హజరత్ సయ్యద్ బుర్హాన్ ఉల్లా షా ఖాద్రీ ఉల్ చిష్టి(RA)వో బార్గా హజ్రత్ పౌపల్లా సయ్యద్ సుల్మాన్ షా ఖాద్రి ఉల్ ఛష్టి (RA) ఉర్స్ ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో తకియ ఆవరణలో ఉన్న దర్గా హజరత్ సయ్యద్ బుర్హాన్ ఉల్లా షా ఖాద్రీ ఉల్ చిష్టి మరియు హజరత్ పౌపల్లా సయ్యద్ సులేమాన్ షా ఖాద్రి ఉల్ చీష్టి ఉర్స్ దర్గా సజ్జాదనషీన్ సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఇందులో భాగంగా దర్గాకు సందల్ సమర్పిస్తూ పెద్ద ఎత్తున ఖవ్వాలు కార్యక్రమం నిర్వ హించారు ఎందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. నిరంతరం సాయంత్రం కవ్వాల్ కార్యక్రమం హోరేత్యాయి ఇందులో దర్గాసజ్జాదనషీన్ సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి ప్రజా ప్రతినిధులు, అతిథి లతో ప్రత్యేక సన్మానించారు, సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి మాట్లాడు తూ.. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దర్గా లో సందల్ ఘనంగా నిర్వహించడం జరిగింది అదే విధంగా భక్తులు దర్శించు కున్నారు ఇందులో భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూసి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ దర్శించుకున్నాను అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముంతాజ్ షా,సయ్యద్ సదాక్ అలీ షా, సయ్యద్ ఫర్దీన్ షా,మాజీ కౌన్సిలర్, జాంగిర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు, హజ్రత్ మొహమ్మద్ నిజాముద్దీన్ ఖలీఫా జహీరాబాద్, హజ్రత్ మహమ్మద్ అస్లం షా ఖాద్రి చిష్టి ఖలందరి హైదరాబాద్, మొహమ్మద్ అల్లావుద్దీన్ నవనిర్మాణ ప్రజా సమితి అధ్యక్షుడు, మొహమ్మద్ రబ్బానీ ఖాన్,సయ్యద్ షరీఫ్, సయ్యద్ ముసైబ్,మహమ్మద్ జాహూర్ షా,సయ్యద్ షా ఫహద్,సయ్యద్ ఫారిస్ షా, మరియు జ్యోతి పండాల్ సీనియర్ నాయకురాలు టీఅర్పి పార్టీ, సింగర్ సంధ్య జహీరాబాద్ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా మిలాద్‌ ఉన్‌ నబి..

వైభవంగా మిలాద్‌ ఉన్‌ నబి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల సిద్దాపురం గ్రామంలో ముస్లిం సోదరులు మిలాద్‌-ఉన్‌-నబి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ప్రముఖ మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌లు చేశారు. ఇస్లాం మత స్థాపకుడైన మహ్మాద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని ముస్లింలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మసీదుల్లో మహ్మాద్‌ ప్రవకర్త, ఆయన చేసిన త్యాగాలు, సేవలను ఇమామ్‌ ముస్లింలకు వివరించారు. మహ్మాద్‌ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

 

 

ఆయన బోధనలను ఈ పర్వదినాన ముస్లింలు ఆచరించారు గ్రామంలో ఉన్న భక్తులందరికీ అన్నదానా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కులమత విభేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version