ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్
◆-: ఎంపీ షెట్కార్ కు సత్కరించిన హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఆదివారం నాడు న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద గల ఎస్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిధులు ఎంపీ సురేష్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ లు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్ కి హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జాహిరుద్దీన్ మూర్తుజ పూలమాల శాలువకప్పి ఘనంగా సత్కరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జాహిరుద్దీన్ కు పార్టీ నాయకత్వం భరోసా కల్పించి భవిషత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని అభయం ఇచ్చింది. కార్యక్రమంలో యువ నాయకులు జిషన్ పటేల్, మాజి ఎంపిటిసి మొహమ్మద్ శుకుర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
