ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

నిద్రపోతున్న “నిఘా” నేత్రాలు.

నిద్రపోతున్న “నిఘా” నేత్రాలు.

 

బ్రేకింగ్ న్యూస్, నేటిధాత్రి, వరంగల్

 

పాత సెంట్రల్ జైలుకు సంబంధించిన ఇండియ న్ ఆయిల్ పెట్రోల్ బంకులలో కొన్ని రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు?

భద్రకాళి కమాన్ ఎదురుగా, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులలో, ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు..!

CCTV camera.

ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా డమ్మీ అని సమాచారం?

నగర నడిబొడ్డున, ప్రధాన రహదారిలో, ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పెట్రోల్ పంపులలో, కనీసం ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి.

ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎవరు? ఉన్నతాధికారులు తనీకిలు చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్న వాహనదారులు.

ఇదే విషయంపై వెళ్లి ఫోటోలు, వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అసహనం..

CCTV camera.

సూపరిండెంట్ పర్మిషన్ ఉంటేనే ఫోటోలు తీయాలి అంటున్న పోలీసు సిబ్బంది.

ఎక్కడ లేని వింత అనే చెప్పొచ్చు? నగర ప్రధాన రహదారిలో, ఇంత పెద్ద పెట్రోల్ బంకుల్లో ఉన్న సిసి కెమెరాల వైర్లు పరిశీలిస్తే సగం కట్ అయి ఉండటం తద్వారా అవి డమ్మీ అని వాటిని చూస్తే అర్థమవుతున్న తీరు.

ఇప్పటికైనా సదరు సూపరిండెంట్ కానీ, స్థానిక పోలీసులు అయిన చొరవ తీసుకొని సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి.

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.

గురువారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్ క్రింద క్రమబద్దీకరణకు చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ తనిఖీ చేశారు.

District Collector

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ ఈ నెల 31 తో ముగుస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరకాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆడిగి తెలుసుకొగా అధికారులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.

నర్సంపేట మున్సిపల్ పరిధిలో 5732 మంది దరకాస్తూ చేసుకోగా 2271 క్రమబద్దీకరణకు మంజూరు చేయగా, 293 మంది ఫీజు చెల్లించారని,186 మందికి క్రమబద్దీకరణ పత్రాలు అందజేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు దారులు సకాలంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు దారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సంధ్య,టిపిఓ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

అందరిని ఆకర్షిస్తున్న రంగురంగుల బుట్టలు.

అందరిని ఆకర్షిస్తున్న రంగురంగుల బుట్టలు

రంగురంగుల బుట్టలు అల్లుతున్న మహిళలు

నేటి ధాత్రి కెమెరాలో చిక్కిన అందమైన బుట్టలు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద మహిళలు తమ ఉపాధి కొరకు రంగురంగుల బుట్టలు అల్లి ఉపాధి పొందుతున్నారు.

నేటి ధాత్రి రిపోర్టర్ నరేష్ గౌడ్ ఆ దారిలో వెళ్తూ వారిని చూసి వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా వారు మంచిర్యాల లోని రాజీవ్ నగర్ చెందిన మహిళలు స్వప్న,మహేశ్వరి, ప్రవళిక,తిరుమల,శకుంతల స్వయం ఉపాధి కొరకు రెండు సంవత్సరాల నుండి బుట్టలు అల్లుతూ ఉపాధి పొందుతున్నామని అన్నారు.

Colorful Baskets

ఈ బుట్టలు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకే విక్రయిస్తున్నామని చెప్పారు.

ఒక బుట్ట 200 నుండి 600 వరకు ఉంటాయని వినియోగదారులకు కావాల్సిన సైజులు ఆర్డర్ బట్టి తయారు చేసి ఇస్తామని చెప్పారు.వీరు ఉపాధి పొందుతూ కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.ప్లాస్టిక్ కవర్లు వాడకంతో పర్యావరణం కలుషితం అవుతుందని,ఇలాంటి బుట్టలు వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ఆటంకం లేదని,అలాగే కూరగాయల మార్కెట్ కు, స్కూల్ పిల్లల టిఫిన్ బాక్స్ లకు ఇంకా రకరకాల సైజులో అందమైన రంగురంగుల బుట్టలు కావలసిన వారికి అందిస్తామని చెప్పారు. ప్రజలు చాలామంది రంగుల బుట్టలు చూసి ఆకర్షితులై ఈ బుట్టల వలన ఉపయోగాలు తెలుసుకుని చాలామంది ప్రజలు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి.!

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి ప్రైమరీ విద్యార్థుల ప్రభంజనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట
పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.

MP నిధుల సహకారంతో CC రోడ్డు పనులు ప్రారంభం.

ఎంపీ నిధుల సహకారంతో సిసి రోడ్డు పనులు ప్రారంభం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ఎంపీ నిధులతో ఏర్పడిచేసిన సీసీ రోడ్డు పనులు స్థానిక గ్రామ బిజెపి నాయకులు బుధవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి గ్రామంలో ఎంపీ నిధుల సహకారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ సుధాకర్ శ్రీనివాస్ దివ్య సాగర్ శంకరి ముఖేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి.

ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి

గుండాల సిఐ రవీందర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏస్ పి రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఇల్లందు డి ఏస్ పి చంద్రభాను సూచన మేరకు బుధవారం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని శంబుని గూడెం గ్రామంను గుండాల సిఐ లోడిగ రవీందర్, కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ సందర్శించి వారికి వాలీబాల్ కిట్టు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ ఆదివాసి యువత నక్సలిజానికి, అసాంఘిక శక్తులకి దూరంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు. యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉంటూ విద్య వైపు తమ దృష్టిని మళ్ళించాలని, అప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపపారు. అదేవిధంగా క్రీడలను తమ దైనందిక కార్యక్రమాలలో భాగంగా చేసుకోవాలని, దాని ద్వారా శారీరకకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన, అనుమానస్పద వ్యక్తులు వచ్చిన పోలీస్ వారికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అన్ని డాక్యూమెంట్స్ కలిగి ఉండాలని, మద్యం త్రాగి వాహనాలు నడపారాదని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని, అపరిచితులకు తమ యొక్క బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్ లు తెలుపవద్దని చెప్పారు. శంబుని గూడెం గ్రామస్తులు తమకు వాలీబాల్ కిట్టు ఇవ్వడం ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

 

జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య మాదిగ డిమాండ్

 

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చింత అనిల్ మాదిగ ఆధ్వర్యంలో

ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపెల్లి యాకయ్యమాదిగ మాట్లాడుతూ భారతదేశం

ఒక లౌకిక దేశం భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి క్రైస్తవ సంఘాలు సంస్థలు మరియు సమాజం లో కుల మత పేద ధనిక మేధావి నిరాక్షరాశులనే భేదం లేకుండా అందరి మధ్య నిస్వార్ధంగా వైద్య విద్య మరియు సామాజిక రంగాలలో ప్రభుత్వంతో సమానంగా అఖండ సేవలందిస్తున్నాయి

ఈనాటికి బాధ్యత మైన క్రైస్తవ సమాజం నిస్వార్థ సేవలు అందిస్తూనే ఉంది స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా క్రైస్తవ సమాజంపై హత్యలు అత్యాచారాలు మాత్రం మారలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన

రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 (1) అధికరణాలను అనుసరించి దేశంలోని పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛను కల్పించింది కానీ కొంతమంది రాజకీయ స్వార్ధపరులు

రాజ్యాంగ చట్టాలను ఉల్లగించి తమ స్వార్థం కోసం మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని అశాంతి యుతంగా మారుస్తున్నారు మొన్న మణిపూర్ ఘటన
లో కూడా ఆడ మగ పిల్ల పాపలు అనే తేడా లేకుండా చిత్రహింసలకు గురి చేశారు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ను హత్య చేసి కొట్టి పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించేవిధముగావ్యవహరిస్తున్నారు.

పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీని పోస్టుమార్టం చేసి రిపోర్టులు న్యాయబద్ధంగా ఈయకపోతే క్రైస్తవ సమాజం శాంతియుతం మానుకొని శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక దోషులు ఎవరైతే ఉన్నారో వారికి చట్టపరమైన శిక్ష పడే విధంగా ఆంధ్ర రాష్ట్ర డిజిపి హోం శాఖ మంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గార్లు మానవిక కోణంలో విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ప్రేమ్ సాగర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి బాల్య శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి తాళ్ళపెల్లి ప్రభాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మిడతపల్లి విక్రమ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కోశాధికారి గుడెల్లి రవి, ఎర్ర రామచంద్రు, మచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు

ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ.

ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణ ప్రజలకు శుభవార్త
ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు బకాయి పడినటువంటి ఆస్తి పన్ను పై 90% వడ్డీని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
వన్ టైం సెటిల్మెంట్ (ఓ.టి.ఎస్) పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు గల ఆస్తి పన్ను బకాయిలపై గల వడ్డీనీ 90% వరకు మినహాయింపు ఇవ్వడం జరిగినది కేవలము ఆస్తి పన్ను వడ్డీలో కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లించి వారి యొక్క బకాయిలను పూర్తి చేసుకోవచ్చు, కావున భూపాలపల్లి పట్టణ ప్రజలు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని మునిసిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ పట్టణ ప్రజలను కోరినారు ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన యజమానులకు వారికి వారి యొక్క వడ్డీ రాయితీ భవిష్యత్తు చెల్లింపులతో సర్దుబాటు చేస్తారు కావున పట్టణ సద్వినియోగం చేసుకోవాలి

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో బీసీ..చలో ఢిల్లీ

-బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న పోరాటం గల్లీలో ముగిసింది..

ఇక ఢిల్లీలో చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ 2న చేపట్టిన హలో బీసీ..

చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం గల్లీలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామన్నారు.

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఢిల్లీని బీసీల దండు ముట్టడించబోతుందన్నారు.

ఏప్రిల్ 2వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తే కేంద్రంలోనే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు.

బీసీ నినాదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరన్నారు.

బీసీలను అణగదొక్కాలని చూస్తే వదిలిపెట్టబోమన్నారు.

బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా కారాదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలకు అన్యాయం చేస్తే వెంటాడుతాం..మేలు చేస్తే గుండెల్లో దాచుకుంటామన్నారు.

మా పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిపోతున్నామని ఆయన తెలిపారు.

మీనాక్షి నటరాజన్ ను కలిసిన.!

మీనాక్షి నటరాజన్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

భూపాలపల్లి నేటిధాత్రి

ఢిల్లీలోని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విస్లావత్ దేవన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి.

*వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి…

*మేయర్ డాక్టర్ శిరీష…

*చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 26:

 

వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా, ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు.

వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించారు.

నగరంలో ప్రజలకు ఇబ్బందులు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.

ముందస్తుగా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, వేసవిలో వచ్చే సీజనల్ వ్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందికి ఎండల వలన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

పలు చోట్ల నీరు వృధాగా పోతున్నదని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యాజమానుల సమావేశం ఏర్పాటు చేసి ఒకే ధరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.

కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని వారు ఎండల బారిన పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్ళు, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్య సిబ్బంది పనివేళల్లో మార్పులు చేశామని, మస్టర్ పౌయింట్ల వద్ద త్రాగునీరు, ors పాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

ఎండ వేడిమి నుండి తట్టుకునేలా తగు చర్యలు చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు.

ఎక్కడా మురుగునీరు నిలకుండా, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,
వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, తదితరులు పాల్గొన్నారు..

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు.

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ సమావేశం మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ కార్యక్రమం కన్వినర్ బనగాని రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ
ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించుటకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దీని ద్వారా ఓకే సారి ఎన్నికలు జరిగితే ఆదేశం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ప్రజాధనం వృధా జరగదని పరిపాలన సైతం వేగంగా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు సైతం ఇలాంటి డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారని దీనివల్ల సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని మనమందరం ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతించి జిల్లా మండల స్థాయిలో బూతు స్థాయిలో విస్తృత ప్రచారం చేసి పార్టీలకు అతీతంగా యువకులను మేధావులను బాగాసామ్యం చేసుకొని వారి సహకారంతో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు ఇది ఒక మంచి కార్యక్రమం అని ప్రజలందరికీ వివరించాలని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాన్నె మొగిలి దుప్పటి భద్రయ్య బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిప్ నాయకులుసోమా దామోదర్, మంద మహేష్ పున్నం చందర్, మిట్ట కుమార్,రాజశేఖర్, నరేందర్, సాయి పటేల్, ప్రవీణ్,హరిలాల్, రాజన్న, మల్లన్న, సంపత్, రామదాసు, రాకేష్ రెడ్డి,నరేష్, సమ్మయ్య,సంతోష్, తదితరులు పాల్గొన్నా
రు అనంతరం వివిధ గ్రామాల నుండి యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది వీరిని జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిదర్ రెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జాయిన్ అయినా వారు రజనీకాంత్ నవీన్ వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు

వికాస తరంగణి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం.

వికాస తరంగణి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని పశువుల ఆసుపత్రిలో బుధవారం రోజున వికాస తరంగణి వారి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

వికాస తరంగణి ఉపాధ్యక్షులు రిటైర్డ్ పశుసంవర్తన శాఖ జాయింట్ డైరెక్టర్ చాడసుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ వికాస తరంగిణి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు అందిస్తామని,ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

Farmers

ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.విజయ భాస్కర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హనుమకొండ జిల్లా, డాక్టర్ పి శ్రీనివాస్ సహాయ సంచాలకులు,సిహెచ్ వెంకటేష్ కమిషనర్,డాక్టర్ బి. వినయ్,డాక్టర్ శ్రీరామ్ పశువైద్యాధికారులు,పెద్ది ఆంజనేయులు ఎంపీడీవో, రవీందర్ నాథ్,కల్పన, రాంబాయిలాల్ సింగ్, రమేష్,కుమార్ పశు వైద్య సిబ్బంది,కుమారస్వామి, కిషోర్,కోటి,రవి పశువుల మందుల షాపుల యజమాన్యం సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు దయాకర్ రెడ్డి,రామచంద్ర రెడ్డి, పాల్గొన్నారు.

CPM అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే.

సీ పి ఏం అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే

వనపర్తి నేటిదాత్రి :

 

సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించార.

సర్వేలో ప్రధానంగా వాటర్ పైప్ లైన్ వేసి కంకర వేయినందున ఒక మహిళకు కిందపడి కాలు కు గాయాలు వార్డులో చేసిన పైప్ లైన్లు మొత్తం తేలుకొని ఉన్నాయి.

వాటిని వెంటనే మూయాలి.

వాటిని పైన సిమెంటు కంకర వేసి రోడ్డు సైజులో వచ్చేయాలని సీపీ ఏం నాయకులు డిమాండ్ చేశారు వార్డులో విద్యుత్తు లో వోల్టేజి సమస్య ఉన్నది.

వెంటనే లో వోల్టేజీ సమస్యను పరిష్కారం చేయాలి.

హనుమంతు ఇంటి పక్కల ఉన్న విద్యుత్ పోల్ ఇంటి స్థలంలో ఉన్నది.

రోడ్డుపైకి వేయాలి.

విద్యుత్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది.

భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేయాలి .

అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. చాలామందికి పెన్షన్స్ లేవు.

పింఛన్లు ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి.

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం .

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అనడం తప్ప ఒక్క రూపాయి మంజూరు చేయడం లేదు.

వెంటనే ప్రతి ఇంటి నిర్మాణానికి 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

దళిత వాడకుస్మశాన వాటిక లేదు .

వెంటనే దళిత వాడకు స్మశాన స్థలం కేటాయించాలి.

ఈ కార్యక్రమంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి ఏం పరమేశ్వర చారి, 18 వ వార్డు శాఖ కార్యదర్శి గంధం మదన్, సిపిఎం 18 వ వార్డు నాయకులు డి. బాలరాజు ,ఎం. మన్యం, రత్నయ్య, బాల పీరు, రవి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

# 20 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న బద్ధి పోచమ్మ తల్లి..

# జాతరలో అలరించునున్న ప్రభ బండ్లు.

#పకడ్బద్ధంగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు.

#గ్రామంలో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం.

#ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతరకు హాజరు కానున్న భక్తులు.

 

నల్లబెల్లి,నేటిధాత్రి:

 

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ బద్ది పోచమ్మ జాతర ఈనెల 28 న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి (పోచంపల్లి)లో అంగరంగ వైభవంగా జాతరను జరగనున్నది.జాతరను దిగ్విజయం చేయడం కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్ళు, విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా ఆలయం చుట్టూ అలంకరించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.

బద్ది పోచమ్మతల్లి ఎక్కడి నుండి వచ్చి వెలసింది..!

బద్ది పోచమ్మ తల్లి మొదటగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దుద్యాల గ్రామంలో గల కూన వంశస్థులు ఆరాధ్య దైవంగా పూజలు చేసేవారు తదనంతరం కూన అమ్మక్క బోల్లోనిపల్లి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేసి నేటికీ 20 దశాబ్దాలు కావస్తుంది.నాటి నుండి నేటి వరకు గ్రామస్తులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్వాహకులు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Baddi Pochamma Temple

ఆకర్షించనున్న ప్రభ బండ్లు…

జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు ఆకర్షిస్తాయి.భక్తులు తమ కోరిన కోర్కెలు తల్లి తీర్చడం వల్ల భక్తులు మొక్కుబడిగా ప్రభ బండ్లు కట్టి తమ మొక్కును చెల్లించుకుంటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడంతో తల్లి బద్దిపోచమ్మ పేరుతో వచ్చే అక్షరాలతో నామకరణం చేసి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందించే విధంగా ఆలయ ప్రాంగణంలో నామకరణం చేసి మొక్కును చెల్లిస్తారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత.

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభ బండ్ల అత్యుత్సాహంతో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం పునరావృతం కాకుండా బద్ది పోచమ్మ జాతరలో పకడ్పద్దంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. జాతరలో ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా,రాజకీయ వాతావరణానికి తావు లేకుండా చుట్టుపక్కల గ్రామాల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి గొడవలకు తావులేకుండా జాతరను సజావుగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరగా అన్ని పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించారని ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

వైభో పేతంగా బోనాలు..

Baddi Pochamma Temple

ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఉగాది పండుగకు ముందు వచ్చే శుక్రవారం బద్ది పోచమ్మతల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో
ఈనెల 28 న శుక్రవారం జరిగే బద్ది పోచమ్మ జాతరకు బొల్లోనిపల్లి గ్రామంతో పాటు నల్లబెల్లి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.ఈ క్రమంలో ప్రతి ఇంటి నుండి బోనాలతో పాటు యాటా పోతులతో బయలుదేరగా శివసత్తులు పూనకాలతో ఊగిపోతూ తల్లిని స్మరించుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో సొంత ఊరికి చేరుకొని పిల్ల పాపలతో , బంధువులతో కలిసి పండుగను సంబరంగా జరుపుకుంటారు.

జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు , తాగునీటి,ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడికి అనుగుణంగా భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి తెలిపారు. గురువారం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం కోసం పోలీస్ శాఖను కోరడం జరిగిందని అన్నారు.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ రైస్ మిల్లర్స్ ఎన్నికలు బుధవారం జరిగినవి. కల్వకుర్తి డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీచని బాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగెలుపునకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన.

*ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి

కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట(నేటిదాత్రి).

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో యువతకు మరియు చాలా కుటుంబాలకు ఉపాధిగా ఉన్న ఇసుక రవాణా ప్రభుత్వం నిలిపివేయడం వల్ల చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వారికి ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తూ ఇసుక ట్రాక్టర్లను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండడం వల్ల ఇదే ప్రధాన ఉపాధిగా భావించి చాలామంది ఆ తరువాత ట్రాక్టర్లను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి తమ ఉపాధిని కొనసాగిస్తూ ఉండేవారు అని ఇప్పుడు ఇసుక రవాణా ఆపివేయడం వల్ల వారు ఉపాధి కోల్పోయి వారితో పాటు వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడడం ఫైనాన్స్ లు కట్టలేక వారాంతపు చిట్టీలు కట్టలేక గిరి గిరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ కుటుంబాలకు ఏర్పడ్డదని మహేందర్ రెడ్డి అన్నారు.

గత రెండు రోజుల క్రితం వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కుటుంబాన్ని నడపలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ట్రాక్టర్ డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయాలని రాజీవ్ యువశక్తి పథకం కింద వీరందరికీ రుణాలు మంజూరు చేసి వారి పరిస్థితికి తగ్గట్టు వ్యాపారం లేదా వేరే పని చేసుకునేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఇదే విషయాన్ని ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోని స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చి డ్రైవర్లకు ఓనర్లకు న్యాయం జరిగే విధంగా పని చేయాలని వారిని డిమాండ్ చేశారు లేదంటే వారి తరపున భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రభుత్వంపై పోరాడి వారికి కావలసిన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఎల్లవేళలా పని చేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ఎన్నోసార్లు ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు జిల్లాకు చెందిన మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి వారి బాధలను చెప్పుకున్న వారి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆ విధంగా ఒప్పించే ప్రయత్నం చేయడం లేదని డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన కార్మికులు నిరాశలో ఉన్నారని వారికి సరియైన హామీ ప్రభుత్వం నుంచి రాకుంటే భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు.!

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్ షిప్ సస్పెండ్
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఏప్రిల్ నుండి ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయుటకు రంగం సిద్ధం చేసిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చిరాం ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు . జాయింట్ కలెక్టర్ డి ఎస్ ఓ సన్న బియ్యం పంపిణీ పై డీలర్ల సమావేశం నిర్వహించారని అధికారులు దిశా నిర్దాశము చేశారని తెలిపారు . వనపర్తి జిల్లా పట్టణంలో ప్రజలకు రేషన్ డీలర్లు ఎవరైనా దొడ్డు బియ్యం సరఫరా చేస్తే కలెక్టర్ కార్యాలయం డీఎస్ఓ కు ఫిర్యాదులు చేయాలని అధికారులు చెప్పారని బచ్చురాం తెలిపారు . ప్రభుత్వం అధికారులు ఆదేశాల ను అమలు చేసి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు సహకరించాలని కోరారు . జిల్లాలోని ప్రతి గ్రామంలో వనపర్తి పట్టణంలో రేషన్ డీలర్లు సన్న బియ్యం తీసుకోవాలని ఆయన కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version