నాట్స్ సంబరాలు ప్రారంభం…

టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల వద్ద ప్రవాసాంధ్రుల సందడి ఒకవైపు, సాయంకాలం జోరువాన మరో వైపు వెరసి.. టాంపా తెలుగుదనంలో తడిసి పరవిశించింది.

వేదిక ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నర్తనశాల పేరుతో దిగువ భాగాన్ని, రంగస్థలం పేరుతో పైభాగాన్ని ఈ వేడుకల నిర్వహణ కోసం నామకరణం చేశారు. రంగస్థల వేదికపై బ్యాంక్వెట్ విందు నిర్వహించారు.

సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేశారు. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ప్రారంభమైన నాట్స్ నేడు అమెరికాలో తెలుగు సంఘాల సేవా కార్యక్రమాల్లోనే కాకుండా మహాసభల నిర్వహణలో సరికొత్త రికార్డు నెలకొల్పిందని, వేడుకలు విజయవంతం చేయడంలో తనకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ టాంపా అనే ఊరు పేరును ఇకపై నది, అమెరికా సంస్కృతి అని కాకుండా.. నాట్స్ సంబరాలు జరిగిన నగరంగా గుర్తుంచుకుంటారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆయన స్వాగతం పలికారు.

ఈ వేడుకలకు ఫ్లోరిడా రాష్ట్ర సెనేటర్ జయ్ కాలిన్స్, అట్లాంటా కాన్సుల్ జనరల్ రమేష్ లక్ష్మణన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన జులై 4వ తేదీన ప్రవాస భారతీయ సంఘమైన నాట్స్ సంబరాల్లో పాల్గొనడం అమెరికాలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. డా. దేవయ్య, రుద్రమ్మ పగిడిపాటి దంపతులకు విశేష సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు. రచయితలు కళ్యాణ్ చక్రవర్తిని అధ్యక్షుడు మందాడి శ్రీహరి, రామజోగయ్య శాస్త్రిని మాజీ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బుల్లితెర నటీనటుల హాస్యవల్లరి అలరించింది.

సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తారలు జయసుధ, రజిత, సుధీర్‌బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని, మెహెర్ రమేష్, థమన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ అతిథుల వద్దకు వెళ్లి వారితో ఫోటోలు దిగి మరీ సభా ప్రాంగణమంతా సందడి చేశారు.

ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, నాదెండ్ల మనోహర్‌లతో పాటు మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, కావలి గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి మీనా, జయసుధ, నటుడు సాయికుమార్ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. బ్యాంక్వెట్‌కు చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ సంగీత విభావరితో ముగింపు పలికారు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు

పరకాల అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య

బాబా సాహెబ్ చిత్రపటానికి,విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు

 

పరకాల నేటిధాత్రి

 

సోమవారం రోజున పరకాల పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అగ్నిమాపక అధికారి వి. భద్రయ్య శ్రద్ధాంజలి ఘటించి మౌనంపాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు,కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు,మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని అన్నారు.

అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు

అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య భారత రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమపక సిబ్బంది పాల్గొన్నారు.

MP నిధుల సహకారంతో CC రోడ్డు పనులు ప్రారంభం.

ఎంపీ నిధుల సహకారంతో సిసి రోడ్డు పనులు ప్రారంభం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ఎంపీ నిధులతో ఏర్పడిచేసిన సీసీ రోడ్డు పనులు స్థానిక గ్రామ బిజెపి నాయకులు బుధవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి గ్రామంలో ఎంపీ నిధుల సహకారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ సుధాకర్ శ్రీనివాస్ దివ్య సాగర్ శంకరి ముఖేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version