ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన.

Kunduru Mahender Reddy.

*ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి

కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట(నేటిదాత్రి).

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో యువతకు మరియు చాలా కుటుంబాలకు ఉపాధిగా ఉన్న ఇసుక రవాణా ప్రభుత్వం నిలిపివేయడం వల్ల చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వారికి ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తూ ఇసుక ట్రాక్టర్లను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండడం వల్ల ఇదే ప్రధాన ఉపాధిగా భావించి చాలామంది ఆ తరువాత ట్రాక్టర్లను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి తమ ఉపాధిని కొనసాగిస్తూ ఉండేవారు అని ఇప్పుడు ఇసుక రవాణా ఆపివేయడం వల్ల వారు ఉపాధి కోల్పోయి వారితో పాటు వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడడం ఫైనాన్స్ లు కట్టలేక వారాంతపు చిట్టీలు కట్టలేక గిరి గిరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ కుటుంబాలకు ఏర్పడ్డదని మహేందర్ రెడ్డి అన్నారు.

గత రెండు రోజుల క్రితం వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కుటుంబాన్ని నడపలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ట్రాక్టర్ డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయాలని రాజీవ్ యువశక్తి పథకం కింద వీరందరికీ రుణాలు మంజూరు చేసి వారి పరిస్థితికి తగ్గట్టు వ్యాపారం లేదా వేరే పని చేసుకునేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఇదే విషయాన్ని ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోని స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చి డ్రైవర్లకు ఓనర్లకు న్యాయం జరిగే విధంగా పని చేయాలని వారిని డిమాండ్ చేశారు లేదంటే వారి తరపున భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రభుత్వంపై పోరాడి వారికి కావలసిన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఎల్లవేళలా పని చేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ఎన్నోసార్లు ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు జిల్లాకు చెందిన మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి వారి బాధలను చెప్పుకున్న వారి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆ విధంగా ఒప్పించే ప్రయత్నం చేయడం లేదని డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన కార్మికులు నిరాశలో ఉన్నారని వారికి సరియైన హామీ ప్రభుత్వం నుంచి రాకుంటే భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!