ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి
గుండాల సిఐ రవీందర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏస్ పి రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఇల్లందు డి ఏస్ పి చంద్రభాను సూచన మేరకు బుధవారం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని శంబుని గూడెం గ్రామంను గుండాల సిఐ లోడిగ రవీందర్, కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ సందర్శించి వారికి వాలీబాల్ కిట్టు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ ఆదివాసి యువత నక్సలిజానికి, అసాంఘిక శక్తులకి దూరంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు. యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉంటూ విద్య వైపు తమ దృష్టిని మళ్ళించాలని, అప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపపారు. అదేవిధంగా క్రీడలను తమ దైనందిక కార్యక్రమాలలో భాగంగా చేసుకోవాలని, దాని ద్వారా శారీరకకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన, అనుమానస్పద వ్యక్తులు వచ్చిన పోలీస్ వారికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అన్ని డాక్యూమెంట్స్ కలిగి ఉండాలని, మద్యం త్రాగి వాహనాలు నడపారాదని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని, అపరిచితులకు తమ యొక్క బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్ లు తెలుపవద్దని చెప్పారు. శంబుని గూడెం గ్రామస్తులు తమకు వాలీబాల్ కిట్టు ఇవ్వడం ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.