వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న.!

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న జరిగే నిరసనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ముఫ్తీ మౌలానా అబ్దుల్ సబూర్ ఖాస్మీ అధ్యక్షతన జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ లతీఫ్ రోడ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక జమాతే-ఇ-ఇస్లామీకి చెందిన మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హసమి, ముఫ్తీ ఉబైద్-ఉర్-రెహ్మాన్, ముహమ్మద్ నజీముద్దీన్ ఘౌరి, అమీర్ సంయుక్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రకారం, ఏప్రిల్ 30 బుధవారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:15 గంటల వరకు, అంటే 15 నిమిషాల పాటు “బాతి గుల్ ప్రచారం” కింద ముస్లింలందరూ తమ ఇళ్ళు, దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలలో లైట్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ద్వారా, కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ చట్టం, 2025పై మీ అసంతృప్తిని నమోదు చేయండి. ఈ బ్లాక్ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం ద్వారా మరియు ఇతర వర్గాల సంక్షేమం పేరుతో వివక్ష చూపడం ద్వారా భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులతో ఆడుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది, ఇది వాస్తవాలకు విరుద్ధం. ఈ సందర్భంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, తీవ్రంగా ఖండించారు మరియు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి, నిందితులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతిగుల్ ప్రచారం సందర్భంగా, ఎలాంటి శబ్దం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముహమ్మద్ మజీద్ ముహమ్మద్ మొయిజుద్దీన్, హఫీజ్ ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ ముహమ్మద్ యూసుఫ్ ముహమ్మద్ అబ్దుల్ ఖదీర్, ముహమ్మద్ ఫిరోజ్, ముహమ్మద్ అయూబ్ ఖాన్ ముహమ్మద్ వసీం మరియు ఇతరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ.

ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ

రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మార్వో

ఎమ్మార్వో సత్యనారాయణ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని 30 రేషన్ షాప్స్ డీలర్స్ తో తహసీ ల్దార్ కార్యాలయంలో సమా వేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుంది కాబట్టి డీలర్స్ వద్ద ఏమైనా మార్చి నెల దొడ్డు బియ్యం నిల్వలు ఉంటే అట్టి నిల్వలను పై నుండి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు బియ్యం ఇవ్వరాదని ,సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రతి రోజు ఉదయం 7 గం.లకు తీయాలని ,ఎట్టి పరిస్థితుల్లో కార్డ్ ఉన్న వారి దగ్గర డబ్బులు ఇచ్చి బియ్యం కొనకూడదు అలాంటి కంప్లైంట్స్ వస్తె 6-A కేసులు పెట్టుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆర్ ఐ తోపాటు మల్లయ్య అద్యక్షుడు మరియు డీలర్స్ పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో బీసీ..చలో ఢిల్లీ

-బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న పోరాటం గల్లీలో ముగిసింది..

ఇక ఢిల్లీలో చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ 2న చేపట్టిన హలో బీసీ..

చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం గల్లీలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామన్నారు.

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఢిల్లీని బీసీల దండు ముట్టడించబోతుందన్నారు.

ఏప్రిల్ 2వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తే కేంద్రంలోనే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు.

బీసీ నినాదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరన్నారు.

బీసీలను అణగదొక్కాలని చూస్తే వదిలిపెట్టబోమన్నారు.

బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా కారాదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలకు అన్యాయం చేస్తే వెంటాడుతాం..మేలు చేస్తే గుండెల్లో దాచుకుంటామన్నారు.

మా పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిపోతున్నామని ఆయన తెలిపారు.

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు.!

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్ షిప్ సస్పెండ్
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఏప్రిల్ నుండి ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయుటకు రంగం సిద్ధం చేసిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చిరాం ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు . జాయింట్ కలెక్టర్ డి ఎస్ ఓ సన్న బియ్యం పంపిణీ పై డీలర్ల సమావేశం నిర్వహించారని అధికారులు దిశా నిర్దాశము చేశారని తెలిపారు . వనపర్తి జిల్లా పట్టణంలో ప్రజలకు రేషన్ డీలర్లు ఎవరైనా దొడ్డు బియ్యం సరఫరా చేస్తే కలెక్టర్ కార్యాలయం డీఎస్ఓ కు ఫిర్యాదులు చేయాలని అధికారులు చెప్పారని బచ్చురాం తెలిపారు . ప్రభుత్వం అధికారులు ఆదేశాల ను అమలు చేసి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు సహకరించాలని కోరారు . జిల్లాలోని ప్రతి గ్రామంలో వనపర్తి పట్టణంలో రేషన్ డీలర్లు సన్న బియ్యం తీసుకోవాలని ఆయన కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version