నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పద్మశాలి భవనంలో మాణిక్ ప్రభు పాఠశాల ఆవరణలో శనివారం నా తెలుగు భాష అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ సీనియర్ సివిల్(జడ్జ్) న్యాయమూర్తి గంటా కవితా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా తెలుగు భాష అనే పుస్తకాన్ని రచయిత పివి భైరవన్ శర్మ రాశారు. ఈ కార్యక్రమం సమాచార్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా న్యాయ మూర్తి గంటా కవితదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించి నా తెలుగు భాష అనే పుస్తకాని ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ ముందుగా మాణిక్ ప్రభు పాఠశాల క్యారస్పాండెంట్ వెంకటయ్య ను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉపాధ్యాయులను, తల్లి తండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు పది సంవత్సరాలు కష్టపడి చదివితే విద్యార్థుల జీవితాలు మంచి స్థాయిలో ఉంటారని, విద్యార్థులు మీ సంతకం గురించి వేరేవారు ఎదురుచూతారో అపోయూడు విద్యార్థులు సక్సెస్ అవుతారని అన్నారు. అనంతరం రచయిత భైరవన్ శర్మను న్యాయమూర్తి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహేబూబ్, హరికృష్ణ, ఆకాష్, మహా రుద్రయ్య స్వామి, సంజీవ్ కుమార్, అత్తర్, రాజేందర్, యువరాజ్, మధు మాణిక్ ప్రభు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థిని
మహాదేవపూర్ జులై 5( నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో జడ్పీ హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఇటీవల భూపాలపల్లిలో అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిజవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ లో జరగబోయే సబ్ జూనియర్ అండర్ 14 ట్రై అత్లాన్ విభాగంలో పాల్గొంటుందని,ఆ పాఠశాలపిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO ప్రకాష్ బాబు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సరిత మాట్లాడుతూ విద్యార్థిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయలు మడక మధు,సుధారాణి,సరితా దేవి,హోలీ పాషా, శ్రీనివాస్,వసుదప్రియ,వీరేశం,సమ్మయ్య,లీలారాణి,రజిత,సాహెదా బేగం,ప్రసూన, దీపిక,ఆంజనేయులు, అజ్మత్ పాషా లు విద్యార్థినిఅభినందించారు

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు

రేగుంట హైస్కూలు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల..

మల్లాపూర్ జులై 4 నేటి రాత్రి
రేగుంట హైస్కూలు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నీటి కొరతను తీర్చిన రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ గ్రామస్తులు
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విద్యార్థుల కాల కృత్యాలు తీర్చుకోవడానికి కనీస నీటి వసతి లేక హైస్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్న విషయాన్ని పాఠశాల ఉపాధ్యా యులు విద్యార్థులు రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ కు తెలియచేయగా తక్షణమే స్పందించి తనతో పాటు కొద్దిమంది గ్రామస్తులు సహకారంతో కొత్త రిగ్గు మోటర్ అందించి విద్యార్థుల నీటి కొరతను తీర్చి అండగా నిలిచిన మల్లేష్ యాదవ్ సహకరించిన రేగుంట గ్రామస్తులకు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు
ఈ కార్యక్రమంలో..
కర్నె పవన్ కళ్యాణ్, కుందేళ్ల రాజేష్ ఎండీ భసీర్,కుక్కుదుగు అశోక్, పడిగెల నరేష్,ప్రకాష్ హబీబ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజు, నర్సింగ్ రావ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వం మొక్కు”బడి” పథకాలు…

 

ప్రభుత్వం మొక్కు”బడి” పథకాలు…

విశ్వ జంపాల,న్యాయవాది,మరియు విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం.ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.నేటి బాలలే రేపటి పౌరులు” అన్న నినాదాన్ని నిజం చేయాలన్న ఆలోచన ఏ మాత్రం పాలకులకు ఉన్నా, పుట్టిన ప్రతి బిడ్డను 5 ఏళ్ళ వయస్సులో దత్తత తీసుకోవాలి. విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి సమాజానికి అందించాలి. ఆ భాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. నిజానికి ఇది ప్రభుత్వం మీద ఉన్న చట్ట బద్ధమైన బాధ్యత కూడా.అన్ని ఉచితం అని ఊదర గొట్టే ప్రభుత్వాలు విద్యా-వైద్యం కోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్గిన సంస్థలను ఏర్పాటు చేయాలి. బోధన రుసుములు, ఉపకార వేతనాలు, పరీక్ష ఫీజులు, భోజన సౌకర్యం, దుస్తులు, పుస్తకాల పంపిణీ, బస్సు-రైలు పాసులు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వాహణ మొదలైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రజలను ప్రలోభ పెట్టే సాధనాలుగా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి. మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు గాని సామాన్య ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. విద్యా-వైద్య సమస్యలు ప్రజలను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పథకాలెన్ని ఉన్న ఫలితం శూన్యం. నల్లబల్ల పథకం (ఓ బి బి) 1987, ఏపీ ప్రాథమిక విద్యా పథకం (అప్పీప్) 1984, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డీపీఈ పి) 1996, సర్వశిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఏ) 2002, (దీన్ని 2007లో రాజీవ్ విద్యా మిషన్ (ఆర్ వి ఎమ్) గా మార్చారు. ఏపీ పాఠశాలల ఆరోగ్య పథకం (ఏపీ ఎస్ హెచ్ పి) 1992, విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం (ఈటీవీపీ) 1986, పాఠశాల సంసిద్ధాంత కార్యక్రమాలు (ఎస్ ఆర్ పి), ఆవాస పాఠశాలలు (ఆర్ ఎస్), దూరదర్శన్ పాఠాలు (టీవీ లెసన్స్), రేడియో పాఠాలు, టెలికాన్ఫరెన్సింగ్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం (స్పాట్) 1993, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం (సీసీఆర్ టీ), జాతీయస్థాయి సంస్థలు :- కేంద్రీయ విద్యా సలహా సంఘం (సి ఏ ఈ బి) 1921, కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం (సి ఏ ఎస్ ఈ) 1929, సార్జంట్ విద్యా కమీషన్, సెకండరీ విద్యా కమీషన్, యూనివర్సీటి గ్రాంట్ కమీషన్ (యూజీసీ) 1948, జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా మండలి (ఎన్ సి ఈ ఆర్ టీ) 1961, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టీ ఈ) 1973, ప్రాంతీయ విద్యా సంస్థ (ఎన్ ఐ ఈ పి ఏ) 1979, కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ (సి ఐ ఈ ఎఫ్ ఎల్) (ఇఫ్లూ) 1958. రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు :-రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (ఎస్ సి ఈ ఆర్ టీ) 1967, పాఠ్య పుస్తకాల రచయితల కమిటి, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ ఐ ఈ టీ) 1985, రాష్ట్ర విద్యా నిర్వహణ మరియు శిక్షణ సంస్థ (ఎస్ ఐ ఈ ఎమ్ ఏ టీ) 1979, రాష్ట్ర వనరుల కేంద్రం (ఎస్ ఆర్ సి) 1978, జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ (డైట్) 1989, మండల వనరుల కేంద్రం (ఎమ్ ఆర్ సి), స్కూల్ కాంప్లెక్స్ (ఎస్ సి), మొదలియర్ విద్యా కమీషన్, కొఠారీ విద్యా కమీషన్, ఛటోపాధ్యాయ విద్యా కమీషన్ 1983, జాతీయ విద్యా విధానం 1986, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి, బడిబాట, రాష్ట్ర విద్యా చైతన్య ఉత్సవాలు, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, సక్సెస్ పాఠశాలలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009, సాక్షర భారత్ (2009), మధ్యాహ్న భోజన పథకం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం (ఎన్ సి ఎఫ్) 2005, ప్రొఫెసర్ యశ్ పాల్ నివేదిక 1993, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2000. విద్యా ప్రైవేటీకరణ కోసం పున్నయ్య కమిటి (1992), స్వామినాదన్ కమిటి (1992), బిర్లా-అంబాని కమిటి (2000), విద్యా హక్కు చట్టం 2009, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ తదితర కమిటీలు కమిషన్లు పథకాలు ప్రవేశపెట్టాయి. వికలాంగుల కోసం, స్త్రీ విద్యకోసం, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంది. వీటితో పాటు ఒక్కొక్క స్కూలు మొత్తం 57 రకాల రికార్డులను మరియు రిజిష్టర్లను నిర్వహిస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వాలు మొక్కు “బడి” పథకాలుగా మార్చడం విశేషం. ఆయా పథకాలను ఎట్లా ప్రవేశ పెట్టాలో, ఎట్లా నీరు కార్చాలో మన దేశ పాలకులకు తెలిసినంతగా ప్రపంచంలో మరే దేశ పాలకులకు తెలియదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాషాయ విష గరళంగా మార్చిన సంగతి విధితమే. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం. కాషాయం కషాయంగా మారి విషంగా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో బహుజన దేశంగా ఉన్న భారతదేశాన్ని బ్రాహ్మణ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజల అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు.ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నప్పటికీ విద్యా-వైద్యం సామాన్యుడి దరి చేరడం లేదు. కారణమేదైన పాపం ప్రభుత్వాలదే. అక్కరకు రాని చుక్కలు ఎన్ని ఉంటేనేమి? సూర్యుడు ఒక్కడుంటే చాలు! అన్నట్లు వందల కొలది సంక్షేమ పథకాలు పెట్టడం కన్నా, అన్ని రకాల మౌళిక వసతులతో కూడిన సమీకృత/ఏకీకృత విద్యా-వైద్య సంస్థలను మండల కేంద్రం యూనిట్ గా స్థాపించడం మేలు. ఆరంభ సూరత్వం ఆ పైన అలసత్వం అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది. అక్షరాస్యత శాతం పెరిగిన దానికన్నా రెట్టింపు స్థాయిలో నాణ్యత ప్రమాణాలు, విలువలు దిగజారి పోయాయి. దేశంలో ఉపాధ్యాయులు, డాక్టర్ల కొరత 40 శాతానికి మించే ఉంటుంది. 5వ, తరగతికి వచ్చే సరికి 78%, 10వ, తరగతికి వచ్చే సరికి 62 శాతం, ఉన్నత విద్యకు వచ్చేసరికి 7 శాతానికి విద్యార్థుల సంఖ్య మించడం లేదు. 7 శాతంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలను, మౌళిక వసతులను కూడా ప్రభుత్వం తీర్చక పోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనం.విద్యార్ధులు చదువు మానివేయడం వెనుక ప్రధాన కారణం పేదరికం. పేదరికానికి ప్రధానకారణం నిరుద్యోగం, మన దేశంలో నిరుద్యోగం 31 శాతం ఉంది. మిగతా 69 శాతం మందిని ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్నటికీ, చాలా మంది అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేని వారిగా, నిర్దిష్ట ఆదాయం లేని వారిగా, అరకొర పనులతో చాలిచాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి విద్యను ఒక సాధనంగా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. పేదరికంతోనే ప్రజలు విద్యకు, వైద్యానికి దూరమవుతున్నారు. జాతీయ ఆరోగ్య ముసాయిదా ప్రకారం 6.3 కోట్ల మంది ప్రజలు ప్రతీ యేటా వైద్య ఖర్చుల కారణంగా దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రభుత్వం పేదరిక-నిరుద్యోగ నిర్మూలనకై కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు అందడం లేదు. రోగమొకటైతే, మందొకటి పెడితే రోగమెట్లపోవును అన్నట్లుంది ప్రభుత్వ పని విధానం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, విద్యను ఆయుధంగా మలచుకోగలిగితే నిరుద్యోగం, పేదరికం నిర్మూలించవచ్చు. ప్రపంచంలో అత్యంత విలువైనవి, అవసరమైనవి మానవ వనరులు. మానవ వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులను సమాజ అవసరాలకు, దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాల్చిన సామాజిక, చట్ట బద్ధమైన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని

పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని చార్మితో పాటు మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) లను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడి బి గౌతమి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భముగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ .

ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండలో గురువారం మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్డం చేసేందుకై తన వంతు సహకారంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఉచిత ల్యాప్టాప్ ల పంపిణీ కార్యక్రమం..తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (Girls) పాఠశాలకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK) ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా(ఎనిమిది)ల్యాప్టాప్ ల అందజేసిన చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ…మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా సన్నద్ధం కావాలని,వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి,వారిలోని ప్రతిభను ప్రోత్సహించి,వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాడానికి తన వంతు ప్రయత్నంగా ల్యాప్టాప్ లను అందజేస్తున్నాని,డిజిటల్ యుగంలో విద్యార్థులు మరింత సమగ్రమైన,మెరుగైన విద్యను పొందడానికి డిజిటల్& కంప్యూటర్ తరగతులు సహాయపడుతాయని,విద్యార్థులు కంప్యూటర్ కోడింగ్ లాంటి తదితర కొత్త విషయాలపై పాఠశాల దశలోనే అవగాహన కల్పించాలని,కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు సాగాలని తన వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…మా పాఠశాలకు ఎలాంటి సహాయం అడిగిన వెంటనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పందించి, సహాయ సహకారాలు అందిస్తున్నారని,గతంలో విద్యార్తులకు వాష్ రూమ్స్ విషయంపై స్పందించి వెంటనే ఒక లక్ష రూపాయలతో వాటికి మరమత్తులు చేయించారని,అలాగే ఈరోజు మా విద్యార్థులు అడిగిన వెంటనే ఉచితంగా ల్యాప్టాప్ లను అందించి అన్ని విధాలుగా మా పాఠశాలను సహాయ,సహకారాలు అందిస్తూ మా విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని,వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు…ఈ కార్యక్రమంలో…పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణ రత్నం, ఉపాధ్యాయులు మురళితో, సీనియర్ నాయకులు దశరథ్ నాయక్,లాలూ నాయక్, నర్సింగ్,రమేష్,రఘు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు కొండల్, యాదవ్,రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ

బిజెపి ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

అందుగులపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు పంపిణీ చేసిన బిజెపి నాయకులు…… మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు బిజెపి రాష్ట్ర యువ నాయకులు దారా రవి సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు నోటుబుక్కులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేష్ .

 

 

 

 

 

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కాకుండా విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగానే బిజెపి నాయకులు రవి సాగర్ రావు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగులు, పెన్నులు నోటుబుక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు మునుముందు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ మండలాధ్యక్షుడు జనార్ధన్ ఇన్చార్జ్ సంజీవరావు కన్వీనర్ అక్కల రమేష్ పట్టణ అధ్యక్షుడు నరేష్ సంతు రామ్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

అమ్మ మాట అంగన్వాడీ బాట.

అమ్మ మాట అంగన్వాడీ బాట

గర్భిణీలు బాలింతలకు పోషకాహార లోపం అవగాహన సదస్సు

మరిపెడ నేటిధాత్రి

 

 

 

చిన్నారుల ఎదుగుదల, గర్భిణి,బాలింతల మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ గొల్లపల్లి రాణి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు, అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో పాటు విద్య ను బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు,బాలింతలు,పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని గర్భిణీలు బాలింతలకు తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ యం.యశోద, జి.లలిత ఆయా నాగమ్మ, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై స్పందించని ఎంఈఓ

ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి .

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై స్పందించని ఎంఈఓ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై స్పందించని ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎఫ్డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి,ఫీజుల దోపిడీ కొనసాగిస్తున్న,అనుమతి లేకుండా పుస్తకాలు అమ్ముతున్న స్థానిక ఎంఈఓ ఏమాత్రం పట్టించుకోవడంలేదని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ పాఠశాలల ఆర్దిక దోపిడిని అరికట్టాలని కోరుతూ నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మార్త నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ,ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న స్థానిక విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.స్థానిక ఎంఈఓకు అనేక మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.తక్షణమే ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలతో కుమ్మక్కైన నర్సంపేట ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లపల్లి రాకేష్ పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…

పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పేదల కోసమే…

యువత జనం కోసం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్డేడియం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే 40 మంది విద్యార్థులకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో డబ్బులు సేకరించి మున్సిపాలిటీ కమీషనర్ గద్దె రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందించడం అభినందనీయమని కమీషనర్ అన్నారు. ఈ సంధర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కు సంబంధించిన సమస్యలు కమిషనర్ కు వివరించగా కమీషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె, గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్కేపీ యువత జనం కోసం పేదల కోసమే పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు గణేష్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ పేరేంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు.!

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు ఇవ్వాలి

మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి

 

 

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్ల లకు 25% సీట్లు కేటాయించి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు.విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 121సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను
కేటాయించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చొరవతిసుకొని ప్రైవేట్ స్కూల్ లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

శిథిలావస్థలో ఉన్న గదిలో తరగతులు నిర్వహించవద్దు

శిథిలావస్థలో ఉన్న గదిలో తరగతులు నిర్వహించవద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జిల్లాలో శితిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శిథిల గదులు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం

*జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ *

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

 

జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

జూన్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 02 FIRలు,04 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

 

SP Mahesh B. Gite IPS

 

విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,
ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.

మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

SP Mahesh B. Gite IPS

 

విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపారు.

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన .

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

లక్ష్యం మేరకు జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ సాధించాలి

జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి

జూనియర్ కళాశాలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి

ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎనరోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాల, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటి పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాల పై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.

 

 

 

 

 

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలో మొదటి సంవత్సరం 1777 అడ్మిషన్స్ సాధించడం లక్ష్యం కాగా 63% 1116 మంది విద్యార్థులు ఎనరోల్ చేసుకోవడం జరిగిందని అన్నారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్ , విద్యుత్ సరఫరా, పారిశుధ్య, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన, మైనర్ రిపేర్ పనులకు ప్రభుత్వం 1కోటి 80 లక్షల రూపాయల మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.

 

 

 

 

 

 

జూనియర్ కళాశాలలో అందించే విద్య నాణ్యత పెరగాలని అన్నారు. లెక్చరర్ సకాలంలో కళాశాలకు హాజరు కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో సప్లమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాత వేములవాడ ,ఎల్లారెడ్డి పేట, ఇల్లంతకుంట కళాశాలలో ఫలితాలు తక్కువగా వచ్చాయని తెలిపారు.

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ విద్య చాలా వెనకబడిందని, మౌలిక వసతుల కల్పన పనులు, పరీక్ష ఫలితాలో చాలా ఇంప్రూవ్ కావాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి జూనియర్ కళాశాలలో రెగ్యులర్ గా స్టూడెంట్ కౌన్సిలర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.

 

 

 

 

జూనియర్ కళాశాలలో యాంటి డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ అందించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో క్రీడలు ఆడు ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

 

 

 

 

మన జిల్లాలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం అందించిన ప్రత్యేక శిక్షణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని, ఇదే స్పూర్తి కొనసాగించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు , టెన్నిస్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ క్యారం బోర్డులు చెస్ బోర్డులు ఏర్పాటు చేసి అందించాలని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆ రూట్ లలో కాలేజీ సమయాలకు అనుగుణంగా బస్సులు నడిచేలా ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025.

నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించబడుతున్న నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (NSPC)-2025 పోస్టర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా lAS సోమ వారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకుపర్యావరణ పరిరక్షణ లో భాగంగా నీటి సంరక్షణ, చెట్లు నాటడం, మరియు తడి పొడిచెత్త వేరుచేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలని మరియు క్విజ్ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య DYSO రాందాస్ పాల్గొన్నారు.
“HARIT – The Way of Life” అనే నినాదంతో ఈ పోటీ July 1 నుంచి August 21, 2025 వరకు దేశవ్యాప్తంగా జరుగనుంది. August 30న ఫలితాలు ప్రకటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనవచ్చని వారు సూచించారు.
ఈ పోటీని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు.
పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీకి సంబంధించిన నమోదుకు, క్విజ్ పోటీకి సంబంధిత లింకులు కూడా విడుదల చేశారు.పోటీ గమ్యం: విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన లింక్ పోటీ
https://ecomitram.app/nspc/
వెబ్సైట్లో విద్యార్థులు చూడవలసిందిగా కోరారు.

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!*

◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్/ఝరాసంగం: ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి.. సర్కార్ బడులల్లో సదువుతున్న మీ పిల్లలకు సౌలతులు ఎట్లున్నాయో అరా తీయుర్రి.. రాష్ట్ర సంపాదనలో సగం వాట మీరు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములే..ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలి..నాయకులు, ఓట్లేసిన జనాలకు జీతగాళ్లు.ఇంకా నాయకులు ముందు సంకల చేతులు కట్టుకోని నిలబడడం బంద్ చెయ్యాలి.. బజాప్తాగా సర్కార్ స్కూళ్ళను సందర్శించి,మధ్యాహ్న భోజనాన్నిరుచిచూడండి..విద్యార్థులకు సరిపోయే టీచర్లు ఉన్నారో, లేరో తెలుసుకోవాల్సిన ఉంది,ఆడపిల్లలకు సరిపోయేన్ని టాయిలెట్లు,మరుగుదొడ్లు ఉన్నాయో లేవో అడిగితేల్సుకోండి,రేపు మాపో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలకు నాయకులు వస్తే,మీ ఊరి గవర్నమెంట్ బడులల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కడికక్కడ నిలదీయండి..పేద పిల్లలు చదువుకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారని, పేదోళ్లకు సదువు అందియకుండా, అగ్రవర్ణాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తులను సంకల పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు..పొమ్మనలేక పొగబెట్టినట్టు సర్కార్ స్కూళ్ళను సర్వనాశనం చేస్తున్న పలుకుబడి నాయకులు. జర జాగ్రత్త వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఓట్లు డిగే వారిని ప్రశ్నించలని. మనకు ఎవరు అందుబాటులో ఉండి పనిచేస్తారో ఆ నాయకుని దృష్టిలో పెట్టుకుని లేక మనకు వెనుకుండి కత్తి పోర్చు పొడిచే నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్లను రాబోయే స్థానిక ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా యువత ఐక్యమత్యంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి యువత గెలిచేల పనిచేస్తామని,గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధికి దోహదపడుతుందని,గ్రామఅభివృద్ధి యువతతోనే సాధ్యమని రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను తప్పకుండా యువత గెలుస్తుందని మండల పరిపాలన మొత్తం యువత చేతుల్లో ఉంటుందని అన్నారు.

ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు.

ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు

 

 

 

 

విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.

 

  • అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు: సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు
  • విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడంతోపాటు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 18004258599లో సంప్రదించాలని సూచించారు. రెండో విడత లాటరీలో 8,583 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సీట్లు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వారికి ఉచిత ప్రవేశాలు కల్పించాలని, సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం టేకుమట్ల మండలంలోని కస్తూరి భా గాంధీ గురుకుల పాఠశాలలో 2.30 కోట్ల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగ శాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి కలెక్టర్ గా విధులలో చేరిన సంవత్సర కాలంలో విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మండల ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం గురుకుల పాఠశాలల్లో తనికీలు చేపడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అడిగిన మేరకు పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి, చేతిపంపు, డయాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జిల్లా లోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…
విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు కోసం రికమెండ్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. గురుకులాల నుండి పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే రోజులు త్వరలో రాబోతున్నాయని.
విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యా బోధన అందించేందుకు మన నియోజకవర్గంలో ఘనపురం మండలం గాంధీ నగర్ గుట్ట వద్ద 30 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ క్యాంప్లెక్స్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. తన ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు పాఠశాలలకు 7 కోట్లు వరకు కేటాయించడం జరిగిందని
ప్రభుత్వ గురుకుల పాఠశాలలులో విద్యార్థుల కు వేడి నీళ్లు కొరకు గీజర్లు , దుప్పట్లు అందించామని
త్వరలో గురుకులాల్లో కావలసిన బెడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
విద్యార్థులు చక్కగా చదువుకొని
తమ లక్ష్యాలను చేరుకోవాలని
ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిసిడిఓ శైలిజ, తహసీల్దార్ విజయ లక్ష్మీ, ఎంపీడీవో అనిత, ప్రిన్సిపల్ సప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version