నేడు 26,27 తేదీ లలో టేప్ ఎక్స్పో 25 ఎగ్జిబిషన్..

నేడు 26,27 తేదీ లలో టేప్ ఎక్స్పో 25 ఎగ్జిబిషన్

టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్లి ప్రసాద్ రెడ్డి

తిరుపతి(నేటి ధాత్రి)జూలై 25:

తిరుపతి పట్టణ ప్రజలు భవన నిర్మాణం అవగాహన కొరకు ఎయిర్ బైపాస్ రోడ్డు లోని పి.ఎల్. ఆర్,కన్వెన్షన్ హాల్ నందు ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ ఈనెల 26 ,27 తేదీలలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్లి ప్రసాద్ రెడ్డి తెలిపారు . శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రెవిన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రి కొల్లు రవీంద్ర, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ వరప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం పేద మధ్యతరగతి భవన నిర్మాణం కొరకు ఎటువంటి సామాగ్రి ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న నిపుణుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ చైర్మన్ టి. వెంకటేష్ బాబు , జనరల్ సెక్రెటరీ బుసా షణ్ముగం, ట్రెజరర్ సందీప్, వైస్ ప్రెసిడెంట్లు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బంగారయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, వెల్ఫేర్ సెక్రెటరీ సురేష్ పాల్గొన్నారు.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు

టిటిపిఓసి 25 లో పాల్గొన్న ప్రెప్‌ఇన్స్టా.

టిటిపిఓసి 25 లో పాల్గొన్న ప్రెప్‌ఇన్స్టా

విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య అనుసంధానానికి వ్యూహాత్మక దిశ

వరంగల్ నేటిధాత్రి:

భారతదేశంలోని ప్రముఖ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ మరియు నైపుణ్యాభివృద్ధి వేదిక అయిన ప్రెప్‌ఇన్స్టా, జూన్ మొదటివారంలో షాద్ నగర్ లో జరిగిన కెరీర్ నెక్సస్ -2025లో హాజరైనది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ కన్సోర్షియం (టిటిపిఓసి) ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సు విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ నియామకదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా వందలాదిమంది టీపీఓలు, హెచ్ ఆర్ అధిపతులు, ఎడ్టెక్ నేతలు మరియు పాలసీ మేకర్లు పాల్గొని, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు మరియు నైపుణ్యాభివృద్ధి భవిష్యత్తును పునర్నిర్వచించాలనే లక్ష్యంతో చర్చించారు. ఈ చర్చల కేంద్రబిందువుగా, విద్యా శిక్షణ మరియు పరిశ్రమ అవసరాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పరిగణించడమే జరిగింది. ప్రెప్‌ఇన్స్టా సీనియర్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్లేస్‌మెంట్ లాండ్‌స్కేప్ వేగంగా మారుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు తయారవుతున్నా, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే వారి శాతం చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే, టిపిఓ లు మరియు కంపెనీ హెచ్ఆర్ లు కలిసి పని చేయాలి. శిక్షణ, అంచనా, నియామకం అన్నీ ఒకే వేదికపై కలిసేలా ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. ఇది విద్యార్థుల విజయాన్ని పటిష్టంగా మద్దతిచ్చే ప్లేస్‌మెంట్ పద్ధతుల తరం కావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చించిన ముఖ్య సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. క్యాంపస్ శిక్షణలో ప్రమాణాల లోపం, పాత విధానాల ఆధారంగా ప్లేస్‌మెంట్ ట్రాకింగ్, టీపీఓ లు మరియు నియామకదారుల మధ్య తక్కువ కమ్యూనికేషన్, టియర్ 2 టియర్ 3 కాలేజీలలో తక్కువ ప్లేస్‌మెంట్ శాతం వంటివి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి, ప్రెప్‌ఇన్స్టా సహకారాత్మక, డేటా ఆధారిత దృక్పథాన్ని ప్రతిపాదించింది. దీని ద్వారా కాలేజీలు పటిష్టమైన డేటా, స్కేలబుల్ టూల్స్, మరియు బలమైన రిక్రూటర్ నెట్‌వర్క్‌ను పొందగలుగుతాయి. “ప్రెప్‌ఇన్స్టాలో, లక్ష్యం ఏమిటంటే విద్యార్థి ఏ కాలేజ్‌లో చదువుతున్నా, అతనికి సరైన శిక్షణ, మార్గనిర్దేశం మరియు ఉద్యోగ అవకాశాలు అందాలి. టిటిపీఓసి వంటి ఈవెంట్‌లు విద్యా వ్యవస్థతో కలసి భవిష్యత్ కోసం సమగ్ర పరిష్కారాలను రూపకల్పన చేసే అవకాశాలు కల్పిస్తాయి” అని మానిష్ అగర్వాల్ తెలిపారు. ఈ దిశగా, ప్రెప్‌ఇన్స్టా భారత దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల టిపిఓలు మరియు మేనేజ్‌మెంట్‌లను 2025 ప్లేస్‌మెంట్ సీజన్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలను అన్వేషించమని ఆహ్వానిస్తోంది. ప్రెప్‌ఇన్స్టా రూపొందించిన బి2ఐ సాస్ ప్లాట్‌ఫారమ్ ‘ఆప్టిమస్’ ఇప్పటికే 250కి పైగా విద్యాసంస్థలకు మద్దతు ఇస్తోంది. శిక్షణ, అంచనా మరియు ప్రిపరేషన్ ట్రాకింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తోంది. 2017లో స్థాపితమైన ప్రెప్‌ఇన్స్టా, నైపుణ్యాల అభివృద్ధి మరియు ప్లేస్‌మెంట్ కోసం విశ్వసనీయ వేదికగా ఎదిగింది. ఇందులో 200కి పైగా ఇండస్ట్రీ-అలైన్‌డ్ కోర్సులు ఉన్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంది. ఇందులో జనరేటివ్ ఏ ఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి హై-డిమాండ్ రంగాలలో శిక్షణ అందించబడుతుంది. నైపుణ్యాధారిత, ఉపాధి-సిద్ధమైన భారత్ కోసం మద్దతుగా నిలుస్తోందని తెలిపారు.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో వెలుగు ప్రాజెక్టు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్వర్ణభారతి మండల సమాఖ్య వ్యవస్థాపక పాలక వర్గం అధ్యక్షులు చెలమల్ల సంధ్యారాణి కార్యదర్శి ఎండీ రజియా కోశాధికారి సంపెల్లి సరస్వతి గారలను శాలువ షీల్డ్ తో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ బాలకృష్ణ డీపీఎం సోమయ్య సీసీ లు ఇమామ్ బాబా మండలం లో ని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి మండల సమైక్య పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు

నిజాంపేట నేటి ధాత్రి:

జాతీయ ఉపాధి హామీ పనుల పై సామజిక తనిఖీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు మండలం లోని నస్కల్ గ్రామంలో బీఆర్పి అధికారులు మూడు రోజులుగా గ్రామం లోనీ ఇంటి ఇంటికి వెళ్లి కూలీలు ఎంత పని చేశారు. ఎంత డబ్బులు పడ్డాయనే దానిపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు.. 2024 – 25 సంవత్సరంలో 18 పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి కూలీ వేతనాలు, సామాగ్రి తో కలుపుకొని రూ,, 33,04,117 వచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో నూతన పని బుక్కులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, గ్రామ కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, దేశెట్టి సిద్ధ రాములు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా, 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని,1230 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్ 1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్ 2 వద్ద 385 , ఎల్ 3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారుల ను ఫాలో అప్ చేయాలని అన్నారు.జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 లోపు  రు

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు

25 వార్డులో బోర్ కి మరమ్మత్తు చేయించి నీటి సౌకర్యం కల్పించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కార్లు మార్క్స్ కాలనీ 25 వ వార్డు లో ఉన్న బోరును మరమ్మత చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని వేసవికాలం సమీపిస్తున్నందున నీటి కొరత లేకుండా చూడాలని అదేవిధంగా 25వ వార్డులో ఉన్న బోర్ రిపేర్ అయి మూడు రోజులు కావస్తుంది కావున దాన్ని మరమ్మత్త చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు సరిపడా రావడం లేదని వాటి సమయాన్ని కూడా పెంచాలని కోరారు అంతేకాకుండా కాలనీలో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్ సిపిఐ 25 వ వార్డు శాఖ సహాయ కార్యదర్శి యాకూబ్ పాషా, సిపిఐ నాయకులు మట్టి కృష్ణ, నా తర చంద్రయ్య, భాస్కర్, పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version