జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
లక్ష్యం మేరకు జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ సాధించాలి
జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి
జూనియర్ కళాశాలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి
ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎనరోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాల, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటి పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాల పై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలో మొదటి సంవత్సరం 1777 అడ్మిషన్స్ సాధించడం లక్ష్యం కాగా 63% 1116 మంది విద్యార్థులు ఎనరోల్ చేసుకోవడం జరిగిందని అన్నారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్ , విద్యుత్ సరఫరా, పారిశుధ్య, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన, మైనర్ రిపేర్ పనులకు ప్రభుత్వం 1కోటి 80 లక్షల రూపాయల మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
జూనియర్ కళాశాలలో అందించే విద్య నాణ్యత పెరగాలని అన్నారు. లెక్చరర్ సకాలంలో కళాశాలకు హాజరు కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో సప్లమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాత వేములవాడ ,ఎల్లారెడ్డి పేట, ఇల్లంతకుంట కళాశాలలో ఫలితాలు తక్కువగా వచ్చాయని తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ విద్య చాలా వెనకబడిందని, మౌలిక వసతుల కల్పన పనులు, పరీక్ష ఫలితాలో చాలా ఇంప్రూవ్ కావాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి జూనియర్ కళాశాలలో రెగ్యులర్ గా స్టూడెంట్ కౌన్సిలర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
జూనియర్ కళాశాలలో యాంటి డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ అందించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో క్రీడలు ఆడు ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మన జిల్లాలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం అందించిన ప్రత్యేక శిక్షణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని, ఇదే స్పూర్తి కొనసాగించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు , టెన్నిస్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ క్యారం బోర్డులు చెస్ బోర్డులు ఏర్పాటు చేసి అందించాలని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆ రూట్ లలో కాలేజీ సమయాలకు అనుగుణంగా బస్సులు నడిచేలా ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.