గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

అమ్మ మాట అంగన్వాడీ బాట.

అమ్మ మాట అంగన్వాడీ బాట

గర్భిణీలు బాలింతలకు పోషకాహార లోపం అవగాహన సదస్సు

మరిపెడ నేటిధాత్రి

 

 

 

చిన్నారుల ఎదుగుదల, గర్భిణి,బాలింతల మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ గొల్లపల్లి రాణి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు, అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో పాటు విద్య ను బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు,బాలింతలు,పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని గర్భిణీలు బాలింతలకు తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ యం.యశోద, జి.లలిత ఆయా నాగమ్మ, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

 

 

 

 

పవన్‌ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన  దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని  తెల్సింది  

 

పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా  కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్‌ శంకర్‌ కూడా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్‌ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్‌ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తక్కువ సమయంలో, లిమిటెడ్‌ బడ్జెట్‌ లో ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట

 

Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో అమ్మ ఒడి అంగన్వాడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నర్సరీ,ఎల్కేజీ,యూకేజి తరగతులను ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు,పెరుగుదలకు కావలసిన పోషక ఆహారం అందిస్తూ పిల్లలకు ఆట,పాటలు,అక్షరాలు నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బాల్యం నుంచి క్రమశిక్షణగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అంగన్వాడి టీచర్ రాజేశ్వరి,ఆయమ్మ, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version