బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్.

బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్

నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బడులు అన్నిoటికీ వేసవి సెలవులు గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభమవు తున్నాయి,. బుధవారం పాఠశాలల్లో పని దినాలు ముగియనున్నాయి. ఇప్పటికీ వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డులు జారీ కూడా పూర్తి చేశారు దీంతో ఈ విద్యా సంవత్సరం ముగిసింది పాఠశాలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12 న పునః ప్రారంభమవుతాయి. దీంతో అన్ని పాఠశాలలో ఏప్రిల్ 23 తేదీనే ఈ ఏడాదికి చివరి పని దినంగా ఉండనుంది.

Summer vacations

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రవేట్ బడులన్నిం టికీ ఏప్రిల్ 24 వ తేదీతో తరగతులు ముగిస్తాయి
2025-26 విద్యా సంవత్స రానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించేం దుకు కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రణ కూడా ఇప్పటికే ప్రారంభమైంది బడులు తెరిచిన రోజే అంటే జూన్ 12 వ తేదీన విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని పెంచాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు.

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు.

సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి తెలియజేశారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000, ఎన్ సౌమ్య 924/1000, ఏ నవ్య 900/1000,
బైపిసి సెకండియర్ లో ఏం శ్రీవాణి 900/1000, ఎన్ ప్రియాంక 880/1000, బి అజయ్ 880/1000, సీఇసి సెకండ్ ఇయర్ లో ఏ శివ 608/1000, హెచ్ ఈ సి సెకండ్ ఇయర్ లో పి చందు 632/1000,
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎన్ అంజలి 457/470, జి మానసి 446/470, ఏం అంజలి 432/470, ఏం శరణ్య 427/470,
బైపిసి ఫస్ట్ ఇయర్ ఎం హర్షిత 405/440, ఏ వైష్ణవి 393/440,
ఫస్ట్ ఇయర్ ఇ రాహుల్ 362/500, ఓ సమత 354/500 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ బి శ్రీదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, లెక్చరర్లను ప్రిన్సిపాల్ శ్రీదేవి అభినందించారు.

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత.!

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు శుభాకాంక్షలు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మల్లెల రణధీర్
(మాజీ సర్పంచ్ కొత్తగూడ)

కొత్తగూడ మండలం లోని విద్యార్థులు
నేడు ఇంటర్ పరీక్ష ఉత్తిర్ణత సాధించడం చాలా గొప్ప విషయం..
విద్యార్థులు ఉన్నత చదువులతో ముందుకుసాగాలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునేవిధంగా నడవాలి
క్షణికావేశంలో ఫెయిల్ అయినా మనే బాధతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మరొక అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటునన్నాను..
ఈరోజు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాల ను ఉద్దేశించి
మల్లెల రణధీర్
.గారు మాట్లాడుతూ,,
ఈరోజు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని-విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే,ఓటమి-గెలుపులు అనేటివి సాధారణమే అని,ఉత్తీర్ణత రాని వారు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా,మరో అవకాశాన్ని సద్వినియోగించుకుని,గెలుపును చవిచూడాలన్నారు.ఉత్తీర్ణత సాధించిన వారికి దీనిని వారధిగా నిలుపుకుని,మరో మెట్టు ఎక్కుతూ,అత్యున్నత శీకరాగ్ర స్థానన్ని సంపాదించుకుని,మంచి మంచి అవకాశాలను అధిరోహించాలని,తల్లిదండ్రులను సంతోషపరుస్తూ,తమదైన శైలిలో గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు.…

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

ఒదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ఎమ్మార్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు Diet కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం యం ఈ ఓ వై.రమేష్ ఆధ్వర్యం లో జరిగింది.
ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు అఖిల మరియు అమూల్య ల చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది. ఇందులో భాగంగా U-Dise లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్, ఫర్నిచర్,క్రీడ స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, Kitchen Garden, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది.ఈ వివరాలను సేకరించడం లో డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులను, మరియు సీ ఆర్ పి లను యం ఈ ఓ సమన్వయ పరిచారు. సమావేశంలో శిక్షణ ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో complex ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య ,యం లక్ష్మీనారాయణ కేజీవీబీ ఓదెల ఎస్ఓకే జ్యోతి, యుపిఎస్ హరిపురం మహేందర్ రెడ్డి, రమేష్, సిపిఎస్ ఓదెల నాగరాజు, ఎంఆర్సి కార్యాలయ సిబ్బంది ఎం ఐ ఎస్ డి వెంకటేష్, సి సి ఓ ఎల్ కుమార్, సి అర్ పి టి ఓంకార్ బి రజిత ఈ రాజేందర్ టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు…

విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ల ప్రధానోత్సవం…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.

Education

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బాలికల గురుకుల పాఠశాలలో.!

బాలికల గురుకుల పాఠశాలలో పోషణ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలకేంద్రము లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రిన్స్ పాల్ బిక్షపతి సమక్షంలో పోషణ పక్వాడ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద నిర్వహించడం జరిగింది,ఈసాద్7 ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం 11 నుండి 18 సంవత్సరాల బాలికలు తీసుకోవలసిన సమతులఆహారము వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆడపిల్లలయినందన ఇంటి పనులు వంట పనులు కూరగాయల తోటలు పండ్లు పూల మొక్కలు పెంచుకోవడం మొబైల్ కి దూరంగా ఉండడం విద్య యొక్క ప్రాముఖ్యత బయట వారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మవద్దని 18 సంవత్సరాలు అయ్యే వరకు వివాహ ఆలోచన చేయరాదని అన్ని రంగాలలో ఆడపిల్లలు అని వెనకడుగు వేయకుండా క్రీడారంగాలు వ్యాయామము క్రికెట్ అన్ని వృత్తి కోర్సులను చదువుతోపాటు నేర్చుకోవాలని వివరించడం జరిగింది,అనంతరం సూపర్వైజర్ మాధవి పిల్లలందరితో పోషకహార ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి అరుణ జ్యోతి భాగ్యమ్మ ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి, సూపర్వైజర్హాజరైనారు

దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం.

ప్రభంజనం ప్రభంజనం
దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం

  నేటిధాత్రి

 

 

జిల్లా స్థాయి క్విజ్ పోటీలో మా 5వ తరగతి విద్యార్థి ఊడుగుల శ్రీవాన్ టీం జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందున ఊడుగుల శ్రీవాన్ కి పాఠశాల ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులందరి తరుపున హార్దిక శుభాకాంక్షలు.
ఇంతటి ఘనత సాధించినందున మా విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ
ఉపాధ్యాయుల బృందం యు.పి.యస్ దుంపేట

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం

పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు,మాజీ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులు కల్పించబడి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రూపొందించబడిందని, తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. వేముల ప్రభావతి మాట్లాడుతూ శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా చర్లపల్లి పాఠశాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్, మేకల సత్యపాల్, పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,రమేష్,ఆయాలు సరోజన,రమ,సుశీల,అరుణ, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను.

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను శాస్త్రీయంగా పునర్విభజించాలి.

పెనుగొండ హై స్కూల్ ను నూతన కాంప్లెక్స్ గా ఏర్పాటు చేయాలి

గతంలో ఇష్టారాజ్యంగా, అస్తవ్యస్తంగా పాఠశాలల కూర్పు

దూరాభారంతో సవ్యంగా పర్యవేక్షణ చేయని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు

చదువులో తగ్గిన గుణాత్మకత – నష్టపోయిన విద్యార్థులు

నూతన ఇనుగుర్తి మండలంలోకి భౌగోళికంగా 15 పాఠశాలల చేర్పు

అయినా ఇంకా కేసముద్రం మండల స్కూల్ కాంప్లెక్స్ లోనే కొనసాగింపు

వచ్చే నూతన విద్యా సంవత్సరానికి ముందే స్కూల్ కాంప్లెక్స్ ల పునర్విభజన పూర్తి చేయాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

స్కూల్ కాంప్లెక్స్ లోకి సమీప పాఠశాలలను చేర్చి శాస్త్రీయంగా పునర్విభజించాలని కోరుతూ శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరికి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ గతంలో స్కూల్ కాంప్లెక్స్ ల ఏర్పాటు దగ్గర ,దూరంతో సంబంధం లేకుండా అస్తవ్యస్తంగా జరిగిందని , ఏ ప్రామాణికత లేకుండా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న యుపిఎస్ మహమూద్ పట్నం పాఠశాల నిజానికి కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ దగ్గర్లో ఉంటుందని, అమీనాపురం సమీపంలో ఉండే మాన్సింగ్ తండా పాఠశాల స్టేషన్ , కల్వల కాంప్లెక్స్ లకు సమీపంలో ఉంటుందనీ , కానీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాళ్లపూసపళ్లి కాంప్లెక్స్ లో చేర్చారని , సర్వాపురం స్టేషన్ కి దగ్గరగా ఉన్నప్పటికీ తాళ్లపూసపల్లి కాంప్లెక్స్ లో చేర్చడం, అలాగే పెనుగొండ, దాని ఆవాస పాఠశాలలన్నీ స్టేషన్ కాంప్లెక్స్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ విధి లేక దానిని స్టేషన్ కాంప్లెక్స్ లో చేర్చడం వల్ల ఆయా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
దూరాభారంతో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోయారని , తద్వారా పర్యవేక్షణలోపించి విద్యార్థులకు గుణాత్మక విద్య సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు

పెనుగొండ ఉన్నత పాఠశాల ఆవాసంలో ఉండే 15 పాఠశాలలన్నింటితో పెనుగొండ నూతన కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణకు సులభంగా ఉంటుందని సూచించారు.

ఇదిలా ఉంటే నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలానికి భౌగోళికంగా 15 పాఠశాలలు చేర్చినప్పటికీ ఇనుగుర్తి మండలంలో నూతన స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయకపోవడం వలన అవి ఇంకా కేసముద్రం మండల కాంప్లెక్స్ లోనే
కొనసాగుతున్నాయని, ఆయా పాఠశాలల పర్యవేక్షణ ఇనుగుర్తి మండల ఎంఈఓ మరియు కేసముద్రం మండల విలేజ్ మరియు కల్వల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేయాల్సి ఉండగా వారి మధ్య సమన్వయం కొరవడి పర్యవేక్షణ సవ్యంగా సాగలేదని ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే ఉంటారని, వారి సర్వతోముఖాభివృద్దికి , వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు .కొంతమంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేస్తే , మరికొంతమంది పర్యవేక్షణ అనే భయంతో పని చేస్తారన్నారు.
విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ పర్యవేక్షణ సవ్యంగా సాగాలంటే, ఆ కాంప్లెక్స్ లో ఉండే పాఠశాలలు ఆ కాంప్లెక్స్ కు అతి సమీపంలో ఉండేలా శాస్త్రీయంగా స్కూల్ కాంప్లెక్స్లను పునర్విభజన చేయాలని ,అలాగే పెనుగొండ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా మార్చాలని అధికారులను ఈ సందర్భంగా సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ ,అప్పాల నాగరాజు పాల్గొన్నారు.

శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం.

ఘనంగా శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

 

వరంగల్ నేటిధాత్రి

 

వరంగల్ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నవల నాటక సినిమా కథ రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిగిలి గోస, అనగనగా ఒక కోడి పెట్ట, వీటిపై అనర్గళంగా మాట్లాడారు.

College

తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలుగు భాష యొక్క ప్రాచుర్యం పెంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం తెలుగు భాషను ప్రోత్సహించాలని మన పిల్లలకు తెలుగు భాష మాట్లాడించాలని, మనమందరం మానవ విలువలను పెంపొందించే విధంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ బిఓఎస్ డాక్టర్ మంతిని శంకరయ్య, కళాశాల అధ్యాపకులు పరశురాం జయకృష్ణ, మేకల లింగమూర్తి, శ్రీధర్ల కుమారస్వామి, శెట్టి దేవరాజు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.

Graduation Day

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన.!

శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని దుంపేటి లాస్య ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఇండియన్ నేషనల్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి అధ్యక్షతన అభినందించి బహుమతిని(ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్) అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి దుంపేటి లాస్య నీ
శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య, ఎ.జి.యం అన్నపూర్ణ అకాడమిక్ కోఆర్డినేటర్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విజయ్ కుమార్,రవీందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

గురుకుల పాఠశాల విద్యార్థులను.!

గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన కూన గోవర్ధన్
మెట్ పల్లి ఏప్రిల్ 16

నేటి ధాత్రి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కోరుట్ల పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు షైక్ అమీర్,కోరుట్ల పట్టణ మైనర్టీ ప్రధాన కార్యదర్శి యండి ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.

సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్.!

సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ.ధర్మారెడ్డి. 

వరంగల్, నేటిధాత్రి

 

 

దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎఫ్ఎసి (ఫుల్ అడిషనల్ ఛార్జీ) ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ. ధర్మారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 31వ తేదీన సికేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి .శశిధర్ రావు పదవి విరమణ పొందడంతో ఆ స్థానంలో కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏ ధర్మారెడ్డికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అనంతరం కళాశాల విద్య కమిషనర్ ఉత్తర్వుల ఆదేశానుసారం తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు సీకేఎం డిగ్రీ కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించాలని కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ ఏ .ధర్మారెడ్డి ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది డాక్టర్ ధర్మారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనను ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా నియమించినందుకు సిసిఈ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఈ సూపరిండెంట్ కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరత్ చారి, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. శశిధర్ రావు, అధ్యాపకులు డాక్టర్ కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, లైబ్రరియన్ ఎస్ .అనిల్ కుమార్, సూపరిండెంట్ జి .శ్రీనివాస్, గెస్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్.

చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జలియన్వాలా బాగ్ సంఘటనను పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆ సంఘటనను కనులకు కట్టినట్లుగా విద్యార్థుల ద్వారా నాటకీకరణ చేయించడం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రజలను ఆకట్టుకున్నది. జలియన్వాలా బాగ్ ప్రదేశంలో మరణించిన భారతీయుల స్తూపానికి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13 న భారత నేల రక్తంతో తడిసిన రోజు అని, దుర్మార్గపు చట్టాన్ని వ్యతిరేకించినందుకు బ్రిటీష్ వారు ఆడిన రక్తపు క్రీడ అని, బ్రిటీషు ప్రభుత్వం ఆమోదించిన “రౌలత్ చట్టం” ప్రకారం పోలీసులు ప్రజలను అనుమానితుల పేరుతో ఎటువంటి విచారణ లేకుండా, రెండు సంవత్సరాలపాటు నిర్భందించవచ్చఅని, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సైపుద్దిన్ క్లిచ్, సత్యపాల్ సింగ్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరి అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశం అయ్యారు అని
ఈ సమావేశంలో హన్స్ రాజ్ అనేవ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు, అప్పటి సైనిక అధికారి జనరల్ డయ్యర్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే, నిరాయుధులైన ప్రజలపై 1650 రౌండ్ల కాల్పులు పది నిమిషాల పాటు,379 మరణాలు, రెండువేల మందిని గాయపరిచారు,అనేక మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకొనుటకు అక్కడి బావిలో దూకారనీ,తుటాలు తగలి చాలామంది చనిపోయారు అని అన్నారు.ఈ సంఘటనలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనయే భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురాగతంగా నిలిచిపోయిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మేకల సత్యపాల్,
ఐ ఈ ఆర్ టి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత
– కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.

education

ఈ సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
2019 బ్యాచ్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ కు డాక్టర్లుగా మారబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుందని అన్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు.
డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50 శాతం జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుందని అన్నారు.
చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయని అన్నారు.
ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని అన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.

డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన.

ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన గీతాన్విత..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.

Student

ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ అందజేయడం జరిగింది.

Student

 

రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.

గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత.

గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం హోతి(కె) బాలికల గురుకులంలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నైట్ స్టడీ తర్వాత విద్యార్థినులు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో అస్వస్థతకు గురవడంతో వారిని హాస్టల్ సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వారు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఐదో క్లాసులో స్టేట్ ర్యాంక్ సాధించిన గీతాన్విత.

ఐదో క్లాసులో స్టేట్ ర్యాంక్ సాధించిన గీతాన్విత..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.

Eaxms

 

ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ ప్రభుత్వం అందజేయడం జరిగింది.

Eaxms

 

రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version