సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని

పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని చార్మితో పాటు మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) లను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడి బి గౌతమి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భముగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ కరాటే పోటీల్లో బాలాజీ విద్యార్థుల పథకాల ప్రభంజనం

నర్సంపేట టౌన్, నేటి ధాత్రి:

మార్షల్ ఆర్ట్స్ మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని, అంతేకాకుండా ఈ కరాటే ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునే అద్భుతమైన కళ అని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమండ్ల రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూలు విద్యార్థులు షోటోకాన్ జపాన్ కరాటే ఇండియాహంబు సంస్థ ఆదివారము నాడు నర్సంపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని 54 పథకాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసన అభినందన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో మన పాఠశాల నుండి కటా, కుమ్తే విభాగాల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 20 గోల్డ్ మెడల్స్, 34 సిల్వర్ మెడల్స్ సాధించడం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.టీం ఛాంపియన్షిప్ ఒకటి గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా చైర్మెన్ కరాటేలలో అద్భుతమైన శిక్షణను ఇచ్చిన కరాటే మాస్టారు రచ్చ భవానీచంద్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బాలాజీ టెక్నో స్కూల్లో చదువుతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. కరాటే, భగవద్గీత శ్లోకాలు, యోగా, అబాకస్‌ మొదలగు అంశాల్లో తగిన శిక్షణ ఇస్తూ విద్యార్థుల్లో వికాసాన్ని కలిగించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.రియాజుద్దీన్, క్రాంతి కుమార్, రామ్మూర్తి, యాకూబ్ రెడ్డి లతోపాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version