పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పేదల కోసమే…
యువత జనం కోసం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి :
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్డేడియం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే 40 మంది విద్యార్థులకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో డబ్బులు సేకరించి మున్సిపాలిటీ కమీషనర్ గద్దె రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందించడం అభినందనీయమని కమీషనర్ అన్నారు. ఈ సంధర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కు సంబంధించిన సమస్యలు కమిషనర్ కు వివరించగా కమీషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె, గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్కేపీ యువత జనం కోసం పేదల కోసమే పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు గణేష్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ పేరేంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..