ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.