సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని
పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని చార్మితో పాటు మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) లను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడి బి గౌతమి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భముగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.