కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సురభి పాఠశాలలో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలాటం, తెలంగాణ జానపద నృత్యాలు, పాటలతో కార్యక్రమం చాలా రంజుగా సాగింది. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈవేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని కలిగించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, డైరెక్టర్ చిప్ప వీర నర్సయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతోనే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుపతి: నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్‌నర్స్(బర్డ్ ఆస్పత్రి), ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ (బర్డ్ ఆస్పత్రి), అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల్లో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు, వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో గొప్పదైన ఆషాడ మాస బోనాల సందర్భంగా మండలంలోని లింగంపేట గ్రామంలో గల మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గురువారం పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థినీ విద్యార్థులకు చిన్ననాటి నుండే మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు బోనం నెత్తిన పెట్టుకొని, పోతరాజుల వేషధారణలో గ్రామ విధుల వెంట ఆటలాడుతూ పాటలు పాడుతూ పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, మింగలి కవిత, ఇందూరి సౌమ్య, కముటం స్వప్న, పహిమ, మున్నిర విద్యార్థులు పాల్గొన్నారు.
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల గాంధారి మైసమ్మ,సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు.ఈ నెల 20 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. టెంట్లువేసి బారికేడ్లు ఏర్పాటు చేసింది. జంతుబలుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ నిర్మించింది. జిల్లా నలుమూలలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా నుండి కోల్ బెల్ట్ ప్రాంతాల నుండి కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నది.భక్తులు మేకలు, కోళ్లు బలి ఇచ్చి సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ అని బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Gandhari Maisamma Ashada month Bonala
20 ఏండ్ల క్రితం మైసమ్మ ఆలయం ఏర్పాటు…
మంచిర్యాల నుండి మందమర్రి మీదుగా చంద్రపూర్ వెళ్లే జాతీయ రహదారిపై బొక్కలగుట్ట అటవీ సమీపంలోని పాలవాగు వంతెన వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామస్తులు చారిత్రక గాంధారి కోటలోని మైసమ్మ దేవతకు పూజలు చేసి 20 ఏండ్ల క్రితం ప్రతిష్ఠించారు. అనంతరం గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.అప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. ఆనాటి నుండి ఆషాఢమాసంలో గాంధారి మైసమ్మ ఆలయానికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తల్లికి నూటొక్క బోనాలతో జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 20వ తేది ఆదివారం గాంధారి మైసమ్మ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించండి
Gandhari Maisamma Ashada month Bonala
ఏసిపి రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్
ఈనెల 20 ఆదివారం రోజున గాంధారి మైసమ్మ బోనాల జాతర జరిగే ప్రదేశం జాతీయ రహదారి కావడంతో మంచిర్యాల,రామకృష్ణాపూర్ నుండి వచ్చే భక్తులు కుర్మపల్లి స్టేజ్ వద్ద నుండి వాహనదారులు ఎట్టి పరిస్థిటీలో రాకూడదని, పులిమడుగు వద్ద నుండి యూ టర్న్ తీసుకుని ఆలయం సమీపంలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంకు చేరుకొని పోలీసులకు సహకరించాలని, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్లో భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లు తెలిపారు.
వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..
వర్షం సమృద్ధిగాకురవాలని రామాలయంలో వరుణ దేవుని పూజా
గణపురం రైతులు గ్రామోత్సవంగా కప్పతల్లి ఆట
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఉదయం 6:00 గంటలకు వర్షాలు సమృద్ధిగా పడాలని వరుణ దేవునిపూజాకార్యక్రమంనిర్వహించారు.అనంతరం వర్షాలు బాగా కురవాలని సమృద్ధిగా పంటలు పండాలని గణపురం గ్రామ రైతులు కప్పతల్లి ఆటను యువకులతో కలిసి గణపురం పురవీధులలో శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామిని డప్పు సప్పులతో, బింద నిండా నీరుతో వరుణదేవుని పూజిస్తూ వర్షాలు బాగా కురవాలని గణపురం పెద్దలు కప్పతల్లి ఆటను గ్రామోత్సవంగా గణపురం పురవీధులలో ఊరేగింపుగా మొదట గ్రామ దేవతలు భూలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, తదుపరి పోచమ్మ తల్లికిఅభిషేకంనిర్వహించి కప్పతల్లిఆటగణపసముద్రంచెరువుకట్టపైగలదక్షిణముఖఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగించి మరల రామాలయంవరకుకప్పతల్లి ఆటను కొనసాగించారు.ఈపూజాకార్యక్రమంలో శ్రీరామ భక్తులు, ప్రజలు, రైతులు, మహిళలు సంతోషంగా పాల్గొని వర్షాలు సమృద్ధిగా పడిపంటదిగుబడిసమృద్ధిగా ఉండాలని వరుణ దేవునికి పూజలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.
బంజారాల సంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. ఈ పండుగ బంజారాల జీవన విధానాన్ని వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది.బంజారాల కట్టు,బొట్టు,సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుంది. ఒక ప్రాంత ప్రత్యేకతను అక్కడి ప్రజల జీవన విధానాన్ని పండుగలు చాటి చెబుతాయి.వారి సంస్కృతి, చారిత్రక నేపథ్యం, వారసత్వాలకు,సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రతీకగా నిలుస్తాయి. ఇలా ప్రత్యేకమైన అహార్యం, కళలు, పండుగలు తమ పూర్వికులు ఇచ్చిన ఆస్తిగా అవి అంతరించిపోకుండా చూసుకుంటున్నారు గిరిజన ప్రజలు.తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించడం తీజ్ పండుగ ఉద్దేశం.తండాలో వర్షాలు బాగా కురిసి,ప్రతి తండా ప్రకృతి,పచ్చదనంతో కలకలలాడుతూ ఎల్లప్పుడూ పచ్చగా హరిత భరితంగా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు.ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా తీజ్ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,గోవా, కర్ణాటక, దక్షిణ భారతదేశం,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్గడ్,రాజస్థాన్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు.వెదురు బుట్టలోనే కాకుండా మోదుగు ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి గోధుమలను చల్లుతారు. పెళ్లి కానీ ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టలో ఉన్న గోధుమలకు నీళ్లు జల్లుతారు.ఆడపిల్లలు పులియాగొన్నో- పూర్ణకుంభం తలపై పెట్టుకుని బావినీళ్లు, బోరింగ్ నీళ్లు గాని,చెరువు నీళ్లు కానీ తీసుకువచ్చి తీజ్ కి పోస్తారు.గోధుమ మొలకలను తీజ్ గా పిలుస్తారు.తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టతో ఆడపిల్లలు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుతారు.పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరి ప్రజలు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో తిజ్ వద్దకు చేరుకుంటారు.
లాంబీ లాంబి ఏ లాంబడి ఏ కేరియో,దొకా కేరియే లాంబడి ఏ కెరియ, తోనకున బోరయో తీజ పావ్ లేనా,సేవా భయా బోరయో తిజ బయిరో పావ్ లేనా అంటూ పాటలు పాడుతారు. 9 రోజుల తీజ్ పండుగ సందర్భంగా ఆడపిల్లలకు కఠినమైన నియమాలు ఉంటాయి.ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటికి వెళ్ళకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే.నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకుని నిలబడాల్సిందే.నానబెట్టిన శనగలను రేగి మూళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడి ఝాస్కెరో పేరుతో పిలుస్తారు.చివరి రోజు నిమజ్జనం కనుల పండువగా బంజారా వేషధారణలో నిర్వహిస్తారు.నిమజ్జన కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు,యువతీ, యువకులు, ఉద్యోగస్తులు, పెద్ద ఎత్తున పాల్గొంటారు.తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, సింధూర లేపనం, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర యుక్తముగా పూజలు జరిపారు. తొలి మొక్కల దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రామంపేట జూలై 14 నేటి ధాత్రి (మెదక్)
ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్.ఆర్.ఓ అంబర్ సింగ్ గారు, వనమహోత్సవం మరియు చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదని ,చెట్లు మాత్రమే చెడును తీసుకొని మంచిని ఇస్తాయని. మానవులు వదిలేటటువంటి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ,ఆక్సిజన్ మానవులకు ఉపయోగపడేటటువంటి ఆక్సిజన్ ఇస్తాయని ఇనుము ఎలా అయితే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా చెట్లు మేఘాలను ఆకర్షించే వర్షాలను కురిపింప చేస్తాయని ప్రతిరోజు మానవుడికి మూడు సిలిండర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఒక సిలిండర్ విలువ 700 రూపాయలు అయినట్లయితే రోజుకి 2100 ఖర్చు అవుతుందని సంవత్సరానికి 7,66,500 అలాంటి ఆక్సిజన్ ని మనం ఉచితంగా తీసుకోగలుగుతున్నాం. అందరికీ ఆక్సిజన్ సిలిండర్ల అవసరము పడితే సిలిండర్లు దొరకక ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందో కరోనా సమయంలో అందరం చూసినటువంటిదే కాబట్టి చెట్లను నాటడం వాటిని సంరక్షించడం చెట్లతో పాటుగా అడవిని, జంతువులను ,నీటిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి అమ్మ పేరు పైన ఒక చెట్టును నాటాలని అమ్మను ఏ విధంగా చూసుకుంటారో ఆ చెట్టుని ఆ విధంగా చూసుకోవాలని విద్యార్థులకు వివరించడం జరిగింది. అమ్మ పేరు పైన చెట్టు నాటడం అనేది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు చెప్పినటువంటి నినాదం. క్రమం తప్పకుండా మనం అందరం పాటించాలని చెప్పడం జరిగింది.
Forest Festival
మంజీరా పాఠశాలలో ఎఫ్ఆర్ఓ అంబర్ సింగ్ గారు, డిప్యూటీfro శ్రీనివాస్ గారు ,గీత ,కృష్ణ గారు చెట్లను నాటడం జరిగింది .విద్యార్థుల చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ ,అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢమాసం బోనాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు,నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజమ్, సినియర్ నాయకులు నామ రవికిరణ్,మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, విజిలిన్స్ మెంబెర్ రామకృష్ణ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,వెంకట్, శివ ముదిరాజ్,నరేష్ రెడ్డి,మహమ్మద్ అలీ, జఫ్ఫార్, సందీప్, తదితరులు.
ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్తగిరి మహారాజ్ వారి ఆశ్రమంలో జరిగిన మృత్యుంజయ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఝరాసంగం పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాజీ ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, నర్సింహా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, తదితరులు
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం రోజున ఘనంగా అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాల పండగ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతంగా ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరం అని,ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని అన్నారు.అలాగే నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు ఆడపడుచులు ఎత్తుకున్న బోనాలతో,డప్పు చప్పులతో, ఆటపాటలతో,పోతరాజుల వేషధారణలో భక్తులు చేరుకొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం జరుగుతుందని అన్నారు.మహిళలు,భక్తులు ఆషాడ బోనాల ఉత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ కోరారు.
సంగారెడ్డి: ఝరాసంగం మండలం బర్దిపూర్లోని శ్రీదత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి భగవత్ ఖాభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు మాతృశ్రీ అనసూయ మాత, శ్రీఅవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వరానందగిరి ఆధ్వర్యంలో రథోత్సవం భక్తుల సందోహంతో రమణీయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, నృత్యాలతో రథోత్సవం ఆకట్టుకుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హమాలీ కాలనీ లో శనివారం బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పెద్దమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు బోనాలు నిర్వహించడం జరుగుతుందని మహిళ లు సమయానికి బోనాల తీసుకొని రాగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదలు పొందగలరని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్య సాయి మందిరంలో షిరిడి సాయి సత్య సాయి బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు భజనలు ఘనంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఆయన తెలిపారు
గురు పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి మంజూరు నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కృష్ణకాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబాను దర్శించుకుని స్వామి వారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సమక్షంలో పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ మరియు టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి రామ్ రాథోడ్ వారితోపాటు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రవీందర్ చవాన్, మాజీ సర్పంచ్ కేశవరం రాథోడ్,
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జహీరాబాద్ మండల అధ్యక్షులు ధర్మరాజు, ఎక్స్ ఆర్మీ రామ్ సింగ్ రాథోడ్, రఘు రాథోడ్, రమేష్ బానోత్ టీచర్, చందర్ పవర్, శీను బానోత్, ధర్మ, సింగ్ పవర్, ఎక్స్ ఆర్మీ పాండు సింగ్ రాథోడ్, రమేష్ పోలీస్, శివాజీ రాథోడ్, అర్జున్ టీచర్, మోహన్ కృష్ణ, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతంలోని అరుణక్క నగర్ లో రజకుల వారి కుల దైవం శ్రీ మడేలయ్య స్వామి బోనాల జాతరను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.బుధవారం ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్,
ప్రధాన కార్యదర్శి పుట్టపాక తిరుపతి, గ్రామ అధ్యక్షులు పున్న బక్కయ్య,కార్యదర్శి అన్నారం మహేష్ లు మాట్లాడుతూ… ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రజకుల కుల దైవం శ్రీ మాడెలయ్య స్వామి, సీతాలమ్మ దేవి,ఈదమ్మ దేవి బోనాలు ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజకుల సేవ సమాజ సేవ అని వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ ను అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన రజకుల చిరకాల కోరిక ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. స్థానికంగా ఉన్న నాయకులు మా కుల దైవం శ్రీ మడేలయ్య దేవాలయం నిర్మాణానికి సహాయ,సహకారాలు అందించాలని రజక కులస్తుల తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నగనూరి సారయ్య,సహాయ కార్యదర్శి పావురాల రాజయ్య,గ్రామ కోశాధికారి శ్రీరాముల దుర్గయ్య,రజక సంఘ నాయకులు రాములు,శంకర్, తిరుపతి,చందు,శంకర్, రాజేష్,వెంకటేష్,శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి పై జరిగిన దాడి హేయమైన చర్య
బిజెపి చర్ల మండల అధ్యక్షులు నూపా రమేష్
నేటిదాత్రి చర్ల
చర్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిలర్ నెంబర్ బాబా పాహి మ్ అధ్యక్షతన మండల కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మండల అధ్యక్షులు నూప రమేష్ మాట్లాడుతూ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కార్యనిర్వహణాధికారి రమాదేవి పై పురుషోత్త పట్టణంలో దేవస్థానం భూమిలో కొంతమంది ఆక్రమణదారులు మరియు అరాచకవాదులు కలిసి చేసిన భౌతిక దాడి హేయమైన చర్యఅని ఆయన అన్నారు ఈ దాడిని ఖండిస్తూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు గతంలో కూడా ఒకసారి ఈవో రమాదేవి పై మరియు ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తోంది కావున వెంటనే ఈ చర్యలు పాల్పడిన అరాచకవాదులను శిక్షించాలని ఈఓ రమాదేవి ఆరోగ్యంపై తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇర్ఫా సుబ్బారావు కార్యదర్శిలు ముత్తవరపు శ్రీనివాసు చారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.