శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జాతర

*తిరుపతి రూరల్ మండలం తిరుమలనగర్ పంచాయతీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జాతర..

*అమ్మవారి జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకి కర్పూర హారతులతో ఘనస్వాగతం పలికిన.‌

మహిళలు, గ్రామస్తులు.

*జాతరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.

ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే..

తిరుపతి రూరల్(నేటి ధాత్రి) 

తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని తిరుమల నగర్ పంచాయతీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా గంగమ్మ జాతరను నిర్వహించారుజాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు . జాతరలో అమ్మవారికి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగ జాతరకు విచ్చేసిన ప్రజలను, భక్తులను ఆప్యాయంగా పలకరించారు. ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వేదాల బడి.. 4 రాష్ట్రాల విద్యార్థులకు శిక్షణ .

వేదాల బడి.. 4 రాష్ట్రాల విద్యార్థులకు శిక్షణ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: “వేదం నమామి.. సదాస్మరామి” అన్నది వేదవాజ్ఞయ సూక్తి. మానవుడి జీవనయానంలో సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగై పోతున్నాయి. వేద పండితుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. దీని దృష్టిలో పెట్టుకొని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితమే వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. అన్ని వర్ణాల వారు వేదం నేర్చుకోవడానికి అర్హులే. వేద ఆశ్రమ పాఠశాలపై “నేటి ధాత్రి ” ప్రత్యేక కథనం
యజ్ఞయాగాదులు, వివాహాది శుభకార్యాలు చేసేందుకు అవసరమయ్యే పురోహితులు, వైదికుల కొరత తీర్చేందుకు ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ కృషి తో వైదిక పాఠశాల కొనసాగుతోంది. కులాలకు అతీతంగా (అన్ని వర్ణాల ) వారికి కేవలం నియమ నిష్టలు, కట్టుబాట్లు పాటించే విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వేదవిద్యను బోధిస్తున్నారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది వారివారి స్వస్థలాల్లో అర్చక వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 100 ລ້ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

ఉచిత బోధన, భోజన వసతి

వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానం పై బోధిస్తారు. విద్యార్థులకు వేదాంత, న్యాయ, యోగదర్శనం, ధ్యానం, భజన, గ్రంథపఠం తదితరాలపై శిక్షణ ఇస్తారు.

అర్చకుల కొరత తీర్చడమే లక్ష్యం సిద్ధేశ్వరానందగిరి మహరాజ్

ఊరూరా ఆలయాల్లో అర్చకుల కొరత తీర్చేందుకే వైదిక పాఠశాల కృషి చేస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన అర్చకులు వివిధ ప్రాంతాలలో స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నారు. అర్చకత్వం తో పాటు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వారి విద్య యధావిధిగా కొనసాగిస్తున్నాం. ట్రస్టు సభ్యులు, భక్తుల సహకారంతో పాఠశాల కొనసాగుతుంది.

కోటగుళ్ళ లో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

కోటగుళ్ళ లో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

భారీగా తరలివచ్చిన భక్తులు

స్వామివారికి ప్రత్యేక అలంకరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఉదయం గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించగా ఏడాది లో తొలి పండుగ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నాడు ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఆలయ పూజారి ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని వారు తెలిపారు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

తోలి ఏకాదశి సందర్భంగా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో గల శ్రీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పరమేశ్వరుని దర్శనం చేసుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,ప్రభాకర్ రెడ్డి,యం.జైపాల్,నరసింహా రెడ్డి,భరత్ రెడ్డి,శ్రీనివాస్, నాగు,మారుతీ,అనిల్,దిలీప్, తదితరులు ఉన్నారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యేకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో జరుగుతున్నా వారహిదేవి నవరాత్రి మహోత్సవులో శుక్రవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దేవగిరి మహారాజ్ ఆశీస్సులు తీసుకోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం దురదృష్టం..

*గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం దురదృష్టం..

*అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ,

అగ్నిమాపక అధికారులు , సిబ్బందికి అభినందనలు.

నగర పాలక సంస్థ మేయర్ డా శిరీష..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 03:

 

 

 

 

తిరుపతి గోవిందరాజల దేవాలయ ప్రాంతంలోని సన్నిది వీధిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రమాదం చోటు చేసుకున్న సన్నిది ప్రాంతాన్ని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా శిరీష సందర్శించారునగర పాలక సంస్థ విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ అధికారి శ్రీనివాస రావుతో కలిసి అగ్ని ప్రమాదానికి గురైన షాపును మరియు సన్నిది వీధిలో ఉన్న ఇతర షాపులను సందర్శించి ఘటన కారణాలను అడిగి తెలుసుకున్నారు.షాపు నిర్వాహకులు అగ్నిప్రమాద శాఖ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వద్దు ఆలయ ప్రాంతంలో భక్తుల సందర్శన ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న షాపులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సమగ్ర నివేదిక ఇవ్వాలని విపత్తు నివారణ అగ్ని మాపక శాఖకు ఆదేశం.

రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ
అగ్ని మాపక అధికారులను, సిబ్బందిని మేయర్ అభినందించారు.అదే సమయంలో గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాలలో ఉన్న షాపులలో నిబంధనలు పాటించే విధంగా చూడాలని మొత్తం నగర పరిధిలో వాస్తవ పరిస్థితితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తిరుపతి నగరం శ్రీవారి భక్తులు సందర్శించే ప్రాంతం కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. షాపు నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కల్పించాలని అదే సమయంలో నిబంధనలు పాటించే విషయంలో రాజీ ధోరణి ఉండకూడదన్నారు.అగ్ని ప్రమాదానికి గురి అయిన షాపుతో సహా మొత్తం పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని నగర పాలక సంస్థ విపత్తు నివారణ శాఖను ఆదేశించారు.

మేడారం మహాజాతర తేదీలు ఖరారు .

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

 

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు

 

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.

 

 

 

ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరుతున్నారు. కాగా.. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.

 

ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు

ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు

ఉత్తర నక్షత్రం సందర్భంగా మహాదివ్య పడిపూజ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామికి ఘనంగా అష్టాభిషేకాలు నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.కాగా బుదవారం దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై హోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ, అభిషేకం,అన్నదాన దాతగా వంగేటి పద్మావతి గోవర్ధన్ కుటుంబం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా బృందం వేధ మంత్రోచ్చారణతో మహాదివ్య పడిపూజ చేపట్టారు.ముందుగా 18 కలశాల పూజలు,మెట్ల పూజలు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి నెయ్యి, తేనే,చక్కర,పంచాంతృతం,గంధం,
విభూదితో అష్టాభిషేకాలు,కలశాభిషేకాలు చేపట్టారు. అనంతరం పుష్పాభిషేకం చేశారు.ఈ నేపథ్యంలో పడునెట్టాంబడిపై కర్పూర జ్యోతులతో వెలిగించడంతో భక్తులు మురిసిపోయారు.కళ్యాణరాముడు సురేష్,రంగనాథ్ బృందం ఆలపించిన భజన పాటలతో,భక్తుల శరణఘోషతో దేవాలయ ప్రాంగణం ఎంతగానో మారుమ్రోగింది.అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాత వంగేటీ పద్మావతి గోవర్ధన్ కుటుంబం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్టు కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,శ్రీరాం ఈశ్వరయ్య ఇరుకుల్ల వీరలింగం,భూపతి లక్ష్మీనారాయణ,బండారుపల్లి చెంచారావు,దొడ్డ వేణు,మల్యాల రాజు,మల్యాల ప్రవీణ్,భీరం నాగిరెడ్డి,రాంచందర్,కర్ణాకర్,మండల వీరస్వామి గౌడ్,బాదం అనిల్,శ్రీనివాస్,గురుస్వాములు సంజీవ రావు, యాదగిరి,అనిల్,ఆలయ గుమస్తా దేశి రాము అర్చకులు ఫ్రాన్స్,శివాంకిత్,ఆనంద్,తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం

శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు నుండి గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉచిత దర్శనం గురించి భక్తులకు తెలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈవో ఎం శ్రీనివాసరావు. మై కానౌన్స్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులు ఉచిత దర్శనానికి ఎలా వెళ్లాలి టికెట్స్ ఎలా పొందాలనే విషయాన్ని పొందుపరిచారు. మధ్యాహ్నం ఒకటి 15 నిమిషాలకు టోకెన్లు జారీ చేసి ఒకటి 45 నుంచి 3:45 వరకు ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దని బట్టి 1000 నుంచి 1200 మందికి ఈ ఉచిత స్పర్శ దర్శనం కల్పించే అవకాశం ఉందని వారంలో నాలుగు రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కేటాయించామని ఈవో తెలిపారు.

రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం.

రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో నేడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు బలబత్తుల రాజకుమార్ తెలిపారు.
నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామస్తులు ఆధ్వర్యంలో ఉదయం మంగళవారం రోజున మన రామలింగేశ్వర స్వామి దేవతా మూర్తులకు పంచామృత అభిషేకం,అర్చనాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వార్షికోత్సవ సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర.

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

 

 

 

 

గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.

రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.

దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Hyderabad: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస (Aashada Masam) బోనాల సందడి (Bonala Festival) మొదలైంది.

చారిత్రాత్మక గోల్కొండ కోట (Golconda Fort)లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి.

దీంతో ఆదివారం (Sunday) తెల్లవారుజామునుంచే భక్తులు (Devotees) గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు.

ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.

రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.

దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి.

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది.

ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు.

అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి.

గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.

గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.

లష్కర్ బోనాల జాతరకు అంకురార్పణ..

కాగా తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతరకు ఆదివారం అంకురార్పణ జరగనుంది.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళీ బోనాల జాతరలో తొలి ఘట్టమైన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ఫ్యామిలీ ట్రస్టు చైర్మన్ సురిటి రామేశ్వర్, కామేశ్వర్లు తెలిపారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆభరణాలను అప్పగించడం ద్వారా ఘటం ఎదుర్కోలు ప్రారంభమవుతుందన్నారు.

వచ్చే నెల 13వ తేదీన బోనాలు జరుగుతాయని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేస్తారని వారు తెలిపారు.

14న ఉదయం 8.30 గంటలకు రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుందని వివరించారు.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలోని గాంధీనగర్ వాస్తవ్యులు ఎలిగేటి సంధ్యారాణి మురళి ఆర్టిసి డ్రైవర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి పూజ అనంతరం ఆలయానికి 5,000 రూపాయలతో నక్షత్ర హారతిని ఇతర పూజ సామాగ్రిని ఆలయానికి అందజేశారు పూజ అనంతరం ఆలయ అర్చకులు మురళి సంధ్యారాణి దంపతులకు తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కమిటీ సభ్యులు మూల శ్రీనివాస్ గౌడ్ బండారు శంకర్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మాదాసు మొగిలి పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు

జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ.

జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ

మరిపెడ /సిరోలు నేటిధాత్రి.

 

 

 

 

మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో ని కొత్తూరు సి గ్రామానికి చెందిన
దాత దయ్యాల నాగేశ్వర్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన మాత జ్ఞాన సరస్వతి విగ్రహం మరియు సభ వేదికను,ఘనంగా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరై,సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా ప్రాధాన్యతను వివరించారు. “విద్య వల్లే వ్యక్తి వికాసం సాధ్యం అన్నారు, మాత జ్ఞాన సరస్వతి ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి,” అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కురవి మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్,సిరోల్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి,డిఇఓ రవీందర్ రెడ్డి,ఎంఈఓ లచ్చిరామ్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మలిశేటి వేణు,పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఇటువంటి సత్కార్యాలు గ్రామాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రజల అభిప్రాయపడ్డారు,దాత నాగేశ్వర్ గౌడ్ అందించిన ఈ సహకారం పాఠశాల విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

వర్షం కోసం మహిళల ప్రత్యేక పూజలు.

వర్షం కోసం మహిళల ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్, కుప్పానగర్, అల్లిపూర్, మాచ్నూర్, తదితర గ్రామాలకు చెందిన మహిళలు గంగా పూజలో పాల్గొన్నారు. మహిళలు రాగి కలశాలలో నీటిని నింపి ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు అనంతరం దత్తగిరి క్షేత్రంలో పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్తో కలిసి జ్యోతిర్లింగాలకు నీటితో అభిషేకం చేశారు.

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారము అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది.

 

Ketaki

 

 

ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది ఝరాసంగం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

shine junior college

 

 

 

 

ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

 

 

హైదరాబాద్: ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Hyderabad In-charge Minister Ponnam Prabhakar) తెలిపారు. మంగళవారం గోల్కొండ పోర్టులో జరిగిన కార్యక్రమంలో బోనాలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి తొలి బోనాల పండగ ప్రారంభమవుతుందని, ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

 

ఈ ఉత్సవాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల అమ్మవార్లకు ప్రభుత్వం తరుఫున పట్టు వస్ర్తాలను సమర్పిస్తామని మంత్రి తెలిపారు. నెలరోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో గోల్కొండ కోటకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.

 

 

 

వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ హరిచందన, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, గోల్కొండ బోనాల ఆలయ కమిటీ ఛైర్మన్‌ చంటిబాబు, ఫిష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, సౌత్‌వె్‌స్టజోన్‌ డీసీపీ చంద్రమోహన్‌, తహసీల్దార్లు జ్యోతి, అహల్య, తదితరులు పాల్గొన్నారు.

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

shine junior college

 

 

 

రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

 

 

 

 

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి(Rameshwaram Ramanathaswamy Temple) రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు ఆ ఆలయంలో సులువుగా దైవదర్శనం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలకు పూర్వమే రామేశ్వరం ఆలయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ ఉండేది.

 

 

 

 

ఆ క్యూలైన్‌లో వెళ్ళి స్థానికులు సులువుగా దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి డిప్యూటీ కమిషనర్‌ చెల్లదురై బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్థానికుల క్యూలైన్‌ తొలగించారు. స్థానికులు ధర్మదర్శనం (సర్వదర్శనం) క్యూలైన్‌లోనే రావాలని ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులపై స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలయ అధికారులు గతంలా ప్రత్యేక క్యూలైన్‌లో స్థానికులను అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.

 

 

 

 

 

 

 

 

ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం రామేశ్వరం నగరంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వేల సంఖ్యలో స్థానికులు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వైపు దూసుకొచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కారణంగా ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version