ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈ నేల 23 వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ మాహకాళి దేవాలయం 26 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న తెలిపారు.
మహంకాళి దేవలయము 26 వార్షికోత్సవం సందర్బంగా ఈ నేల 22 మంగళవారం బోనాలు, రంగము, 23 వ తేదీ బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి బలిపూజ, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనేల 23 తేదీ నాటికి శ్రీ మహంకాళి దేవలయం స్థాపించి 25 సంవత్సరాలు గడిచినట్లు తెలిపారు. 26 వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారకి బోనాలు, రంగము, అభిషేకం, భక్తీ గీతా ఆలపనాలు, భజనలు, వివిధ రకలైన సంస్కృత కార్యక్రమాలు అతివైభవంగా జరుప నిశ్చయించినట్లు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ ప్రాంత భక్తజనులందరు అధిక సంఖ్యలో పాల్గొని తన, మన, ధనములతో సేవచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి మకాళి మాత కృపకు పాత్రులు కాగలరని కోరారు.
ఆలయ చరిత్ర:-
మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వము బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నుండి జహీరాబాద్ పట్టణం మీదుగా కర్నాటక, మాహరాష్ట్రలకు రైల్వే లైన్ ఎర్పాటు చేశారు. ఆ సందర్భంలో జహీరాబాద్ పట్టణంలో రైల్వే లైన్ నిర్మాణం కోనసాగుతుండగా శ్రీ మహంకాళి ఆలయం వద్దకు రాగనే అట్టి పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ముందుకు సాగలేదు. అప్పట్లో ఓ పూజరి అక్కడికి వచ్చి మొగుడంపల్లి చౌరస్తా వద్ద శ్రీ మహంకాళి ఆలయం నిర్మించాలని ఇక్కడ అమ్మవారి నివాస స్థాలమని రైల్వే ఉన్నత అధికారులకు ఆదేశించారు. పూజరి ఆదేశం మేరకు ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం సమీపంలో నుండి రైల్వే లైన్ పనులు కోనసాగించి పూర్తి చేశారు. 25 సంవత్సరాల క్రితం జహీరాబాద్ పట్టణం గడి మాహీలకు చేందిన ప్రదాన అర్చకులు రాజన్న జహీరాబాద్ పట్టణ పెద్దలు శ్యాం రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుబాష్, జహీరాబాద్ మాజీ ఎంపిపి అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరుల సహయ సకారలతో శ్రీ మహంకాళి మాత ఆలయని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆలయనికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నేరవేరడంతో మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్నాటక, మాహరాష్ట్రల నుండి భక్తులు తరలి వచ్చి దైవదర్శనాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల 65 వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటంతో ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సహయ సహకారలతో దిన దనానికి మహంకాళి ఆలయం అభివృద్ది చేందుతు వస్తుంది..