*శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా
బోనాల పండుగ*
నర్సంపేట,నేటిధాత్రి:
బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వేడుకలలో భాగంగా అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక బోనాలు తయారు చేసి సంబరాలకు ముస్తాబు చేశారు.అలాగే విద్యార్థులు పోతురాజుల వేషధారణ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ బత్తిని బిక్షపతి బోనాల విశిష్టత గూర్చి తెలియజేశారు. చైర్మన్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ అని, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ బోనాల పండుగ పట్ల సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని కోరారు.ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ ఆడపడుచులు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తితో బోనం ఎత్తుకొని ఆడంబరంగా బోనాన్ని సమర్పిస్తారని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ఎంతగానో అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.