కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…
బోనంతో మొక్కలు చెల్లించిన మంత్రి వివేక్..
మైసమ్మ దీవెనలు అందరిపై ఉండాలి….
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..
మొక్కలు చెల్లించుకున్న ప్రముఖులు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఆషాఢ మాసం చివరి ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట జాతీయ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు పాలవాగు ఒడ్డున అమ్మవారి బోనంను నెత్తిన ఎత్తుకొని మైసమ్మ ఆలయంలో సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు చేస్తుండగా జోగినిలు భక్తి పారవశ్యంతో అమ్మవారికి బోనం సమర్పించారు. డబ్బు చప్పుళ్ళు వాయిద్యాల నడుమ సుమారు 250 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.కలకాలం సల్లంగ చూడమ్మా మైసమ్మ అని భక్తులు తల్లిని వేడుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
బోనంతో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్…
రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వె ళ్లాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అమ్మవారికి బోనం నెత్తిన పెట్టుకొని మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించారు. మంత్రి మాట్లాడుతూ మైసమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలన్నారు. నియోజకవర్గ అ భివృద్ధితో పాటు బొక్కలగుట్ట, గాంధారీ మైసమ్మ ఆలయ అభివృ ద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, జిల్లా నియోజకవర్గ నాయకులు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వ హించగా మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ రాజశేఖర్, సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్‌ఐలు ఆయాశాఖల అధికారులు క్యాతన్‌పల్లి మున్సిపాలిటి, బొక్కలగుట్టపంచాయతీ అధికా రులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టారు.