వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం.

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం

చందుర్తి నేటిధాత్రి:

శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణాచారి ఆధ్వర్యంలో మహా ఘనంగా మహిళలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణమాసంలో ఎంతో పవిత్రమైన రోజు శుక్రవారం రోజున ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందాన్ని తెలిపారు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆలయంలో కనుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆగస్టు 8 రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతము కుంకుమ పూజ మహా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొగలరని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు మహిళలు పాల్గొన్నారు.

కోటగుళ్లలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు..

కోటగుళ్లలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు

భారీగా తరలివచ్చిన భక్తులు

స్వామివారికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం నందీశ్వరుడు, గణపేశ్వరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలమాలతో కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు భవానీ మాతకు చీరే సారే, ఓడి బియ్యం సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం తులసి, మారేడు, ఉసిరి, తెల్ల జిల్లేడు, మేడి, నాగదేవుని పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు.

మొగడంపల్లీ మండలం మోతిమాత అమ్మ వారి ఆలయ.

మొగడంపల్లీ మండలం మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరు

◆:- హర్షవ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: పట్టణంలోని ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మొదటి సారిగా ఉప్పర్ పల్లీ తండా గ్రామంలో మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రానికి వచ్చారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకి కృషి చేయ్యాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో వారు సానుకూలంగా స్పందించి మంజూరు కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మంజూరు చేశారు అని వారు తెలిపారు.మొగడంపల్లీ మండలంలోని ఉప్పర్ పల్లీ తండా గ్రామంలో మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,ఎం.పి.సురేష్ శెట్కార్,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి హర్షవ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ యం.పి.పి.ప్రియాంక గుండా రెడ్డి,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,SC సెల్ అధ్యక్షుడు గోపాల్,ST సెల్ అధ్యక్షుడు చందర్,గోవర్ధన్ రెడ్డి,రూప్ సింగ్,రాజు పవార్, కన్నా నాయక్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాళికా మాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మానిక్ రావు..

కాళికా మాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మానిక్ రావు, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి చౌరాస్త వద్ద గల కాళికా మాత అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుకు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్,మాజీ సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఉదయం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శన నిమిత్తం రావడం జరిగింది. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, ఎంపీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బి.సంగమేశ్వర్, మాజీ సర్పంచులు మాణిక్ ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కేతకి ఆలయ మాజీ ధర్మకర్తలు సంతోష్ పటేల్, సత్యనారాయణ సింగ్, సంగమేశ్వర్, బి.ఆర్.ఎస్ ఝరాసంగం టౌన్ అధ్యక్షులు ఎజాస్ బాబా, నాయకులు ప్రవీణ్ పాటిల్, అశోక్ పాటిల్, వీరన్న పాటేల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పోచమ్మ, శ్రీ బాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన.

శ్రీ పోచమ్మ, శ్రీ బాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-99.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని నూతన ఆలయ ఆవిష్కరణ మరియు శ్రీ పోచమ్మ, శ్రీ బాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన.స్వస్తి శ్రీ విశ్వావసు నామ సం|| శ్రావణ శుద్ధ అష్టమి తేది : 1-8-2025 శుక్రవారము రోజున.స్వస్తి పుణ్యావాచనము, మాత్రిక, నాందీ, నవగ్రహ పూజ పోచమ్మ, బాలమ్మ యంత్ర విగ్రహాల ధాన్యాధి వాసం పూజా కార్యక్రమము కార్యక్రమ వివరాలు: తేది: 2-8-2025 శనివారము ఆయాదేవతల పూజ మరియు చండీహోమం విగ్రహ జలాధివాసం,తేది: 3-8-2025 ఆదివారము ఆయాదేవతల పూజ మరియు విగ్రహాల సయ్యాది పుష్పాది వాసం, ఉ॥ 10:45 ని||లకు యంత్ర విగ్రహ ప్రతిష్టానం. తేది: 3-8-2025 ఆదివారము ఉ॥ 9:00 గం॥ల నుండి మ॥ 12:30 వరకు హనుమాన్ మందిర్ నుండి పోచమ్మ గుడికి ప్రతి ఇంటి నుండి బోనము.ప్రతి ఇంటి నుండి బోనము తప్పనిసరిగా సమర్పించవలెను. అ 3 రోజులు భజన కార్యక్రమము 3 రోజులు మహా అన్న ప్రసాదము

శ్రీశ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిబిమని అవధూత గిరి మహారాజ్

శ్రీశ్రీ దేవగిరి మహారాణి ఆదిలక్ష్మి ఆశ్రమము

పూజ్య శ్రీ డా బసవలింగ్ అన గారు

శ్రీశ్రీ శ 108 వీరేశ్వర శివాచార్య హీరేముత్

మహంత్ శ్రీ విశ్వానందగిరి మహారాజ్

శ్రీ ఆహ్వానించువారు శ్రీ పోచమ్మ దేవాలయం ఆలయ భక్త బృందం, హౌసింగ్ బోర్డు, జహీరాబాద్.

మహంకాళి దేవలయం 26వ వార్షికోత్సవం.

మహంకాళి దేవలయం 26వ వార్షికోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల మహంకాళి దేవలయం 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న స్వామి ఆద్వర్యంలో వివిధ రకలైన పూజ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. మహంకాళి దేవలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో బోనాలు, రంగము, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం..

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-87.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారికి ప్రత్యేక పూజలు..

గురువారం అమావాస్య సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్
,కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప,తగిన ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్. ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమ్మవారి ఆలయాల కూల్చివేత భక్తజనాల ఆవేదన.

*తిరుపతి జిల్లాలో అమ్మవారి ఆలయాల కూల్చివేత భక్తజనాల ఆవేదన…

*పునర్నిర్మాణం కోరుతున్న ప్రజలు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 23:

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండల పరిధిలో కూతవేటు సమీపంలో ఉన్న జగత్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం అకస్మాత్తుగా కూల్చివేయబడింది. గత అయిదేళ్లుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వేలాది భక్తులు అమ్మవారిని తమ ఇంటి దేవతగా పూజించడమే కాకుండా ప్రతి సంవత్సరం జాతర, నవరాత్రుల వంటి పూజాకార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఆలయం అధికారిక గుర్తింపు లేకపోయినా, ప్రజల నమ్మకాన్ని చాటే భక్తిశ్రద్ధలు ప్రతి మూలకూ వ్యాపించాయి.
అయితే, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే ఆలయాన్ని కూల్చివేయడాన్ని భక్తులు సాంఘికంగా, ఆధ్యాత్మికంగా గాయపడే చర్యగా భావిస్తున్నారు. మతస్వేచ్ఛను హరించడమే కాకుండా, ఇది ప్రజాస్వామ్య పరిపాటికి విరుద్ధంగా ఉందని పలువురు విశ్వాసపాత్రులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే, ఆలయం కూల్చివేయడానికి అసలైన కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఆలయం ప్రమాద స్థితిలో ఉందని కారణంగా వ్యవహరించి ఉంటే, దాన్ని కూల్చడం కంటే పునర్నిర్మాణం చేయడమే అనుకూలమైన మార్గం కావాలి.
ఇంకా ముఖ్యంగా ఇదంతా స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర తిరుపతి జిల్లాలో జరగడం మరింత బాధాకరంగా మారింది. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యలు ఆ విశిష్టతను మరుగున పరుస్తున్నాయి.ప్రజలు ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాన్ని తిరిగి అదే స్థలంలో పునర్నిర్మించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని. చిన్న ఆలయమైనా ప్రజల విశ్వాసానికి నిలయంగా ఉంటే, దానికి శాసనబద్ధమైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించి, పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సంప్రదాయాల పరిరక్షణకు ఇది ఒక ఉదాహరణగా నిలిచేలా చూడాలని పొన్నా రవికుమార్ మరియు అమ్మవారి భక్తులు కోరుతున్నారు..

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-86.wav?_=3

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో రజకుల కుల దైవం మడేలేశ్వర స్వామి,సీతాలమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి రజక సంఘం కార్యాలయం నుండి అమరవాది చెరువు సమీపంలోని మడేలేశ్వర స్వామి గుడి వద్దకు పెద్ద ఎత్తున వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం బిజొన్ రజక సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి మాట్లాడారు.

Seethalamma Bonala Jatara.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రజకుల కుల దైవం అయిన మడేలయ్య కు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తామని అన్నారు.దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నడిగోట శంకర్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం సమ్మయ్య,తిరుపతి, కనకయ్య,రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, జిల్లా కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు, సంఘం సభ్యులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం..

ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నేల 23 వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ మాహకాళి దేవాలయం 26 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న తెలిపారు.
మహంకాళి దేవలయము 26 వార్షికోత్సవం సందర్బంగా ఈ నేల 22 మంగళవారం బోనాలు, రంగము, 23 వ తేదీ బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి బలిపూజ, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనేల 23 తేదీ నాటికి శ్రీ మహంకాళి దేవలయం స్థాపించి 25 సంవత్సరాలు గడిచినట్లు తెలిపారు. 26 వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారకి బోనాలు, రంగము, అభిషేకం, భక్తీ గీతా ఆలపనాలు, భజనలు, వివిధ రకలైన సంస్కృత కార్యక్రమాలు అతివైభవంగా జరుప నిశ్చయించినట్లు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ ప్రాంత భక్తజనులందరు అధిక సంఖ్యలో పాల్గొని తన, మన, ధనములతో సేవచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి మకాళి మాత కృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఆలయ చరిత్ర:-

మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వము బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నుండి జహీరాబాద్ పట్టణం మీదుగా కర్నాటక, మాహరాష్ట్రలకు రైల్వే లైన్ ఎర్పాటు చేశారు. ఆ సందర్భంలో జహీరాబాద్ పట్టణంలో రైల్వే లైన్ నిర్మాణం కోనసాగుతుండగా శ్రీ మహంకాళి ఆలయం వద్దకు రాగనే అట్టి పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ముందుకు సాగలేదు. అప్పట్లో ఓ పూజరి అక్కడికి‌ వచ్చి మొగుడంపల్లి చౌరస్తా వద్ద శ్రీ మహంకాళి ఆలయం నిర్మించాలని ఇక్కడ అమ్మవారి నివాస స్థాలమని రైల్వే ఉన్నత అధికారులకు ఆదేశించారు. పూజరి ఆదేశం మేరకు ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం సమీపంలో నుండి రైల్వే లైన్ పనులు కోనసాగించి పూర్తి చేశారు. 25 సంవత్సరాల క్రితం జహీరాబాద్ పట్టణం గడి మాహీలకు చేందిన ప్రదాన అర్చకులు రాజన్న జహీరాబాద్ పట్టణ పెద్దలు శ్యాం రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుబాష్, జహీరాబాద్ మాజీ ఎంపిపి అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరుల సహయ సకారలతో శ్రీ మహంకాళి మాత ఆలయని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆలయనికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నేరవేరడంతో మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్నాటక, మాహరాష్ట్రల నుండి భక్తులు తరలి వచ్చి దైవదర్శనాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల 65 వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటంతో ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సహయ సహకారలతో దిన దనానికి మహంకాళి ఆలయం అభివృద్ది చేందుతు వస్తుంది..

బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి

“బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి”

బాలానగర్ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో భవానిమాత దేవాలయంలో సోమవారం మండల బీజేవైఎం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల బీజేవైఎం అధ్యక్షులుగా కుమార్ నాయక్, ఉపాధ్యక్షులుగా శ్రీరామ్, నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా భరత సింహాచారి, సందీప్ కుమార్, ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ..

*శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా
బోనాల పండుగ*

నర్సంపేట,నేటిధాత్రి:

బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వేడుకలలో భాగంగా అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక బోనాలు తయారు చేసి సంబరాలకు ముస్తాబు చేశారు.అలాగే విద్యార్థులు పోతురాజుల వేషధారణ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ బత్తిని బిక్షపతి బోనాల విశిష్టత గూర్చి తెలియజేశారు. చైర్మన్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ అని, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ బోనాల పండుగ పట్ల సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని కోరారు.ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ ఆడపడుచులు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తితో బోనం ఎత్తుకొని ఆడంబరంగా బోనాన్ని సమర్పిస్తారని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ఎంతగానో అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-58.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పరిధిలోని ఆదివారం బోనాల పండుగ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో మహిళలు బోనాలు ఊరేగింపుగా తీసుకొని ఝరాసంగం కాలనీలోని పోచమ్మ మందిరానికి తీసుకువచ్చారు.

Bonala festival

గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఆయా కాలనీ వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ బోనాల కార్యక్రమానికి ఝరాసంగం ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక ప్రాంత ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు వివిధ ప్రాంతాల చెందిన భక్తులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-57.wav?_=5

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో
అనుమతు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాల్కల్ ఎంపీడీవో గూడెం శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శుల వద్ద అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు..

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-56.wav?_=6

జహీరాబాద్ నేతి ధాత్రి:

దక్షిణ కాశీగా పిలిచే ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం, బహుళ దశమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలు, కుంకుమార్చన, బిల్వార్చన తదితర పూజలతో మంగళహారతి చేశారు. సోమవారం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…

కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…

బోనంతో మొక్కలు చెల్లించిన మంత్రి వివేక్..

మైసమ్మ దీవెనలు అందరిపై ఉండాలి….

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..

మొక్కలు చెల్లించుకున్న ప్రముఖులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-52.wav?_=7

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఆషాఢ మాసం చివరి ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట జాతీయ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు పాలవాగు ఒడ్డున అమ్మవారి బోనంను నెత్తిన ఎత్తుకొని మైసమ్మ ఆలయంలో సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు చేస్తుండగా జోగినిలు భక్తి పారవశ్యంతో అమ్మవారికి బోనం సమర్పించారు. డబ్బు చప్పుళ్ళు వాయిద్యాల నడుమ సుమారు 250 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.కలకాలం సల్లంగ చూడమ్మా మైసమ్మ అని భక్తులు తల్లిని వేడుకొని మొక్కలు చెల్లించుకున్నారు.


బోనంతో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్‌…

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వె ళ్లాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అమ్మవారికి బోనం నెత్తిన పెట్టుకొని మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించారు. మంత్రి మాట్లాడుతూ మైసమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలన్నారు. నియోజకవర్గ అ భివృద్ధితో పాటు బొక్కలగుట్ట, గాంధారీ మైసమ్మ ఆలయ అభివృ ద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, జిల్లా నియోజకవర్గ నాయకులు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వ హించగా మందమర్రి సీఐ శశిధర్‌ రెడ్డి, రామకృష్ణాపూర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌, సర్కిల్‌ పరిధిలో ఉన్నటువంటి ఎస్‌ఐలు ఆయాశాఖల అధికారులు క్యాతన్‌పల్లి మున్సిపాలిటి, బొక్కలగుట్టపంచాయతీ అధికా రులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టారు.

గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో.!

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణ బురద గూడెంలో మహంకాళి బోనాల జాతర….
మంచిర్యాల జిల్లా మందమర్రి బుర్రగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర ఉంటుందని భక్తులందరూ పాల్గొని బోనాలను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు సతీష్ భవాని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం మందమర్రి కామాఖ్య ఆలయం లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఈ బోనాల జాతరకు ప్రతి ఇంటి నుండి బోనాలతో రావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు అర్చకులు సతీష్ భవన్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version