డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఉదయం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శన నిమిత్తం రావడం జరిగింది. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, ఎంపీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బి.సంగమేశ్వర్, మాజీ సర్పంచులు మాణిక్ ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కేతకి ఆలయ మాజీ ధర్మకర్తలు సంతోష్ పటేల్, సత్యనారాయణ సింగ్, సంగమేశ్వర్, బి.ఆర్.ఎస్ ఝరాసంగం టౌన్ అధ్యక్షులు ఎజాస్ బాబా, నాయకులు ప్రవీణ్ పాటిల్, అశోక్ పాటిల్, వీరన్న పాటేల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.