ప్రభుత్వ భూములను పరిరక్షించండి.

ప్రభుత్వ భూములను పరిరక్షించండి.

నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి :

 

 

 

నాగర్‌కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాలలో కుంటల ఆక్రమణలు,చెరువు శికం భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్దానిక సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్ పట్టణం కొత్త జిల్లా గా ఏర్పడిన నాటి నుండి జిల్లా పరిసర ప్రాంతాలలో చాలా వరకు కుంటలు,చెరువు శిఖం భూములు ఆక్రమణలు జరిగినట్లు వివిధ పత్రికలలో వార్తలు వినపిస్తున్నాయని ఇట్టి భూఆక్రమణల పై గతంలో కలెక్టర్ కూడ నివేదికలు ఇవ్వమని సంబంధిత అధికారులను ఆదేశించినా చర్యల విషయంలో అధికారాలు,ఆధారాలు ఉన్నా ఆలస్యం చేస్తూ నివేదికల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని,పట్టణ ప్రజలకు,రైతులకు మేలు చేసే చెరువులను, కుంటలను కాపాడవలిసిన తక్షణ కర్తవ్యం జిల్లా ఉన్నతాధికారులపై ఉందని ప్రకృతి వనరులను రాజకీయ అండదండలతో చెరబట్టి ధ్వంసం” చేసి కాంక్రీట్ జంగిల్ గా కందనూలు చెరువు”లను మారుస్తున్నా.జిల్లా ఉన్నతాధికారుల లో ఏమాత్రం చలనం కలగడం లేదని వాపోయారు.

జల వనరులను ఎవరు ఆక్రమించుకున్నా విచక్షణాధికారం ఉపయోగించి ప్రభుత్వ ఆధీనం లోకి తెచ్చుకునే అవకాశం ఉన్నా,ఆ దిశగ ఉన్నతాధికారులు ప్రయత్నించకపోవడం బాధాకరమని,ఆక్రమణలపై కోర్టుకేసులు ఉన్నా కబ్జాదారుల విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కోర్టుల దృష్టికి తీసుకెళ్లి కూల్చివేసే అధికారం జిల్లా ఉన్నతాధికారులకు ఉందని,ప్రజల ఆస్తులకు ఏ మాత్రం నష్టం వాటిల్లినా,తమ అధికార దండాన్ని ఉపయోగించే అవకాశం ఉన్నతాధికారులకు ఉన్నా చర్యలు తీసుకోకుండా..

 

Government lands

 

ప్రేక్షక పాత్ర వహిస్తే,మిగిలిన ప్రభుత్వ భూమి కూడ కబ్జా ల పాలుకావడంతో పాటు భవిష్యత్తు తరాలకు తీరని నష్టం”చేసిన వారు అవుతారాని సూచించారు.చెరువు బఫర్ జోన్, శిఖం పరిధి లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని చట్టంలో ఉన్నా భూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కుంటలను ధ్వంసం చేస్తూ,చెరువు శిఖం భూములలో నిర్మాణాలు చేసిన వారిపై పీ.డి యాక్ట్ ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టాల్సిందిగా పిర్యాదు లో విజ్ఞప్తి చేసారు.

55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.

సంకేపల్లి గ్రామంలో 55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
*శంకర్ పల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

 

శంకర్ పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామస్థులతో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమస్యలని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ పనులలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పనులలో జాప్యం జరగకుండా పనులను త్వరితగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, ఫిల్డ్ అసిస్టెంట్ ఉబాగుంట రాజు, మాజీ సర్పంచ్ భద్రయ్య, వార్డు మెంబర్లు, కావాలి గోపాల్, సురేష్, మౌనేష్ , తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతీ దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డియార్వో విజయలక్ష్మి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి,నర్సంపేట ఉమారాణి గార్లు పాల్గొని ప్రజలనుండి స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 130 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ 54, హౌసింగ్ 20 దరఖాస్తులు వచ్చాయని మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 56 వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం లభించకపోవడంతో ప్రజావాణికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని,మీ పరిధిలో పరీక్షించవలసిన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు.ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఆదేశించారు.ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తుదారునికి వివరించే ప్రయత్నంచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టిఐ ,గ్రీవెన్స్ పెండేల్సి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,e ఫైలింగ్ లో ఫైల్స్ సర్క్యులేట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.వ్యవసాయ,ఆరోగ్య, విద్యాశాఖ తదితర శాఖలు శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలని పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణచేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ అధికారి అనసూయ, డిబిసిడివో పుష్పలత,జిల్లా విధ్యా శాఖ అధికారి జ్ఞానేశ్వర్,నర్సంపేట ఆర్డీఓ ఇమారాణి,సంబంధిత అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న.

దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమిద్దాం

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి – ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపుని స్తున్నట్లు యుగంధర్ తెలిపారు.

ఈముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కరీంనగర్ బస్టాండ్ వద్ద విడుదల చేశారు.

ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నష్టపరిచే చర్యలను దేశ పౌరులు తిప్పికొట్టాలని వారు అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోడీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

మోడీ ట్రంప్ మాటలను సైతం ఖండించలేదని వారు అన్నారు.

భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు.

మోదీ అమెరికా సందర్శించినప్పుడల్లా కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తారు.

‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వారు ధ్వజమెత్తారు.

ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

మోడీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదని వారు ఉద్ఘటించారు.

అందుకే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

ఈపోస్టర్ విడుదల కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కనకం ప్రవీణ్, వినయ్, చరణ్, మధు, రాజేష్, కిరణ్ రాఘవేంద్ర,కుమార్, వినయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ పంచాయతీ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది.పరిశీలన అనంతరం అధికారులు మాట్లాడుతూ వీలయినంత త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనీ లబ్దిదారులకు సూచించారు.నిర్మాణం స్టేజిల వారిగా ఫోటో కాప్చర్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కాంక్షని,పంచాయతీ కార్యదర్శి అరెల్లి సత్యనారాయణని ఆదేశించారు.

కోతుల నుండి రక్షించండి.

కోతుల నుండి రక్షించండి…

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది.అవి తరచుగా ఇళ్లలోకి ప్రవేశించి ఆస్తి నష్టం కలిగిస్తున్నాయనీ,ఇళ్ళముందు బాల్కనీ రక్షణ గోడలపై కూర్చుంటూ,విద్యుత్ తీగలపై తిరుగుతూ ప్రజలను,ముఖ్యంగా పిల్లలను,మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయనీ స్థానికులు వాపోతున్నారు.ఈ కోతులను సురక్షితంగా నియంత్రించి,నిర్బంధించి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాత మంచిర్యాల ప్రాంతవాసులు కోరుతున్నారు.ఈ ప్రాంత ప్రజల భద్రత మరియు శ్రేయస్సు కోసం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.  

వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.

ఝరాసంగం: వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు. ఈ యొక్క సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు సురేష్ బుద్ధిష్ట్ర సొసైటీ నాయకులు సుభాష్, నర్సింలు, అశోక్, రాజు, బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రిని కలిసిన వై.నరోత్తం.

జహీరాబాద్: మాజీ మంత్రిని కలిసిన వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి టి. హరిశ్ రావు ని సోమవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, యం. జైపాల్, మల్లేశం, లు ఉన్నారు.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

 

పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన
అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.

ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.

తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.

కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.

ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?

వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?

ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.

కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.

ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.

5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం
అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?

ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.

హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?

గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.

30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.

మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.

నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.

క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.

కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.

గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.

వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.

ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.

సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.

ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.

చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025.

నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించబడుతున్న నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (NSPC)-2025 పోస్టర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా lAS సోమ వారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకుపర్యావరణ పరిరక్షణ లో భాగంగా నీటి సంరక్షణ, చెట్లు నాటడం, మరియు తడి పొడిచెత్త వేరుచేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలని మరియు క్విజ్ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య DYSO రాందాస్ పాల్గొన్నారు.
“HARIT – The Way of Life” అనే నినాదంతో ఈ పోటీ July 1 నుంచి August 21, 2025 వరకు దేశవ్యాప్తంగా జరుగనుంది. August 30న ఫలితాలు ప్రకటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనవచ్చని వారు సూచించారు.
ఈ పోటీని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు.
పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీకి సంబంధించిన నమోదుకు, క్విజ్ పోటీకి సంబంధిత లింకులు కూడా విడుదల చేశారు.పోటీ గమ్యం: విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన లింక్ పోటీ
https://ecomitram.app/nspc/
వెబ్సైట్లో విద్యార్థులు చూడవలసిందిగా కోరారు.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. అదేవిధంగా, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఇట్టి అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు._

కరెంటు కష్టాల నుండి కాపాడండి.

కరెంటు కష్టాల నుండి కాపాడండి.

ఆమనగల్లు/నేటి దాత్రి:

 

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్ మండలంలో ఆకాశంలో వర్షపు మబ్బులు కనబడితే మన ఆమనగలులో కరెంటు కష్టాలు…. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి గాలిలో వచ్చినయ్ కానీ రెప్పపాటు లో కూడా కరెంటు పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కరెంటు ఎందుకు పోతుంది అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ పత్య నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది BRS ప్రభుత్వం లొ కరెంటు పోతే వార్త ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కరెంటు వస్తే వార్తా అవుతుంది ఇప్పటికైనా మేల్కొని రైతులకు న్యాయమైన 24 గంటల వ్యాపారస్తులకు మరియు గృహస్థులకు మీ డిపార్ట్మెంటు ఏ విధంగా కరెంటు బిల్లు వసూలు చేస్తుందో అదేవిధంగా తమరు కూడా వినియోగదారులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ఆగ్రహాన్ని రాబోయే రోజులలో తమరు చూడాల్సి వస్తుందనిBRS పార్టీ సీనియర్ నాయకులు పత్య నాయక్ ప్రభుత్వనీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ సోనా శ్రీనునాయక్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, మాజీ కౌన్సిలర్ రాధమ్మ, వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రమేష్ నాయక్, సైదుల్ గౌడ్, మల్యా నాయక్, కృష్ణవేణి నాయక్, శ్రీకాంత్ నాయక్, భాస్కర్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోం..

అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోం..

నేడంతా డిజిటల్ మయమే..

సమస్యలపై సంఘటితంగా పోరాడుదాం.

ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్..

డిజిటల్ మీడియా ఎడిటర్స్ కార్యవర్గం ఎన్నిక..

“నేటిధాత్రి”, హనుమకొండ.

డిజిటల్ మీడియా అని చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, 

అన్ని పత్రికలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంనే ఆశ్రయిస్తున్నాయని వరంగల్ డిజిటల్ మీడియా ఎడిటర్లు అన్నారు.

సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్ల సమావేశం వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా డిజిటల్ పేపర్లకు రాజకీయంగా, ప్రభుత్వ అధికారుల నుంచి రావాల్సిన గుర్తింపుపై చర్చించారు.

మనం ఉన్నది ఆశించే స్థాయిలోకాదని, శాసించే స్థాయిలో ఉన్నామన్నారు.

అన్ని పత్రికల్లా మనం కూడా ప్రభుత్వ, రాజకీయ, ప్రజల సమస్యలపై కథనాలు ఇస్తున్నామని చెప్పారు.

రానున్న రోజుల్లో అన్ని పేపర్లు డిజిటల్ వైపే చూస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఓరుగల్లు డిజిటల్ మీడియా ఎడిటర్స్ సంఘానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం సలహదారులుగా “నేటిధాత్రి” ఎడిటర్ కట్ట రాఘవేందర్ రావు , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్షుడిగా వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, ఉపాధ్యక్షులుగా స్పాట్ వాయిస్ ఎడిటర్ చేలిక రాజేంద్రప్రసాద్, అక్షరశక్తి ఎడిటర్ పల్లె రవివంశీమోహన్, ఘంటారావం ఎడిటర్ బొల్లెపల్లి.

కిషన్, ప్రధాన కార్యదర్శిగా అక్షరదర్భార్ ఎడిటర్ వేముల రాజేశ్వర్ రావు, సహాయ కార్యదర్శులుగా జననిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, మన కలం ఎడిటర్ సుంకరనేని నర్సయ్య, అక్షర సవాల్ ఎడిటర్ బాదవత్ బాలాజీ నాయక్, సంస్కృతిక కార్యదర్శిగా ఎడిటర్ యాంసాని శ్రీనివాస్, ట్రెజరరీగా కౌడగాని మోహన్ రావు, మీడియా ఇన్ చార్జ్ గా స్పాట్ వాయిస్ నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా రావుల రాజేశం, లింగబత్తిని కృష్ణ, సంపతి ప్రభాకర్ రావు, దాసరి మధు సూదన్, వక్కల వెంకటస్వామి, చల్లా రాజిరెడ్డి, కోల జనార్దన్, కే. కిరణ్, పెంచాల రాజును ఎన్నుకున్నారు.

సీపీ సన్ ప్రీత్ సింగ్ ను కలిసిన వరంగల్ నూతన ఏఎస్పీ.

సీపీ సన్ ప్రీత్ సింగ్ ను కలిసిన వరంగల్ నూతన ఏఎస్పీ

వరంగల్, నేటిధాత్రి

 

 

 

వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నాడు, వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ, పేద ప్రజలకు సత్వర న్యాయం అందించాలని, డివిజన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా శాంతి భద్రతలు కాపాడాలని ఏఎస్పీకి సూచించారు.

రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం.

రామలింగేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో నేడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు బలబత్తుల రాజకుమార్ తెలిపారు.
నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామస్తులు ఆధ్వర్యంలో ఉదయం మంగళవారం రోజున మన రామలింగేశ్వర స్వామి దేవతా మూర్తులకు పంచామృత అభిషేకం,అర్చనాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వార్షికోత్సవ సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.

సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ

*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు.

“నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు”

“మోసం చేశారని అడిగితే.. చంపుతామని బెదిరింపు”

“పొలం ఇప్పించి.. న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు”

 

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన చిన్న యాదమ్మకు అదే గ్రామంలో సర్వేనెంబర్ 677లో, 38 గుంటల పట్టా పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు యాదమ్మకు మాయ మాటలు చెప్పి పట్టా పొలాన్ని ప్రజా ప్రతినిధుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఆమెకు 966 సర్వే నెంబర్ లో.. ఆమెకు ఒక ఎకరా గైరాన్ పొలం ఆమె పేరా చేశారు. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశారని నిలదీస్తే.. తమకు రూ.5 లక్షలు ఇస్తే తిరిగి పొలం ఇస్తామని.. చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధుల ఆధీనంలో ఉన్న తన పట్టా పొలాన్ని తనకు ఇప్పించాలని కలెక్టర్ కు వినతిపత్రంలో బాధితురాలు కోరింది.

గుళికల యూరియా వద్దు నానో యూరియా ముద్దు.

గుళికల యూరియా వద్దు నానో యూరియా ముద్దు

పి హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.

కాశిబుగ్గ నేటిధాత్రి.

 

 

 

 

గీసుగొండ మండలంలో 14,000 ఎకరాలకు పైగా సాగవుతున్న పత్తి పంటకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన 135 కిలోల యూరియా మోతాదును 4 భాగాలు చేసి వేసుకోవాలని,మొదటి 5 రోజుల్లో 25%,తర్వాత 20-25 రోజుల వ్యవధిలో,మూడు సార్లు సమాన మోతాదులో, మిగతా 75% యూరియా వేసుకోవాలి.అలాగే వరి పంటకైతే 96 కిలోలు మూడు భాగాలు చేసుకొని వేసుకోవాలి.వరి నాటు వేసిన 15 రోజులకు 30 కిలోలు,30 రోజులకు 35 కిలోలు,చిరు పొట్ట దశలో 31 కిలోలు వాడాలని తెలిపారు.
పైన తెలిపిన యూరియాను గుళికల రూపంలో (45 కిలోల బ్యాగ్స్) వాడటం తగ్గించి, ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చిన నానో ప్లస్ ద్రవరూప యూరియాను ఒక అర లీటర్ ఒక ఎకరానికి నేరుగా స్ప్రేయర్/డ్రోన్ తో గాని పిచికారి చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.ఎందుకంటే నానో ప్లస్ ద్రవ రూప యూరియాను వాడటం వలన చాలా లాభాలు కలిగి ఉన్నాయి.
⏩సాధారణ యూరియా తో గ్రీన్ హౌస్ వాయువు(నైట్రస్ ఆక్సైడ్) విడుదలై భూమి వేడెక్కడమే కాక వర్షపు నీటితో కలిసి జల కాలుష్యం కు కూడా జరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది.అదే నానో యూరియా వాడితే 40% వరకు వాతావరణ,నీటి కాలుష్యం తగ్గించవచ్చు.
⏩ వరి ఆకుల పైన ఈ ద్రవరూప యూరియా వెంటనే పూర్తిగా వ్యాప్తి అయ్యి, అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్న నత్రజని వేగంగా గ్రహించబడి,వినియోగ సామర్థ్యం (80-90%) అత్యధికంగా ఉండి,మొక్క ఆరోగ్యవంతముగా పెరుగుదల ఉండి,సరియైన నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయని తెలిపారు.(అదే 45kg ల యూరియా బ్యాగ్ వేస్తే 40% మాత్రమే మొక్కకు వేర్ల ద్వారా చేరుతుందని ఇక్కడ రైతులు గమనించాలని కోరారు).
⏩నానో ప్లస్ ద్రవరూప యూరియా వాడడం వల్ల నేల స్వభావం,రసాయన-జీవ వాతావరణం,మిత్ర కీటకాలు వృద్ధి చెందడం పై ఏవిధమైన చెడు ప్రభావం ఉండదు.
⏩నత్రజని మొక్క వేళ్ళకు అందకుండా నేల లోపలికి ఇంకిపోయే నష్టం ఉండదు.
⏩ఇట్టి నానో ప్లస్ ద్రవరూప యూరియాను పై రెండు పంటలేకాక మొక్కజొన్న , ఎండుమిరప, పప్పు దినుసులు & ఇతర అన్ని పంటల పైన పిచికారి చేసుకొనవచ్చు అని అన్నారు.

కాబట్టి, పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు అవసరం మేరకే యూరియాను మరియు ఇతర రసాయన ఎరువులను వేసుకోవాలి. పర్యావరణాన్ని, జలాశయాలను విషపూరితము చేస్తున్న గుళికల రూపంలోని యూరియా వాడకం తగ్గించి నానో సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన యూరియాను విరివిగా వాడాలని కోరారు.
శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారులు పైన చేప్పిన సూచనలను రైతుసోదరులు గమనించి,అర్థం చేసుకొని, సహకరించి పాటించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

పి.హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version