25లక్షల గంజాయి పట్టివేత..
ఇద్దరు యువకుల అరెస్టు
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ నర్సంపేట రోడ్డులో పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు మైనర్ గా గుర్తించారు. ఒడిశాకు చెందిన పండు అనే వ్యక్తి సుపారీతో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద 51.081కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా. దీని విలువ 25,54,050 గా అంచనా వేస్తున్నారు.