కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…

కోతుల బెడద వల్ల వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది…

రోడ్లపైకి వెళ్ళుటకు జంకుతున్న ప్రజలు…

పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు…

కోతులకు ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని కోరుతున్న ప్రజలు…

రాష్ట్రపతి ద్రౌపది మూర్ముకు లేక రాసిన సామాజికవేత్త కందునూరి ఈశ్వర్ లింగం…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

గార్ల మండల వ్యాప్తంగా 20 గ్రామపంచాయతీలతో పాటు,ముఖ్యంగా గార్ల పట్టణ కేంద్రంలో కోతులు జనవాసాలలోకి గుంపులు, గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది.ఆకలితో అలమటిస్తూ,అడవులను వదిలేసి గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి.కోతుల దాడులలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే ఇక అంతే సంగతులు కోతులు ఇంట్లోకి ప్రవేశించి వంట సామాగ్రి, దుస్తులు,ఆహార పదార్థాలు చిందర-వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తమ అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.వసతి గృహాలలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కోతుల బారినపడి గాయాలైన సందర్భాలు కో కొల్లలుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద వల్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది. పండించిన పంటను చేతికొచ్చే సమయంలో కోతులు ఆగం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులకు ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని ప్రజలు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.ఇప్పటికే కోతుల నివారణ చర్యలు చేపట్టాలని సామాజికవేత్త రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు లేఖ రాశారు. రాష్ట్రపతి కార్యాలయానికి ఈశ్వర్ లింగం రాసిన లేక అందినట్లు తనకు లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.అనేక దఫాలుగా కోతుల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరినప్పటికీ సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా కోతుల నివారణ చర్యలు చేపట్టాలని విద్యార్థులు,విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

కోతుల నుండి రక్షించండి.

కోతుల నుండి రక్షించండి…

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది.అవి తరచుగా ఇళ్లలోకి ప్రవేశించి ఆస్తి నష్టం కలిగిస్తున్నాయనీ,ఇళ్ళముందు బాల్కనీ రక్షణ గోడలపై కూర్చుంటూ,విద్యుత్ తీగలపై తిరుగుతూ ప్రజలను,ముఖ్యంగా పిల్లలను,మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయనీ స్థానికులు వాపోతున్నారు.ఈ కోతులను సురక్షితంగా నియంత్రించి,నిర్బంధించి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాత మంచిర్యాల ప్రాంతవాసులు కోరుతున్నారు.ఈ ప్రాంత ప్రజల భద్రత మరియు శ్రేయస్సు కోసం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.  

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version