ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య

వైస్ చైర్మన్ గా గొలనకొండ వేణు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం స్థానిక నర్సంపేట పురపాలక సంఘంలో ఆర్టీసీ డిపోకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నూతన డిపో జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు.

RTC

డిపో జేఏసీ చైర్మన్ గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్. డబ్ల్యూఎఫ్) డిపో అధ్యక్షులు కొలిశెట్టి రంగయ్య,తెలంగాణ జాతీయ మజ్దార్ యూనియన్ (టీజేఎంయూ) డిపో సెక్రెటరీ గొలనకొండ వేణును వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా ఎంకే.స్వామి (టీఎంయూ), పీసీ. పాలన్ (ఈయూ), బూర ప్రవీణ్ కుమార్, కందికొండ మోహన్, బొడిగె రాజు,ఎండి. జానీపాషా, మంద రాజు, నామాల అశోక్ కుమార్, డ్యాగల వెంకట్రాం నర్సయ్య, ఎన్.రాజాలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం..నిలుస్తాం

బిసా రమేష్,తాళ్ళ రవి ముదిరాజ్

నేటిధాత్రి:

ముదిరాజ్ ల జాతి అభివృద్ధి కోసం విద్యా,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా అడుగులు వేద్దామని అవిశ్రాంతంగా ముదిరాజ్ కుల బంధువుల అభ్యున్నతికి పాటుపడుతున్న మెపాకు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజికతలో ముదిరాజ్ ల వెనుకబడి ఉన్నారని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మెపా చేస్తున్న ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుగా అన్ని రంగాలలో ముదిరాజ్ లు రాణించేలా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మెపా అభివృద్ధికి విస్తరణకు మూలాలలోకి వెళ్తూ గ్రామ గ్రామాన కలిస్తే గెలుస్తాం.. నిలుస్తాం అని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసా రమేష్ ముదిరాజ్,మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ ముదిరాజ్ లకు చైతన్య కార్యక్రమాలు,విద్యతో అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి కాబట్టి ముదిరాజ్ యువత విద్య,ఉద్యోగ అవకాశాల వైపు రాజకీయ సాధికారతవైపు అడుగులు వేసేందుకు ముదిరాజ్ లు ఒక తాటిపైకి వచ్చి పూర్తిస్థాయిలో కలిసికట్టుగా సహకరిద్దామని తెలియజేశారు.

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి.!

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం జన్మదిన వేడుకలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్)మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు బి.దిలీప్ డబ్లూ హెచ్ ఆర్ పి సి ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు శంకర్, శివరాజ్ పాటిల్,నబి సాబ్, యం.జైపాల్,కె.నర్శింలు,చెంగల్ జైపాల్,జి.జగన్,బాల్ రాజ్, ఇమ్రాన్,సి.యం.అశోక్ రెడ్డి, పెంటన్న,అనిల్,తదితరులు పాల్గొన్నారు

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

కులాలకతీతంగా, పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై ఐక్యంగా పోరాడితేనే పార్లమెంటులో బీసీ బిల్లు సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడుక్కుంటే వచ్చేది బిచ్చం..పోరాడితే సాధించుకునేది మన వాటా అని అన్నారు. బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటామన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీ బిల్లుకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీల పక్షపాతేనన్నారు. దేశంలో బీసీ వాదం బలంగా ఉందని, బీసీలు అగ్గిరాల్చితే అందరూ భయపడతారన్నారు. తమిళనాడులో దివంగత జయలలిత మాదిరిగా మనం కూడా మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారు. రాజ్యాంగ స్వరూపాన్ని మార్చైన మన రిజర్వేషన్లను సాధించుకోవాలని, బీసీ బిల్లు కోసం పార్లమెంట్ సభ్యులతో చర్చించాలని, బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలు, పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగా మిగలవద్దన్నారు. బీసీలు బిచ్చగాళ్లు కాదు..రాజ్యాధికారం వైపు పయాణించే బ్రిలియంట్ క్యాస్ట్ అని తెలిపారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా.!

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కార్యక్రమాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

* సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,సిరిసిల్ల ఇన్చార్జ్ ఆర్డి.ఓ రాదాబాయి తో కలిసి ఇల్లంతకుంట తహసిల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని, వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగి లో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట పండిందని అన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లకు, అదనపు కలెక్టర్ లు, పౌర సరఫరాల అధికారులకు, ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. వాన కాలం కంటే అదనంగా యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాళ్ళు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధిక ప్రాధాన్యత అందించాలని , దీనికి అనుగుణంగా జిల్లాలలో ఐకెపి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలలో మౌలిక వస్తువుల కొరత ఉంటే కలెక్టర్లు వాటిని కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు.
భారత ఆహార సంస్థ మార్గదర్శకాలు ప్రకారం నూకల శాతం 25 దాటకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ధర కంటే అధికంగా అందిస్తే మాత్రమే రైతులు ప్రైవేట్ గా బియ్యం అమ్ముకోవాలని, తక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదని అన్నారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని అన్నారు.
13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సన్న బియ్యం నాణ్యత పై సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడ వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే వెంటనే ఖండించాలని మంత్రి అధికారులకు సూచించారు.నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు, కొరత ఎక్కడైనా ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని తెలిపారు. జిల్లాల 36 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా, ఒక్కరు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని, మిగతావారు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైస్ మిల్లర్లు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా గోదాములలో రైతుల ధాన్యం నిలువ చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్,జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, అధికారులు కిషోర్, మిషన్ భగీరథ అధికారులు జానకి, శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డిఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక. 

ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక. 

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని మైలారం గ్రామ ఉద్యమకా రుల గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దుదిపాలజోగిరెడ్డి, ఉపాధ్య క్షుడు అరికిల్ల వీరయ్య, ప్రధానకార్యదర్శిలు గొర్రె కుమారస్వామి, దూదిపాల రాజిరెడ్డి, కోశాధికారి బొంతల నాగరాజు, కార్యవర్గ సభ్యులు దూదిపాల రాంరెడ్డి, సోంటెడ్డి శంకర్, బొంతల సాంబయ్య, ఆకారపు ఐలయ్య, బొంతల భిక్షపతి ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షుడు పల్లెబోయిన సారయ్య తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భముగా యేసు క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానములను స్మరించు కొంటూ , బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లోని క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లంపల్లి పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం లోని క్రైస్తవ మత పెద్దలు రెవ సి హెచ్ అశోక్, ఫాదర్ కురియన్, జార్జ్ మాత్యు , జోషి, స్వామి జాకబ్ వారి ఆద్వర్యం లోని సంఘాల విశ్వాసులు ప్రార్ధనా పూర్వకంగా పాల్గొని కార్యక్రం జయప్రదం చేశారు.

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల.!

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల కార్యవర్గం ఎన్నిక. 

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) రాజన్న సిరిసిల్ల శాఖ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా డా. నల్ల మధు మరియు జనరల్ సెక్రటరీగా డా. తడుకా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్యులు డా. కె ప్రసాద్ రావు, డా. మురళీధర్ రావు, డా. శ్రీనివాస్, డా. సురేంద్రబాబు గారులతో పాటు, ఇతర పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా( IAP) రాజన్న సిరిసిల్ల శాఖ సామూహిక కార్యకలాపాల శక్తివంతమైన ఆరంభాన్ని సూచిస్తూ, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనుంది అని వైద్యులు తెలిపారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో సంబంధిత ఆయా గ్రామ అంగన్వాడీ టీచర్స్ పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించారు.శనివారం మిట్టపల్లి,కుందారం గ్రామపంచాయతీలలో అంగన్వాడి సిబ్బందీలు వేరువేరుగా పోషణ పక్షం కార్యక్రమాలు చేపట్టారు.మిట్టపల్లిలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాటి ప్రాముఖ్యతను తెలిపారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేశారు. కుందారంలో వివో సంఘం మహిళలకు పోషణ పక్షం గురించి చెప్పారు. రక్తహీనతను అధిగమించడానికి తీసుకునే వివిధ పోషక పదార్థాల గురించి వివరించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేసి,ప్రతి ఒక్కరు వాటిని రోజువారి ఆహార దినచర్యలో చేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, మహిళలు,వివో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ).!

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కరీంనగర్ నగర నూతనకమిటీఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభలో నగర నూతన కమిటీని శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శిగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కోశాధికారిగా బీర్ల పద్మలతో పాటు పదకోండు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై తోమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను నూతనంగా ఎన్నుకోనైనదని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ నగరంలో సిపిఐ పార్టీని వాడవాడనా బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా మున్సిపల్ పై ఎగిరే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. నగరంలో వేలాది మంది ప్రజలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు.

హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి.!

ధియేటర్ లలో హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి

 

పరకాల నేటిధాత్రి

 

ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని జయడీలక్స్ మరియు కాకతీయ థియేటర్లలో అరవ రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు.మేనేజర్, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గూర్చి అవగాహన కలిపించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషేర్ ఏర్పాటు చేసుకోవాలనీ,నిర్ధేశించిన సమయంలో వాటిని రీఫిల్ చేసుకోవాలని తెలిపారు.హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని, రెడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉండాలని సూచించారు.హలొజెన్ దీపాలను వాడలని అత్యవసర సమయలో సిబ్బందికి,సెక్యూరీటీ సిబ్బందికి ఫైర్ స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పరకాల అగ్ని మాపక సిబ్బంది ఎల్ఎఫ్ కృషుమార్,డ్రైవర్ సత్తయ్య ఫైర్మన్ సత్యం,దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ. మహేష్ బి.గీతే దంపతులు శనివారం దర్శించుకోవడం జరిగినది. అనంతరం ఆలయ అర్చకులు జిల్లా ఎస్పీకి స్వాగతం పలుకుతూ, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.వేద పండితులు అద్దాల మండపంలో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ ఈవో కె.వినోద్ శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు సిరిసిల్ల జిల్లా ఎస్పీకి అందజేశారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి

-స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం

-కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి

-మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

 

ఓరుగల్లు గడ్డమీద జరగనున్న 27వ రజతోత్సవ సభలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని సర్పంచ్ ల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
బీఆర్ఎస్ నాయకత్వానికి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సబ్బండ వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. నాడు అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారని, నేడు రైతన్నలు మొదలు ప్రతి ఒక్క రంగానికి చెందిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హావా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రజతోత్సవ సభ నాందిగా నిలవాలని వ్యాఖ్యానించారు. మొగుళ్లపల్లి మండలంలోని ప్రతి గ్రామం నుండి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు

నేటిధాత్రి అయినవోలు :-

 

 

 

 

వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో శనివారం టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ టిఆర్ఎస్ ఇన్చార్జి కట్కూరి రాజు మండల నాయకుడు కొమురయ్య, దేవదాసు ఆకారపు యాదవ రెడ్డి ప్రతాపరెడ్డి చంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి రమేష్ నరేష్ రవి వీరస్వామి రవి యాదగిరి శీను అనిల్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వి హెచ్ పి డిమాండ్

మల్కాజ్ గిరి నేటిధాత్రి

 

 

పశ్చిమ బెంగాల్ లో గత వారం రోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శనివారం నాడు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి అన్ని జిల్లా కలెక్టర్లలో రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. ముర్షిదాబాద్ పరిసర ప్రాంతాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని మతం పేరుతో ఉగ్రవాద సానుభూతిపరులు మారణఖండ చేస్తుంటే అక్కడి మమత బెనర్జీ ప్రభుత్వం చూస్తూ మౌనం వహించడం గమనిస్తే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం హిందువులను బలి చేస్తున్నారని వి హెచ్ పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలు భేరి సునీతా రామ్ మోహన్ రెడ్డి అన్నారు. వెంటనే అక్కడ శాంతి భద్రతలను కాపాడాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మల్కాజ్ గిరి కార్పొరేటర్లు శ్రావణ్, మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ ,తెలంగాణ ప్రాంత గోరక్ష సభ్యులు శివానంద్ ,జిల్లా కార్యదర్శి రజినీకాంత్,సహ కార్యదర్శులు రాజి రెడ్డి,గోపాల్ చారి, గోరక్షా ప్రముఖ్ బాలాజీ, మణిమాల, మాతృశక్తి సంయోజిక పశ్యంతి,స్థానిక బీజేపీ నాయకులు వీకే మహేష్ , సోమ శ్రీనివాస్,బక్క నాగరాజు,కిరణ్ , భజరంగ్ దళ్ అఖిల్ , హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలం

బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

శాసన సబ ఎన్నికల ముందు కాంగ్రేస్ పార్టీ ప్రజలకు ఇచ్చినా హమీలు అమలు చేయడంలో మిత్రపక్షమైనా సిపిఐ ఎమ్మెల్యే తో ప్రబుత్వం పూటకో ప్రకటన చేస్తుందని ముత్తారం బి అర్ ఎస్ మండల శాఖ అద్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతుపేద్ది కిషన్ రేడ్డి శనివారం ఒక ప్రకటనలో అరోపించారు పేదింటి యువతుల వివాహనికి కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా లక్ష 116 రూపాయలతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని మహిళలకు నెలకు 2500 వారి ఖాతలలో జమ చేస్తామని ఎన్నికల ముందు హమి ఇచ్చారని ప్రస్తుతం కాంగ్రేస్ మిత్రపక్షమైనా సిపిఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు కోత్తగూడేం లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసి తులం బంగారం ప్రబుత్వం ఇప్పట్లో ఇచ్చే అలోచన లేదని ప్రకటించడం హస్య స్పందంగా ఉందని అన్నారు మహిళలకు 25 వందల ఊసే లేదన్నారు సిపిఐ పార్టీకి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినా చరిత్ర కల్గినా పార్టీ ని నేడు ప్రజలలో చీప్ గా తయారు చేసారని కిషన్ రేడ్డి ఒక ప్రకటనలో విమర్సించారు

ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.

*ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు..

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం..

స్వర్ణాంధ్ర…స్వచ్ఛ ఆంధ్ర మనందరి బాధ్యత..

స్వచ్ఛ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్..

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్ తో పర్యావరణానికి పెను ముప్పని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్ధాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని మానవాళి మనుగడకే ప్రశ్నర్థకంగా మారుతుందన్నారు.ఈ వేస్ట్ వ్యర్థలతో పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ఆస్కారముందన్నారు.

 

MLA

కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలపై ప్రజల అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంగమ్మ గుడి వీధి మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ.రమణారెడ్డి,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ బాబా,మున్సిపల్ సిబ్బంది తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి, గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,ఖాజా పీర్, చాంద్ భాషా, బీ.ఆర్.సి కుమార్,లోకేష్ ఆచారి,
సురేష్,మురళీ, చందు తదితరులు ఉన్నారు.

గొప్ప పరిపాలనాదక్షుడు చంద్రబాబు నాయుడు.

గొప్ప పరిపాలనాదక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది…

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతం…

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రన్న…

తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ…

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనాదక్షుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు.., సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ.., రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శనివారం ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ.. విలువలు కలిగిన రాజకీయ వేత్తగా. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి.., తెలుగు ప్రజల అభ్యున్నత కోసం పరితపించిన ప్రజా ప్రతినిధి,పాలనాదక్షుడు
నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారాయన.
అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు అని. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేసాయన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య కృషీవలుడన్నారు, ముఖ్యమంత్రిగా..తెలుగు దేశం పార్టీ అధినేతగా.., ప్రజాసేవకుడిగా… ఆయన అందిస్తున్న సేవలు నిరుపమానమన్నారు.
ఆధునిక యుగానికి చంద్రన్నను
రోల్ మోడల్ గా నిలిపాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తూరు ఎంపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ను సర్వతో ముఖాభివృద్ది వైపు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ వేస్ట్ ను ఇవ్వండి నగర అభివృద్ధికి సహకరించండి.

*ఈ- వేస్ట్ ను ఇవ్వండి – నగర అభివృద్ధికి సహకరించండి…

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర లో భాగంగా శనివారం ఈ-వేస్ట్ సేకరణ, నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీ ని కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణకార్పొరేటర్ నారాయణ, అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. An e-waste collection program was organized at Sridevi Complex. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత పచ్చదనం, ఫిబ్రవరి నెలలో వేర్వేరుగా చెత్త సేకరణ,మార్చిలో ప్లాస్టిక్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.ఏప్రిల్ నెలలో ఈ-వేస్ట్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు.

 

Development

ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ ను న్యూ బాలాజి కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని ఈ-వేస్ట్ ను అక్కడ ఇవ్వ వచ్చునని అన్నారు. అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వవచ్చునని తెలిపారు. ఇలా సేకరించిన వేస్ట్ ను సురక్షితంగా రీ సైకిల్ చేస్తామని అన్నారు. ప్రజలు ఈ-వేస్ట్ ను మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి కూడా అందించవచ్చునని తెలిపారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. జన్మభూమి, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.ఈ వేస్ట్ వలన కాలుష్యం పెరుగుతోందని దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొంచించారని అన్నారు. ఇందులో అందరూ భాగస్వాములై ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణకు సహకరించాలని అన్నారు. స్వచ్ఛ తిరుపతి సాధనకు అందరూ సహకరించాలని అన్నారు. యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి బాధ్యత అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా, తడి, పొడి చెత్త గా వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర శుభ్రత కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ అందించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, సర్వేయర్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు…

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను.

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను శాస్త్రీయంగా పునర్విభజించాలి.

పెనుగొండ హై స్కూల్ ను నూతన కాంప్లెక్స్ గా ఏర్పాటు చేయాలి

గతంలో ఇష్టారాజ్యంగా, అస్తవ్యస్తంగా పాఠశాలల కూర్పు

దూరాభారంతో సవ్యంగా పర్యవేక్షణ చేయని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు

చదువులో తగ్గిన గుణాత్మకత – నష్టపోయిన విద్యార్థులు

నూతన ఇనుగుర్తి మండలంలోకి భౌగోళికంగా 15 పాఠశాలల చేర్పు

అయినా ఇంకా కేసముద్రం మండల స్కూల్ కాంప్లెక్స్ లోనే కొనసాగింపు

వచ్చే నూతన విద్యా సంవత్సరానికి ముందే స్కూల్ కాంప్లెక్స్ ల పునర్విభజన పూర్తి చేయాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

స్కూల్ కాంప్లెక్స్ లోకి సమీప పాఠశాలలను చేర్చి శాస్త్రీయంగా పునర్విభజించాలని కోరుతూ శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరికి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ గతంలో స్కూల్ కాంప్లెక్స్ ల ఏర్పాటు దగ్గర ,దూరంతో సంబంధం లేకుండా అస్తవ్యస్తంగా జరిగిందని , ఏ ప్రామాణికత లేకుండా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న యుపిఎస్ మహమూద్ పట్నం పాఠశాల నిజానికి కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ దగ్గర్లో ఉంటుందని, అమీనాపురం సమీపంలో ఉండే మాన్సింగ్ తండా పాఠశాల స్టేషన్ , కల్వల కాంప్లెక్స్ లకు సమీపంలో ఉంటుందనీ , కానీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాళ్లపూసపళ్లి కాంప్లెక్స్ లో చేర్చారని , సర్వాపురం స్టేషన్ కి దగ్గరగా ఉన్నప్పటికీ తాళ్లపూసపల్లి కాంప్లెక్స్ లో చేర్చడం, అలాగే పెనుగొండ, దాని ఆవాస పాఠశాలలన్నీ స్టేషన్ కాంప్లెక్స్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ విధి లేక దానిని స్టేషన్ కాంప్లెక్స్ లో చేర్చడం వల్ల ఆయా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
దూరాభారంతో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోయారని , తద్వారా పర్యవేక్షణలోపించి విద్యార్థులకు గుణాత్మక విద్య సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు

పెనుగొండ ఉన్నత పాఠశాల ఆవాసంలో ఉండే 15 పాఠశాలలన్నింటితో పెనుగొండ నూతన కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణకు సులభంగా ఉంటుందని సూచించారు.

ఇదిలా ఉంటే నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలానికి భౌగోళికంగా 15 పాఠశాలలు చేర్చినప్పటికీ ఇనుగుర్తి మండలంలో నూతన స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయకపోవడం వలన అవి ఇంకా కేసముద్రం మండల కాంప్లెక్స్ లోనే
కొనసాగుతున్నాయని, ఆయా పాఠశాలల పర్యవేక్షణ ఇనుగుర్తి మండల ఎంఈఓ మరియు కేసముద్రం మండల విలేజ్ మరియు కల్వల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేయాల్సి ఉండగా వారి మధ్య సమన్వయం కొరవడి పర్యవేక్షణ సవ్యంగా సాగలేదని ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే ఉంటారని, వారి సర్వతోముఖాభివృద్దికి , వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు .కొంతమంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేస్తే , మరికొంతమంది పర్యవేక్షణ అనే భయంతో పని చేస్తారన్నారు.
విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ పర్యవేక్షణ సవ్యంగా సాగాలంటే, ఆ కాంప్లెక్స్ లో ఉండే పాఠశాలలు ఆ కాంప్లెక్స్ కు అతి సమీపంలో ఉండేలా శాస్త్రీయంగా స్కూల్ కాంప్లెక్స్లను పునర్విభజన చేయాలని ,అలాగే పెనుగొండ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా మార్చాలని అధికారులను ఈ సందర్భంగా సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ ,అప్పాల నాగరాజు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version