సిరిసిల్ల జిల్లా కవులు,రచయితల సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలాగొండ రవి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యo వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లా కవులకు మరియు రచయితలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది అంతేకాకుండా. మాజీ సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కవులు,రచయితలు,
కళాకారులు దేశ సర్వతో ముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని అద్వితీయమైనటువంటి దేశ ప్రగతికి కలాలను గళాలుగా వినిపించాలని తెలిపారు. అలాగే సీ.సా.స అధ్యక్షులు జనపాల శంకరయ్య సిరిసిల్ల జిల్లాలోని యువ రచయితలు ముందుకు రావాలని సమాజ శ్రేయస్సుకు తమ కలాలను ఎక్కు పెట్టాలని కోరారు. జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాటను పాడారు. అలాగే ఈ కార్యక్రమంలో సీ.సా.స గౌరవ అధ్యక్షులు కోడం నారాయణ, మరియు చిటికెన కిరణ్ కుమార్,జిల్లా రచయితల సంఘం యువజన కార్యదర్శి అంకారపు రవి, దూడం గణేష్, గుండెల్లి వంశీ, కోడం సురేష్, తదితర కవులు,రచయితలు పాల్గొన్నారు.