
100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
‘100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’ బాలానగర్ /నేటి ధాత్రి. బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్రత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు….