సదాశివపేట సబజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ శాఖ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో సీఐలు రమేష్, వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు కార్యాలయానికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలు ప్రారంభంలో కార్యాలయంలో నలుగురు డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ సహా అధికారులు ఉన్నారు. వారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ, కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఐదు గంటలుగా తనిఖీలు కొనసాగుతుండగా, ఏ విధమైన అవినీతి లావాదేవీలు జరిగాయా అన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.