టాలీవుడ్‌లో మ‌రో విషాదం ర‌వితేజ తండ్రి క‌న్నుమూత‌..

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ర‌వితేజ తండ్రి క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగ‌ళ వారం రాత్రి కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) తండ్రి రాజగోపాల్ రాజు (90) (Bhupathiraju Rajagopal Raju) మంగ‌ళ వారం రాత్రి కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా వ‌యో భారం, అనారోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాదులోని రవితేజ నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఈ రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు వారి కుటుంబ స‌భ్యుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ సంతాపం తెలుపుతున్నారు.

రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఈ నేప‌థ్యంలో ఆయన పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు.

ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు రవితేజ, రఘు, భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని జగ్గంపేట.

మెగాస్టార్ చిరంజీవి స‌హా చాలా మంది ప్ర‌ముఖులు ర‌వితేజ తండ్రి మృతికి సంతాపం తెలియ జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా.. సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ సైతం పెట్టారు.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన

మాజీ జడ్పిటిసి మోటపోతుల శివ శంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్‌ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు.మృతదేహం ఈరోజు ఉదయం స్వంత గ్రామం వేలిశాలకు రాగా విషయం తెలుసుకున్న గణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పిటిసి మోట మోటపోతుల శివ శంకర్ గౌడ్ వేలిశాల గ్రామానికి వెళ్లి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ సోదరుడు అయినటువంటి మాజీ మావోయిస్టు నేత, ప్రస్తుత పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఐతు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. వారి వెంట గణపురం మండల కేంద్రానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

సీనియర్‌ నిర్మాత మహేంద్ర కన్నుమూత.

సీనియర్‌ నిర్మాత మహేంద్ర కన్నుమూత

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్‌ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్‌ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం…

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్‌ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్‌ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర తన స్వస్థలమైన గుంటూరులోని రమేశ్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నటుడు, నిర్మాత మాదాల రవి ఆయనకు అల్లుడు. కుమారుడు జీతూ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించిన మహేంద్ర తర్వాత నిర్మాణరంగంలోకి ప్రవేశించి గీతా ఆర్ట్‌ పిక్చర్స్‌, ఎ.ఎ. ఆర్ట్స్‌ బేనర్లపై 36 చిత్రాలు నిర్మించారు. 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ నిర్మాతగా మహేంద్ర తొలి సినిమా. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘అర్జున’ ఆయన చివరి చిత్రం.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి సందీప్ రావు మృతి చెందారు తెలిపినారు.

తెలిసిన సమాచారం ప్రకారం కట్కూర్ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్లోనియశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మృతి చెందారనివారి కుటుంబ సభ్యులు తెలియచేశారు.

వారి మరణం పార్టీకి ఎంతో లోటని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు తెలిపారు

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

#నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన సీతారామస్వామి దేవాలయం ధర్మకర్త గ్రామ అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండా లక్ష్మణ్ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది ఆలయ ధర్మకర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని లక్ష్మణ్ స్వామి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఆలయాలు లేని సందర్భంలో తన సొంత స్థలం ఇచ్చి గ్రామస్తుల సహకారంతో రామాలయాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి లక్ష్మణ స్వామి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అలాగే గ్రామానికి తీరని లోటు అని అన్నారు పరామర్శలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్., మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, వేల్పుల రవి, గుమ్మడి వేణు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్ తో పాటు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నివాళులర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version