ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
పి.ఎం సడక్ యోజన కింద పూర్తయిన ఐలోని కొండపర్తి రోడ్డు

నేటి ధాత్రి అయినవోలు

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన అయినవోలు నుంచి కొండపర్తి మీదుగా వెళ్లే డబుల్ బీటీ రోడ్డు పూర్తయిన సందర్భంగా బిజెపి అయినవోలు మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారానే కొండపర్తి వయా ములకలగూడెం & ఒంటిమామిడిపల్లి గ్రామాల రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పూర్తయినది. అందుకు కృతజ్ఞతగా కొండపర్తి గ్రామ పంచాయితీ దగ్గర మోదీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ రోడ్డు పొడవు 5.682 కి.మీ. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా పూర్తిగా మంజూరై నిర్మించడం జరిగింది కావున గ్రామాల అభివృద్ధి మోదీ వలనే జరుగుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలలో భాజాపా అభ్యర్థుల గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం ప్రతి గ్రామంలో హరితహారం ఉందా పల్లె ప్రకృతి వనం, వీధిలైట్లు, స్మశాన వాటికలు, రేషన్ బియ్యం, పీఎం కిసాన్ నిధి, ముద్ర లోన్స్ ద్వారా వ్యక్తిగత వ్యాపారాలకు అభివృద్ధి, ప్రతి ఇంటికి ఉచిత మరుగుదొడ్లు, రైతు వేదిక, గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం తోటే అని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవితేజ గౌడ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కోట కిరణ్, మడ్డి రాజేష్,సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, కట్ట విజయ్, పోషలా రమేష్, కట్ట సాంబరాజు,చుక్కారావు, మహేష్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, భూపతి, రాకేష్, హరీష్, వినయ్ ,రాజేందర్, శంకర్, జక్కోజు సాయిరాం తదితరులు పాల్గొన్నారు

నరేంద్రమోదీ 11 ఏళ్లలో జనరంజకమైన పాలన.

నరేంద్రమోదీ 11 ఏళ్లలో జనరంజకమైన పాలన.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యాశాల కార్యక్రమం శనివారం కల్వకుర్తి మండల పరిధిలో బిజెపి పార్టీ ఆఫీసులో కల్వకుర్తి బిజెపి మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ పార్టీ పతాక ఆవిష్కరణ చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండికారి బాలాజీ రాష్ట్ర నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ..ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని కేవలం 11 ఏండ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి విశేష కృషి వలన జిడిపిలో నాలుగో స్థానానికి ఎగ బాకడమే కాకుండా దేశంలోని 27 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి దూరం చేసి మధ్యతరగతి ప్రజలుగా మార్చిన గొప్ప నాయకుడు మన నరేంద్ర మోడీ గారని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా రోగానికి వ్యాక్సిన్ అందించి ప్రపంచాన్ని కాపాడిన గొప్ప నాయకుడని అన్నారు. పెహల్గాం తీవ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కర మూకలకు , తీవ్రవాద అనుకూల పాకిస్తాన్ కు సరైన బుద్ధిచెప్పి ప్రపంచానికి భారతదేశ యుద్ధ శక్తిని తెలియజేశారని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. కుల మతాలకతీతంగా తీసుకు వచ్చిన ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విమాన ప్రమాదంలో మరణించిన వారికోసం మౌనం పాటించి నివాళులు అర్పించారు.
కార్యాశాల కార్యక్రమం అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు బండల రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి నారేడ్ల శేఖర్ రెడ్డి మాజీ మండలం అధ్యక్షులు సురేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్యాంసుందర్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు నోముల రవీందర్ రెడ్డి , పుట్ట మల్లేష, మండల కార్యదర్శులు పి లింగారెడ్డి, సైదులు గౌడ బిజెపి కార్యవర్గ సభ్యులు మందరాజు రెడ్డి, కరుణ రెడ్డి సురేష్ గౌడ్, కిరణ్ రెడ్డి, సంతోష్ నాయక్ బీజేవైఎం నాయకులు నాప శివసేన, బూతు అధ్యక్షులు ఆనంద్,ఆంజనేయులు, విజయ్, సాయిబాబా, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ
అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన

కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం.

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నందునా బుదవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో, జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని అధికారం పోయాక విమర్శలు తప్ప చేసేది ఏం లేదు కానీ మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, sc, st లు మరియుప్రతి కులస్తులు అందరూ స్వాగతిస్తున్నారు ఈ కులగణణ ‘సమ్మిళిత వృద్ధి’ వేగం గా పుంజుకుంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో జన, కులగణనను ప్రారంభించి, రెండేళ్లలో ముగించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్ జిల్లా కార్యదర్శి గజ బింకర్ చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు చొప్పదండి అంజన్న, ఊరగొండ రాజు, మోర శ్రీహరి, పంపరి అర్జున్, చొప్పదండి శ్రీనివాస్, కోడం శ్రీనివాస్, ఇంజాపూరి మురళి, దుమాల శ్రీకాంత్, మహేశుని అనిల్, దూడం సురేష్, టవటం రాజలింగం, నాగుల శ్రీనివాస్, చొక్కి శీను, పచ్చునూరి సురేష్, వేముల సురేష్, గాలి శీను, కర్నే రేవంత్, కోడం రవి, తాటిపాముల విష్ణు, జింగం శ్రీనివాస్, వేముల పోశెట్టి, నల్లగొండ సాయిచంద్, భాగయ్య, ఆడెపు వేణుమాధవ్, చిలుక శ్రీకాంత్ కర్నె గణేష్, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో.

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

ప్రతి రేషన్ షాపు ముందు నరేంద్రమోడీ ఫోటో పెట్టాలి — బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీ దేవ్

కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బిజెపి నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఉగాదికి ప్రారంభించిన 6కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని యెడల బిజెపి నాయకులు ఉరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ హెచ్చరించారు…
ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వివేకానంద, మాజీ అధ్యక్షులు నరసింహ, గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ నరేష్ చారి, నాయకులు శ్రీకాంత్, పర్వతాలు, శివ, అరవింద్ రెడ్డి, కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

 

#రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే.

 

#ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు.

 

#జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి.

 

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని

జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన విధానాన్ని గమనించి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విసిగిపోయిన ప్రజలు

రాష్ట్రానికి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ అని భావించి నర్సంపేట నియోజకవర్గం లో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిజెపి జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసే విధంగా కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ మెంబర్ గుంపుల రాజు, బిఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగరబోయిన సాగర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షు డు జక్కుల నరసింహ రాములు, మండల

కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎద్దునరేష్, తదితరులు వాటిలో చేరారు

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, నాయకులు ఊటుకూరి చిరంజీవి, బత్తిని కుమారస్వామి, కక్కెర్ల సమ్మయ్య, మురికి మనోహర్, దొమ్మటి శీను తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version