ఆ నరకడం ఏంటీ టీచర్.. నందితా శ్వేత బెన్నీ ట్రైలర్
నందితా శ్వేత లీడ్ రోల్‌లో.. కన్నడ నాట ఓ ఆసక్తికరమైన చిత్రం రూపొందుతోంది.
కన్నడ నాట ఓ ఆసక్తికరమైన చిత్రం బెన్నీ (BENNY) రూపొందుతోంది. తెలుగులో హిడింబా, మంగళవారం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నందితా శ్వేత (NANDITA SWETHA) లీడ్ రోల్‌లో నటిస్తోండగా ఔట్ అండ్ ఔట్ వయలెంట్ థ్రిల్లర్ జానర్‌లో సినిమా తెరకెక్కుతోంది. శ్రీలేష్ నాయర్ (Shreelesh S Nair ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప వాయిస్ ఒవర్‌లో ప్రారంభమైన ఈ గ్లిమ్స్ ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేసేలా ఉంది. ఈ వీడియోలో.. ఓ టీచర్ క్లాస్ రూంలో పిల్లలకు గాంధీజీ , అహింస గురించి చెబుతున్నట్లు చూయించగా మరోవైపు ఓ ఇంట్లో హీరోయిన్ రౌడీలను ఒక్కొక్కరిని కత్తితో కసి తీరా నరకడాన్ని చూయించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. మీరూ ఓసారి వీక్షించండి. అయితే ఈ సినిమాను కన్నడతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ఫ్లాన్ చేస్తోంది.
