సన్న బియ్యమైతే మాకేంటి..?
◆:-గ్రామాల్లో జోరుగా అక్రమ దందా
◆:-ద్విచక్ర వాహనాలపై తరలింపు
◆:-మరమరాల పేరిట కొనుగోళ్లు
◆:-కోళ్లపారాల దాణాగా సరఫరా
◆:-రాష్ట్రాలు దాటుతున్న పేదల రైస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర
రేఖకు దిగువ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభు త్వం మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. రేషన్ షాపు నుంచి ప్రజల వద్దకు వెళ్లిన బియ్యం కాస్త అక్రమార్కుల ఒడిలోకి వెళ్లి కాసుల కురిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వెళితే సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన నారాయణఖేడ్, కంగ్జి, మనూర్, నాగలిగిద్ద, కల్హేర్ మండలాలకు చెందిన కొందరు అక్రమార్కులు మోటార్ వాహనా లు, టీవీఎస్, మోటార్ సైకిల్, హీరో హోండా వాహనాలపై ఉదయం 6గంటలకే న్యాల్ కాల్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, మండలాల్లోని వివిధ గ్రామాలకు తరలివచ్చి ప్రజల వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు లేదా తెల్ల మురమురాలు తయారు పేరిట దొడ్డు బియ్యం కొనుగోలు చేసిన మాదిరిగానే సన్నబియ్యాని సైతం సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం కోసం రూ.23, రాష్ట్రం ఒక కిలో సబ్సిడీ సన్న బియ్యం పంపిణీ కోసం సుమారుగా రూ.40 నుంచి రూ.50 వరకు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చులు ఉంటాయి.
రాష్ట్రం దాటిస్తున్న అక్రమార్కులు..
బియ్యాన్ని కోళ్ల ఫారాలకు, రాత్రివేళ కర్ణాటక, మహా రాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల క్వింటాల బియ్యం తరలిపోతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు విమర్శ లు ఉన్నాయి. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ తరలిం పు వ్యవహారం చూసీచూడ నట్లు వదిలేస్తున్నారు. వీరి దందా ఉదయం 6గంట లకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకూ కొనసాగుతోంది. అయితే ఇవి కోళ్లపారాలకు కూడా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా అక్రమా ర్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తి చేశారు.