ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
పి.ఎం సడక్ యోజన కింద పూర్తయిన ఐలోని కొండపర్తి రోడ్డు

నేటి ధాత్రి అయినవోలు

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన అయినవోలు నుంచి కొండపర్తి మీదుగా వెళ్లే డబుల్ బీటీ రోడ్డు పూర్తయిన సందర్భంగా బిజెపి అయినవోలు మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారానే కొండపర్తి వయా ములకలగూడెం & ఒంటిమామిడిపల్లి గ్రామాల రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పూర్తయినది. అందుకు కృతజ్ఞతగా కొండపర్తి గ్రామ పంచాయితీ దగ్గర మోదీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ రోడ్డు పొడవు 5.682 కి.మీ. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా పూర్తిగా మంజూరై నిర్మించడం జరిగింది కావున గ్రామాల అభివృద్ధి మోదీ వలనే జరుగుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలలో భాజాపా అభ్యర్థుల గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం ప్రతి గ్రామంలో హరితహారం ఉందా పల్లె ప్రకృతి వనం, వీధిలైట్లు, స్మశాన వాటికలు, రేషన్ బియ్యం, పీఎం కిసాన్ నిధి, ముద్ర లోన్స్ ద్వారా వ్యక్తిగత వ్యాపారాలకు అభివృద్ధి, ప్రతి ఇంటికి ఉచిత మరుగుదొడ్లు, రైతు వేదిక, గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం తోటే అని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవితేజ గౌడ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కోట కిరణ్, మడ్డి రాజేష్,సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, కట్ట విజయ్, పోషలా రమేష్, కట్ట సాంబరాజు,చుక్కారావు, మహేష్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, భూపతి, రాకేష్, హరీష్, వినయ్ ,రాజేందర్, శంకర్, జక్కోజు సాయిరాం తదితరులు పాల్గొన్నారు

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

వనపర్తి నెటిదాత్రి :

 

 

 

 

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించామని టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీనేతలు లక్కకుల సతీష్ బి కృష్ణ చందర్ నక్కరాములు చుక్కరాజు జి జె శ్రీనివాసులు పార్టీ నేతలు పాల్గొన్నారు

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ
అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన

కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version