నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో’ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మంగళవారం ఈ సినిమా ప్రీవ్యూ షోను వేశారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma maheswara ugra roopasya) చిత్రాల నిర్మాత పరుచూరి ప్రవీణ (Paruchuri Praveena) తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్తపల్లిలో…’ (Kothapalli lo). ఒకప్పుడు అనేది దాని ట్యాగ్ లైన్. 1980, 90లలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలను సినిమాగా దర్శకురాలు ప్రవీణ తెరకెక్కించింది.

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదలకు మూడు రోజుల ముందే మీడియాకు ప్రివ్యూ షో వేసి చూపించారు. గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాలను, వాటి పర్యవసానాలను తెలియచేస్తూ ఈ సినిమా సాగింది. రామకృష్ణ అనే యువకుడి జీవితం రాత్రికి రాత్రి ఎలా తల్లకిందులైందనేది ఇందులోని ప్రధాన కథాంశం. దీన్ని మూఢ విశ్వాసాలకు, అగ్రవర్ణాల అహంకారానికి, జలగల్లా పీడించే వడ్డీ వ్యాపారుల క్రూరత్వానికి లింక్ చేస్తూ ప్రవీణ పరుచూరి సినిమాగా తీశారు.

ఇటీవల ఓ ఇంటర్వూలో ఆర్టిస్టుల పట్ల తాను సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించానని, సన్నివేశం బాగా రావడం కోసం కొన్ని సందర్భాలలో వారిపై చెయ్యి చేసుకున్నానని, కోపంతో రాళ్లూ విసిరానని చెప్పుకోవచ్చారు. నిజానికి ఇవన్నీ సినిమా కథలో భాగంగానే ప్రవీణ పరుచూరి చేశారని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అర్థమౌతోంది.

ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో నాగమణి అనే డీ గ్లామరైజ్డ్ పాత్రను ప్రవీణ పోషించారు. ఓ మారుమూల పల్లెటూరిలో అట్లు వేసుకుని జీవితాన్ని గడిపే నిరుపేదరాలు పాత్రను ఆమె చేసింది. హీరో ప్రేమ విషయంలో జరిగే తగవులో అతని తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ పాత్ర… అవతలి పాత్రలతో ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగుతుంది. జుత్తు జుత్తు పట్టుకుని ఇద్దరు మహిళలు వీరంగం సృష్టిస్తారు. దర్శక, నిర్మాత కూడా అయిన ప్రవీణ ఆ సమయంలో కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి… అవతలి వాళ్ళను తన్ని తగలేసి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించింది. చిత్రం ఏమంటే… ‘కేరాఫ్ కంచరపాలెం’లో వేశ్యగా నటించడానికి వెనుకాడని ప్రవీణ… ఇందులోనూ తన పాత్రను కించపరిచే సంభాషణలను సైతం రాయించుకుంది. అక్కడ పాత్ర తప్పితే… మనకు నిర్మాతో, దర్శకురాలో కనిపించరు.

అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పరుచూరి ప్రవీణకు సినిమా అంటే ఎంత పిచ్చో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంతో కష్టపడి, ఇష్టపడి పరుచూరి ప్రవీణ తెరకెక్కించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

తప్పు చేసినా.. ఎప్పుడూ నా వెంటే ఉన్నారు..

తప్పు చేసినా.. ఎప్పుడూ నా వెంటే ఉన్నారు

సమంత తానా (TANA) సభలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అక్కడికి చేరుకున్నాక అభిమానులు చూపించిన ప్రేమ పట్ల భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా.. ‘తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా? లేదా?’ అనే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. మీరంతా నాకంటూ కొక ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సమంత(Samantha). ఆమె ‘తానా’ (TANA) సభలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అక్కడికి చేరుకున్నాక అభిమానులు చూపించిన ప్రేమ పట్ల భావోద్వేగానికి లోనయ్యారు.  ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 ఏళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి ఏడాది తానా, ఇక్కడ ఉన్న తెలుగువారి గురించి వింటూనే ఉంటాను. నా తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ నుంచి నన్ను మీ మనిషిలా , మీలో ఒకరిగా చూస్తున్నారు. నాపై ఎంతో ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టింది’’ అంటూ తల వంచి నమస్కారం చేశారు.

సినీ కెరీర్‌ గురించి చెబుతూ ‘‘నటనా జీవితం ఎంతో బావుంది. నటిగా మంచి స్థానంలో ఉన్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా కెరీర్‌ ప్రారంభించా. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టా. ‘శుభం’తో తొలి అడుగు వేశా. నార్త్‌ అమెరికాకు చెందిన తెలుగువారు మా చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు, ప్రశంసల వర్షం కురిపించారు. మంచి సక్సెస్‌ అందించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా.. మీరు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. అందుకు గర్వపడుతున్నా. మీరంతా నాకొక ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారు. ‘ఓబేబీ’ సినిమా మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లోకి చేరడం మీవల్లే సాధ్యమైంది. ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు.. కానీ మీరెప్పటికీ నా మనసులోనే ఉంటారు’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది.

కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version