ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.

ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.

కల్వకుర్తి /నేటి ధాత్రి

 

ప్రమాదవశత్తు ట్రాక్టర్ మీద నుండి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన సాయిబాబ (20) ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా.. ప్రమాదవశత్తు కిందపడి మృతి చెందాడు. సాయిబాబకు ఏడాది క్రితం వెల్దండ మండలం, రాచూరు గ్రామానికి చెందిన ఓ యువతీతో పెళ్లయింది. చిన్న వయస్సులోనే మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదం సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి

జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబీ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి:

ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుక అందించేందుకు వనపర్తి జిల్లాలో ఇసుక రీచులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ చాంబర్ లో జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు వనపర్తి జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ ఇసుక రీచ్ లు గుర్తించారు వాటి భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది అధికారులతో చర్చించారు
తుంపల్లి గ్రామం వీరరాఘవపూర్ ఇసుక రీచ్ లో 3990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని ఇరిగేషన్ భూగర్భ జలాలుమైన్స్ అండ్ జియాలజి ద్వారా పరిశీలన చేసిన రిపోర్టును కలెక్టర్ ముందు ఉంచారు వీర రాఘవపూర్ రీచ్ నుండి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక తీసుకునేందుకు కమిటీ తీర్మానం చేసింది .మదనపూర్ మండలములోని కొత్తపల్లి దుప్పల్లి రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధనలకు అనుగుణంగా ఇసుక లభ్యత లేదని మైన్స్ అధికారి తెలుపగా ఆన్లైన్ మ్యాప్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ కమిటీ సభ్యులు మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దమందడి మండలం చిలకటోనీ పల్లి కర్వేన గ్రామాల్లోనీ రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధన ప్రకారం ఉండాల్సిన ఇసుక లభ్యత లేదని అందువల్ల రీచ్ గా పరిగణించి ఇసుక తీసుకోలేమని కమిటీ నిర్ధారించింది అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఎ డిమైన్స్ గోవిందరాజులు భూగర్భ జలాల ఎ డి దివ్యజ్యోతి డి ఎల్పీఒ రఘునాథ్ ఇరిగేషన్ శాఖ అధికారి పాల్గొన్నారు

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం అందుకున్న పరమేశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .జీవిత భీమా సంస్ధ నుండి అరుదైన గౌరవ పురస్కారం అందుకున్నారు ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ .జీవిత భీమా ద్వారా ప్రతి కుటుంబానికి పొదుపు చేయడం నేర్పడం.మరియు ప్రమాద బీమా ని అందించడం .ఆరోగ్యబీమాను అందించడం తనకు ఎంతగనో సంతృప్తి ఇస్తుంది అని అన్నారు .అనుకోకుండా జరిగే ప్రమాద ల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జీవిత భీమా ను తీసుకొని కుటుంబ భద్రతను కాపాడుకోవాలి అని అన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని తహసిల్దార్ గా నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుజ్జుల రవీందర్ రెడ్డి ని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వివిధ విభాగాల అధికారులతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం తహసిల్దార్ కు,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధ్యక్షులు వాంకే రాజు,ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్,యూత్ నాయకులు నారగాని రాకేష్ గౌడ్,లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ రిపోర్టర్ సోదరుని రిసెప్షన్ కి జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ భారత్ ఫంక్షన్ హాల్లో సజ్జాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మగ్దూం కుమారుని వలిమా డిన్నర్ వైభవంగా జరుగగా పలువురు రాజకీయ నాయకులు హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం,టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,బిజీ సందీప్,షికారి గోపాల్,కోహిర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు,కాంగ్రెస్ నాయకులు కోహిర్ మండల్ ఎంపీపీ షాకీర్ ,ప్రసాద్ రెడ్డి,గొల్ల భాస్కర్,, మొహమ్ వాజీర్ అల్లి ,మాజీ బాల్ నగర్ కార్పొరేటర్ నసీర్ మన తెలంగాణరిపోర్టర్ షకీల్ అహ్మద్, జేజే జావిద్ మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పిటిసిలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి నూతనంగా వచ్చిన డీఎస్పీ సైద్ నాయక్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జహీరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) అధ్యక్షుడు చెల్మెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఆఫీసర్ జహీరాబాద్ ప్రాంతానికి రావడం శుభ పరిణామం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టీ వై జె ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. నగేష్ , జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమార్, టీ వై జె ఎఫ్ ట్రెజరీ మహేష్ కుమార్, కోఆర్డినేటర్ కె అశోక్ కుమార్, కోఆర్డినేటర్ రాములు, ఝరాసంగం టీవైజెఎఫ్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

గుండాల పోలీసు స్టేషన్ సిఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యములో వ్యవసాయ అధికారితో కలసి గుండాల లో ఉన్న సీడ్స్,ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నకిలీ, కల్తీ విత్తనాలు,ఎరువులు సరఫరా చేసి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు అనుమతి లేని విత్తన విక్రయాదారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా కొనుగులుకు సంభందించి రశీదు అడిగి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు తెలపలన్నారు.

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు.

కుమార్తె పుట్టినరోజున జి.పి సిబ్బందికి రేమాండ్స్ దుస్తుల అందజేత

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు

నర్సంపేట నేటిధాత్రి:

ఎన్నో సంవత్సరాల నుండి నిత్యం గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేస్తున్న నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ సిబ్బందిలో ఒకరైన కడగండ్ల నర్సయ్య (చిన్ని)కి ఆర్టీసీ ఉద్యోగి, గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గొలనకొండ వేణు, చైతన్య ప్రథమ కుమార్తె గొలనకొండ సహస్ర పుట్టినరోజును పురస్కరించుకొని మే 29న గురువారం నర్సయ్య(చిన్ని)కి విలువైన రేమాండ్స్ దుస్తులను సహస్ర చేతుల మీదుగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో అందించి ఆదర్శంగా నిలిచారు.గత నాలుగు నెలల క్రితం జనవరి 30న వేణు, చైతన్య దంపతుల కుమారుడు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా గురిజాల గ్రామ పంచాయితీ సిబ్బందికీ జీవితాంతం పట్టు చీరలు, రేమాండ్స్ దుస్తులను తమ ముగ్గురు పిల్లల పుట్టిన రోజున అందించడానికి గ్రామంలో తొలి సారిగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్టోబర్ 10న తమ కనిష్ట కుమార్తె ఆరాధ్య పుట్టినరోజున కూడా మరో మహిళా పంచాయితీ సిబ్బందికి పట్టుచీర అందజేస్తామని వేణు చైతన్య, దంపతులు తెలిపారు. తమ సేవలను గుర్తించినందుకు గాను గ్రామ పంచాయితీ సిబ్బంది వేణును శాలువాతో సత్కరించారు.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ కు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ.

“నేటిధాత్రి”,వేములవాడ.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావాలని కోరారు.

Journalists’

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం.

‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటీ మంజూరు కావడం హర్షనీయమన్నారు. వలస జిల్లా పేరునుండి.. విద్యాభివృద్ధి చెందిన జిల్లాగా పేరు రానున్నదని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా

సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్ధన్నపేట( నేటిదాత్రి ):

పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు,
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య,
కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి,
వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న.!

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న అంబటి వీరభద్రo గౌడ్

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్

మరిపెడ కురవి నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు, ఆలయ ఆవరణలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజకవర్గంలో ఏనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని,రైతులు అందరూ పాడి పంటలు సమృద్ధిగా పండి అభివృద్ధి పథంలో నడవాలని ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి రావాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు “ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటిస్తూ ఆలయాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందాలి,” అని అన్నారు. ప్రజల సంక్షేమం మరియు మండల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం

ఓదెల(పెద్దపల్లి జిల్లా):

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో 28వ రైల్వే గేట్ దగ్గర పోచమ్మ తల్లి దేవాలయంలో పోతలింగేశ్వర స్వామి విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి ఆ సంఘటన హిందువులకు చాలా బాధాకరమైన సంఘటన కావున హిందూ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోక నిర్వహించిడం జరిగింది. విషయం తెలుసుకున్న పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతూ విగ్రహాన్ని పరిశీలించి త్వరలోనే ఈ సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలియజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉత్తం గార్డెన్స్ లో జరిగిన విట్టునాయక్ తాండా కి చెందిన కేశు సింగ్ గారి కుమారుడి .వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మండల పార్టీ జనరల్ సెక్రటరీ గోపాల్, మాజి ఎంపీటీసీ చందు ,చందర్ పవార్,నరేష్, సంజు తదితరులు .

వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి.

వర్గ పోరాటాలను
ఉధృతం చేయాలి

శిక్షణ తరగతులు
ముగింపు సమావేశంలో

సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు వీరయ్య

మరిపెడ నేటిధాత్రి:

కమ్యూనిస్టు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని వారి కోసమే జీవించాలని ,పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీస్తూ వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న గురువారం 5 వ రోజు జిల్లా స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వారికి మేము ఉన్నామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.

-ఇచ్చిన హామీలు
అమలు చేయాలి

జిల్లా కార్యదర్శి
సాదుల శ్రీనివాస్

గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశ చూపెడుతూ లబ్ధిదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు రాకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములు పేదల గుడిసెలు వేసి సిపిఐ (ఎం) పార్టీ ఇండ్లు నిర్మిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సూర్నపు సోమయ్య గునుగంటి రాజన్న, ఆకుల రాజు, కుంట ఉపేందర్, కందనూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి మధుసూదన్, రాజన్న, , లచ్చయ్య, రాజశేఖర్, ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు.

అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్.

అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం

◆ లంచం ఇస్తేనే కబ్జ ఇస్తాం వృద్ధ రైతులకు రెవిన్యూ సిబ్బంది బెదిరింపులు…తహసీల్దార్, ఆర్ఐ నిర్వాకం….!

◆- మా సొంత భూమికే,లక్షలు డిమాండ్ చేస్తున్న తహసీల్దార్, ఆర్ఐ

◆- అన్ని రికార్డులున్న మాకు అన్యాయం చేస్తున్న అధికారులు

◆- బోరున విలపిస్తున్న వృద్ధ మహిళ రైతులు

కోర్టు ఉత్తర్వులు ఉన్నపటికీ,జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికి ని పట్టించుకోని అధికారులు

-ఎంతటి అధికారులైన భయపడేది లేదు అంటు బెదిరింపులు

◆- ఏమి తోచక మంచాన పడ్డ వృద్ధ మహిళ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్/ఝరాసంగం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగించి ప్రజలకు సమస్యలు లేని పాలన అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తే అవేమి పట్టకుండా రెవిన్యూ సిబ్బంది వారి ఇష్టనుసారంగా వ్యవహారిస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించి భూభారతి వెబ్సైట్ ప్రవేశపెట్టిన రెవిన్యూ సిబ్బంది ఆగాడాలు కొనసాగుతూనే ఉన్నాయని పేద రైతు కుటుంబాలు తమ బాధను వెళ్ళగక్కుతూనే ఉన్నారు. పూర్తి వివరల్లోకి వెలితే జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామనికి చెందిన కోస్గి మాణమ్మ భర్త రాములు కోస్గి సరోజ భర్త రాములు, గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 100/12లో రాములుకు 1978 లో 4 ఎకరాలు భూమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.అనంతరం మాన్యమ్మ,సరోజ, భర్త చనిపోగా వారి ఇద్దరికీ 100/12 2 ఎకరాలు 100/12/1 2 ఎకరాలు పంపకం చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మేము ఆ భూమిని సాగుచేస్తూ ఉన్నాము కాని మాకు డిజిటల్ భూమి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాని ఆ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మండల తహసీల్దార్, ఆర్ఐ ఇద్దరు లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నారు. కాని మాకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదని అధికారులకు చెప్పడంతో వారు మా పైన అగ్రహించి డబ్బులు ఇవ్వకుంటే మీకు పొజిషన్ లేదని రికార్డులు చేసి మీకు భూమి లేకుండ చేస్తామని మాకు బెదిరిస్తున్నారని వృద్ధ మహిళ లబ్ధిదారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో స్థానిక తహసీల్దార్, ఆర్ఐ మాకు అన్యాయం చేస్తున్నారని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 1978సంవత్సరం నుండి అన్ని రికార్డులు ఉన్న మాకు కబ్జా కాస్తు ఉన్న లంచం గురించి తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, ఆర్ఐ లంచం డిమాండ్ చేయడంతో జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించి తమ గోడు చెప్పుకుంటామని ఇటీవలే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామని నిరుపేదలైన మాకు జిల్లా కలెక్టర్ చోరువ చూపి మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

అవినీతికి అడ్డాగా మారిన ఝరాసంగం మండల తహసీల్దార్ కార్యాలయం

అవినీతికి అడ్డాగా మారిందని సమస్యలతో వచ్చి అ సమస్యల్ని పరిష్కారం చేయాలని స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వస్తే అధికారులు మాత్రం రైతులను నాన ఇబ్బందులకు గురిచేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తమ జేబులు తాసిల్దార్ గా ఉన్న తిరుమల రావు అన్ని తానై డబ్బులు ఇస్తే అవినీతి పనైనా చేసి పెడతారని బాధితులు అంటున్నారు. మండలంలో భూ తగాదాలతో వ్యవసాయ భూములను పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్యను పరిష్కరించాలంటే అధికారులకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పి బాధితుల దగ్గర లక్షల్లో వసూలు చేస్తున్నారు పసుపు తాసిల్దార్ కు తోడుగా ఆర్ఐ రామారావు మండల పరిధిలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ పనులను డబ్బులు వసూలు చేసి జిల్లా నుంచి పర్యవేక్షణకు అధికారులు వచ్చినప్పుడు అక్రమంగా మైనింగ్ చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చి తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ ఏం జరగనట్టుగా చేపిస్తున్నాడు డబ్బులు తీసుకుని ఒక కుటుంబానికి ప్రభుత్వము పంపిణీ చేస్తున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఒక కుటుంబానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని నిబంధనను ఉల్లంగించి వ్యవసాయ పోలానికి సర్వే చేసే క్రమంలో చల్లన్ కట్టకుండాప్పటికిని అనుమతి పోయినప్పటికీని సర్వే చేయించి అమాయకులైనటువంటి వ్యవసాయ రైతులతో పంచానామాలో సంతకాలు చేసుకొని అడ్డగోలుగా భూమికి అద్దులు చూయించి లక్షల్లో అవినీతి డబ్బు తీసుకొని రైతులకు మాత్రం ఝరాసంగం తాసిల్దార్ మాత్రం ముందు ముందు వరుసలో ఉంటారు. కుప్పానగర్ గ్రామంలో 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కేటాయించడం జరిగింది.

ఇదే కాకుండా ఇంకా చాలా అవినీతి పనులు బాధితులు అంటున్నారు. తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరచి ఇలా అవినీతి పనులు చేయడానికి తహసీల్దార్ అండగా ఉండటం గమర్హం. వ్యవసాయ భూమి ఒకరి పేరు ఉండంగా డబ్బులు తీసుకుని వేరే వారి పేరు మీద సర్వసాధారణమని బాధితులు అంటున్నారు లేనిపోని భూతాలల్లో కలుగజేసుకొని సమస్యలను సృష్టించి బాధితులు పరిష్కారం చేయాలని కోరగా అ ఫైల్ ను పై అధికారులకు సమస్యను పరిష్కరించినట్లుగా కనిపించడానికి ఫైల్ డిస్పోజని ఆన్లైన్లో పరుస్తున్నారు పై అధికారులు చూస్తే బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యాయని పై అధికారులు అనుకోవడానికి ఇలా చేస్తున్నారు ఆర్డీవో చెప్పిన వినిపించుకొని ఝరాసంగం రెవెన్యూ అధికారులు పై అధికారులను సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారి ఆర్ఐ ఉప తాసిల్దార్ అవినీతిగా అడ్డంగా మారిన రెవెన్యూ వ్యవస్థ కంప్యూటర్ ఆపరేటర్ రికార్డ్ అసిస్టెంట్ తన ఇష్ట ప్రకారం గా ఎవరికి నచ్చిన వారితో డబ్బులు వసూలు చేసి పట్టాలు మారుస్తున్నారు కళ్యాణ లక్ష్మి రెండో పెళ్లి అయినవారికి పంచనామా చెయ్యక డబ్బులు వసూలు చేసి వర్తించేటట్టు చేస్తున్నారు మరికొందరు డిప్యూటీ తాసిల్దార్ ముందు అక్కడే కూర్చుని కొన్ని ఆధారాలు తమ దగ్గర పెట్టుకుని భయం పెడుతూ కానీ పనులు చేయించుకుంటున్నారు దళారుల అడ్డగా మారిన ఝరాసంగం మండల రెవెన్యూ సంస్థ.
ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు

తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు లేదంటే ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని భూ రికార్డుల మార్పిడి,ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలని సూచనలు చేస్తూ లోపల మాత్రం ఇలాంటి అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం.

సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం

-పచ్చని తోరణంలా తెలంగాణ వికసించాలి

-వేముల మహేందర్ గౌడ్ పిలుపు
మొగులపల్లి నేటి దాత్రి:

 

జూన్ మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పకడ్బందీ కార్యాచరణ రూపొందించారని, అందులో భాగంగానే గ్రామ గ్రామాన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై..సామాజిక ఉద్యమంలా వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి..పచ్చని తోరణంలా తెలంగాణ వికసించేలా కృషి చేద్దామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొక్కలే మనిషికి జీవనాధారమని, అలాంటి మొక్కలను నాటి..రేపటి తరానికి భవిష్యత్తును అందించే క్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. నేడు కాలుష్యం అధికమై ఓజోన్ పొర రంద్రం పడడంతో తెలంగాణలో విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు ఒక యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి..కాలుష్య నివారణకు కృషి చేసేందుకు ముందుకు రావాలన్నారు.

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై.!

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

-తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన బోయిని అనిల్ కుమార్, బోయిని శ్రీకాంత్ అనే వ్యక్తులు జేసీబీ సహాయంతో తాటివనం చెట్లను తొలగించారని, ఈ దుండగులపై సంబంధిత శాఖ అధికారులు క్రిమినల్ కేసులో నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తన చరవాణితో విలేకరులతో మాట్లాడారు. గురువారం రోజున కొర్కిశాల గ్రామానికి చెందిన పై వ్యక్తులు తమ భూమి ఒడ్డుకు..అసైన్మెంట్ భూమిలో ఉన్న తాటివనం చెట్లను జేసీబీతో తొలగించి గౌడ కులస్తుల ఉపాధిని దెబ్బ తీశారని, గీతా వృత్తినే నమ్ముకుని జీవనాధారం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల ఉపాధిపై దెబ్బతీసిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు.

దరఖాస్తు ఇవ్వండి
-ఇంక్వైర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
-ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్

కాగా తాటి వనం చెట్లను నరికిన విషయాన్ని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్ తో ఫోన్ ద్వారా విషయం తెలుపగా..దరఖాస్తు ఇవ్వండి..ఎంక్వైరీ చేసి తాటి వనం చెట్లను నరికిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి వివరణ

అసైన్డ్ భూమిలో ఉన్న తాటి వనం చెట్లను జేసీబీతో తొలగించిన విషయాన్ని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..విచారణ చేపడతామని తెలిపారు.

తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ.

” తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ …

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు శుభసందర్భంగా పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి తెలంగాణ గుండె తన్నీరు హరీష్ అన్న అనే పాటను సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ టి ఎన్ జి ఓ ఎస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, & జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యేలు మాణిక్ రావు గారు, చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన హృదయ నేత నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేసే నాయకుడు అని, సంపూర్ణ ఆరోగ్యం తో ప్రజలకు తన సేవలను అందించాలని కోరుకుంటున్నాం అన్నారు.అనంతరం ఇట్టి కార్యక్రమానికి ముఖ్యలు పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి గారిని మరియు వారి తనయుడు సాయి ప్రణీత్ రెడ్డి గార్లను అభినందించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్, కలిమ్ , మ్యతరి ఆనంద్ , యువ నాయకులు మిథున్ రాజ్,దీపక్,సందీప్ , దినకర్, తదితరులు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జమ్మికుంట వాసి పెండం సర్వేశం ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన జమ్మికుంట చేనేత సంఘాలు

జమ్మికుంట నేటిధాత్రి:

హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం ను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సర్వేశం గురువారం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉండి కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను చిన్నచూపుచూస్తున్నా
యని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఇప్పటికైనా జిఎస్టి తొలగించాలని, రద్దు చేసిన చేనేత పథకాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సహకార సంఘాల రుణాలతో సహా నేతన్నల కు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, సహకార సంఘాలకు,టెస్కోకు ఎన్నికలు నిర్వహించలని కోరారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి చేనేత కార్మికులకు చేతినిండా పనులు కలిగించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.6 లక్షలు ఇవ్వాలని, కార్మికులకు నెలకు రూ. 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో కార్మికులను చైతన్య పరిచి ఉద్యమాలు
చేస్తామని చెప్పుకొచ్చారు. తను ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య లతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య, నాయకులు బొమ్మకంటి మహేంద్ర చారి, ఈవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version