తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై.!

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

-తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన బోయిని అనిల్ కుమార్, బోయిని శ్రీకాంత్ అనే వ్యక్తులు జేసీబీ సహాయంతో తాటివనం చెట్లను తొలగించారని, ఈ దుండగులపై సంబంధిత శాఖ అధికారులు క్రిమినల్ కేసులో నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తన చరవాణితో విలేకరులతో మాట్లాడారు. గురువారం రోజున కొర్కిశాల గ్రామానికి చెందిన పై వ్యక్తులు తమ భూమి ఒడ్డుకు..అసైన్మెంట్ భూమిలో ఉన్న తాటివనం చెట్లను జేసీబీతో తొలగించి గౌడ కులస్తుల ఉపాధిని దెబ్బ తీశారని, గీతా వృత్తినే నమ్ముకుని జీవనాధారం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల ఉపాధిపై దెబ్బతీసిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు.

దరఖాస్తు ఇవ్వండి
-ఇంక్వైర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
-ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్

కాగా తాటి వనం చెట్లను నరికిన విషయాన్ని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్ తో ఫోన్ ద్వారా విషయం తెలుపగా..దరఖాస్తు ఇవ్వండి..ఎంక్వైరీ చేసి తాటి వనం చెట్లను నరికిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి వివరణ

అసైన్డ్ భూమిలో ఉన్న తాటి వనం చెట్లను జేసీబీతో తొలగించిన విషయాన్ని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..విచారణ చేపడతామని తెలిపారు.

దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి..

దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి..

చిత్తూరు జిల్లా..
పలమనేరు(నేటి ధాత్రి)ఫిబ్రవరి 06:

తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం మఠం గ్రామం వద్ద దళిత మాజీ సర్పంచ్ వెంకటయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచిన పెత్తందారి సుదర్శన్ కుటుంబికులను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి,మునిరత్నం డిమాండ్ చేశారు. అందులో భాగంగా గురువారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయము నందు అధ్యక్షులు డి,సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సంఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు సోమశేఖర్, మహిళా నాయకురాలు సరస్వతి మాట్లాడుతూ రోజురోజుకు దళితులపైన , మహిళలు, చిన్నారులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని వాటిని నివారించడంలో ప్రభుత్వాలు, అధికారులు పూర్తిగా విఫలమైనారనడానికి దళితుల పైన జరుగుతున్న దాడులే నిదర్శనం అన్నారు.కేవీబి పురం మండలం, మఠం గ్రామం వద్ద దళిత వెంకటయ్యకు ఎంఏ రాజుల కండ్రిక రెవెన్యూ దాఖలాలో సర్వే నెంబర్ 428/2లో 1.39 సెంట్లు వ్యవసాయ భూమి ఉందని ,సదరు భూమి పక్కనే ఉన్న పెత్తందారి సుదర్శన్ ఎలాగైనా వెంకటయ్య భూమిని కాజేయాలనే కుట్రతో గత కొంతకాలంగా వెంకటయ్యతో సుదర్శన్ గొడవలు పడుతున్నాడని తెలిపారు.గుర్రం.సుబ్రమణ్యం మాట్లాడుతూ పెత్తందారి సుదర్శన్ దౌర్జన్యాలను తట్టుకోలేక దళిత వెంకటయ్య భూమికి సంబంధించి కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా సుదర్శన్ ఆగడాలు ఆగకపోవడంతో విధి లేక మండల తహసిల్దార్ కు మొరపెట్టుకున్నాడనే కుట్రతో మరల పెత్తందారి సుదర్శన్ దళిత దంపతులపై దాడికి పూనుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దాడికి పాల్పడిన పెత్తందారిని కుటుంబీకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామల, రాజా, ఆనంద్, గంగప్ప, బుజ్జి, శ్రీనివాస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version