15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు..

15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు

స్పందించిన మాజీ కౌన్సిలర్ బండారు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డు శ్రీ రామ టాకీస్ హై స్కూల్ రోడ్ లో కాలువలో మురికి మట్టి పేరుకపోవడంతో వార్డు ప్రజలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టికి తీసుకపోవడంతో స్పందించిన ఆయన మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి సిబ్బంది బాలరాజు దగ్గరుండి కార్మికులచే మట్టిని జె సి బి తో తీసివేయించారు .ఈ మేరకు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి 15వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు

కవేలి టు కోహిర్ రోడ్డుపై ప్రమాదకర గుంతను జెసిబి సహాయంతో మూసివేత…

కవేలి టు కోహిర్ రోడ్డుపై ప్రమాదకర గుంతను జెసిబి సహాయంతో మూసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి,:

జహీరాబాద్ నియోజకవర్గంలో
కోహిర్ మండల పరిధిలోని కవేలి టు కోహిర్ రోడ్డులో, కవేలి బ్యాంకును దాటి కొద్దిదూరంలో ఏర్పడిన ప్రమాదకర గుంత వల్ల గత కొంతకాలంగా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో, స్థానికుల విజ్ఞప్తి మేరకు మరియు రాహదారుల భద్రత దృష్టిలో ఉంచుకుని,కోహీర్ ఎస్ఐ నరేష్ స్పందించి వెంటనే జెసిబి సహాయంతో ఆ గుంతను మూసివేసి ప్రమాదాలను నివారించారు.అనంతరం కవేలి టు కోహిర్ తిరిగి వాహనదారులు స్థానిక ఎస్ఐ నరేష్ కు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

“మెట్‌పల్లి రైతుల ఆందోళన: అక్రమ మోరంపై చర్యలు కోరింత”…

మెట్ పల్లి

ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

మెట్ పల్లి పట్టణ రైతులు ఆర్డీవో కి అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టణ శివారు వెంకట్రావుపేట రేగుంట లో ఉన్న మా పొలాల తోవలో గుండు గుట్టలను నిత్యం జెసిబి లతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం మూడు నాలుగు జెసిబి లు 20 పైగా ట్రాక్టర్లతో మొరము తరలిస్తూ ఉన్నారు .
ఈ అక్రమ మోరం తీసుకెళ్లేటప్పుడు అతివేగంగా రావడం రాత్రింబవళ్లు లో కూడా ట్రాక్టర్లు తిరగడం పంట పొలాలు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసం అయిందని అంతేకాకుండా అనుభవం లేని లైసెన్స్ లేని డ్రైవర్లతో వంట పొలాల్లో ట్రాక్టర్లు దించడం దీని ద్వారా పంటలు ధ్వంసం అవుతున్నాయని ఇంతకుముందు తహసిల్దార్ కి మొరము తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చిన వారు పట్టించుకోలేదని మొరం డిమాండ్ ఎక్కువ ఉండడంతో జెసిపిల ద్వారా గుండు గుట్ట నుండి తీసుకొచ్చి డ్రంపులు చేస్తూ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ప్రస్తుతం గుండు గుట్ట కనుమరుగవుతూ ఉన్నదని అధికారులు మాకేం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నారని మేము పంట పొలాలకు వెళ్లి కెనాల్ దారిలో అక్కడి కాలనీవాసులు కెనాల్ వెంట సిసి రోడ్డుపై జెసిబి లు ట్రాక్టర్లు మిల్లర్లు కార్లు అన్ని రోడ్లపై నిలుపుతున్నారని బండ్లను తీయమంటే వారు బెదిరిస్తూ భయంతో గురి చేస్తున్నారని దయచేసి మా యందు దయతలిచి మా సమస్యలకు వెంటనే పరిష్కరించాలని అక్రమ మొరంపై చర్యలు తీసుకోవాలని కెనాల్ వెంట సిసి రోడ్డుపై ఉన్న వెహికల్స్ తీయించి మాకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చామని అన్నారు .ఈ కార్యక్రమంలో జెట్టి లింగం ఒజ్జల బుచ్చిరెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు ఆకుల నరేష్ నారాయణ బొడ్ల ఆనందు ఒజ్జల శ్రీనివాస్ కురుమ సాయిలు లక్ష్మణ్ యమ రాజయ్య అరిగేలా లక్ష్మణ్ జెట్టి శ్రీనివాస్ బాలరాజు సంజీవ్ గంగారెడ్డి సురేష్ దేవయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై.!

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

-తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన బోయిని అనిల్ కుమార్, బోయిని శ్రీకాంత్ అనే వ్యక్తులు జేసీబీ సహాయంతో తాటివనం చెట్లను తొలగించారని, ఈ దుండగులపై సంబంధిత శాఖ అధికారులు క్రిమినల్ కేసులో నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తన చరవాణితో విలేకరులతో మాట్లాడారు. గురువారం రోజున కొర్కిశాల గ్రామానికి చెందిన పై వ్యక్తులు తమ భూమి ఒడ్డుకు..అసైన్మెంట్ భూమిలో ఉన్న తాటివనం చెట్లను జేసీబీతో తొలగించి గౌడ కులస్తుల ఉపాధిని దెబ్బ తీశారని, గీతా వృత్తినే నమ్ముకుని జీవనాధారం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల ఉపాధిపై దెబ్బతీసిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు.

దరఖాస్తు ఇవ్వండి
-ఇంక్వైర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
-ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్

కాగా తాటి వనం చెట్లను నరికిన విషయాన్ని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్ తో ఫోన్ ద్వారా విషయం తెలుపగా..దరఖాస్తు ఇవ్వండి..ఎంక్వైరీ చేసి తాటి వనం చెట్లను నరికిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి వివరణ

అసైన్డ్ భూమిలో ఉన్న తాటి వనం చెట్లను జేసీబీతో తొలగించిన విషయాన్ని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..విచారణ చేపడతామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version