దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారిన.

దట్టంగా పెరిగిన చెట్ల పొదలు, ప్రమాదలకు నిలయంగా మారిన రహదారులు…

రోడ్డును కమ్మేసిన ముళ్లచెట్లు పట్టించుకోని అధికారులు…

దట్టమైన పొదలు తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం నుండి సత్యనారాయణపురం రహదారి ఇరుపక్కల ఎపుగా దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారాయి. ఎదురేదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రతిరోజూ ఉదయాన్నే ప్రభుత్వ మరియు ప్రయివేటు ఉద్యోగస్తులు, మహిళలు, విద్యార్థులు, రైతులు, ఈ రహదారి నుండే వెళ్తుండటం గమనార్హం. దట్టమైన మొక్కలు పెరిగిపోయి దానికి తోడు ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులతో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే అనేక సార్లు ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా జీవితాంతం అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి తీరని బాధలు మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి.రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు సంభవించే ముందు అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరుపక్కల విస్తరించిన ముళ్లచెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా

సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్ధన్నపేట( నేటిదాత్రి ):

పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు,
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య,
కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి,
వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version