రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చారకొండ, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు చెందిన రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో.. లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న రైతులు నూతన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లకు దరఖాస్తు చేసుకున్నారని.. లో వోల్టేజీ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనందకుమార్, బాలాజీ సింగ్, సంజీవ్ యాదవ్,జిల్లెల్ల రాములు, దున్న సురేష్, పడకండి వెంకటేష్, చంద్రకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలకు రూ.50 వేలు తన వంతు కర్తవ్యంగా ఇచ్చిన పారిశ్రామిక వేత్త కె.ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో దిగ్వాల్ గ్రామంలో పారిశ్రామిక వేత్త జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి ఈరోజు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ పిలుపు మేరకు ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.ఈ నేల 31,జూన్ 1,2,తేదీలో జరిగే మైసమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్బంగా రూ. 50 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే కోహీర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ లో వున్న బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఏకమయ్యి ఏలాలని అన్నారు.కావున రాబోయే ఎన్నికల్లో యువ కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాల పార్టీ కాదని అనగారని కులాల పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో యుటీఎస్ ఆధ్వర్యంలో బడిబాట చేపట్టారు. మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాలలోని వివిధ గ్రామాల్లో బడిబాట జీపీ యాత్ర కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం అల్గోల్ రోడ్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో సభ్యులు వి ప్రభాకర్ గౌడ్ కే సురేందర్ రెడ్డి రమేష్ బాబు బరోరు లక్ష్మి బి. శ్రీనివాస్ అఫీషియల్ మెంబర్ ఎం సంగమేశ్వర స్వామి స్వీకారం చేయడం జరిగింది.

వలిమా డిన్నర్ వేడుక లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్.

వలిమా డిన్నర్ వేడుక లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఏషియన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన రిపోర్టర్ మిస్బా గారి అన్న వలిమా డిన్నర్ వేడుకలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారిని శాలువా పూలమాలతో స్వాగతించరు మొహమ్మద్ తన్వీర్ పెళ్లి కుమారును శుభాకాంక్షలు తెలియజేశారు టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ తో పాటు అతని బృందం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ తాజుద్దీన్ షబ్బీర్ భాయ్ బిజీ సందీప్ మొహమ్మద్ అయూబ్ తదితరులు ఉన్నారు.

జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చిలుక ప్రవీణ్ పై యూట్యూబర్ చల్లా చేసిన దైవదూషణ వ్యాఖ్యలపై జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, ఇస్లాం చివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గౌరవార్థం దైవదూషణ మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నేతృత్వంలోని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ ను కలిసి ఈ విషయంలో అధికారిక ఫిర్యాదు చేసింది. చిలుక ప్రవీణ్ “యు న్యూస్” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోందని చెప్పబడింది. దీనిలో అతను ఉద్దేశపూర్వకంగా ఇస్లాం, ముస్లింలు మరియు ఇస్లాం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గురించి రెచ్చగొట్టే మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. యూట్యూబ్ లో తప్పుడు ఖ్యాతిని పొందడానికి మరియు తన ఛానల్ యొక్క అభిప్రాయాలను పెంచడానికి మాత్రమే అతను ఇదంతా చేస్తున్నాడు. పర్వీన్ యొక్క ఈ చర్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా దేశ సామరస్యాన్ని కూడా బెదిరించాయని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం చెబుతోంది చిలుక ప్రవీణ్ మాటలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, భవిష్యత్తులో ఆమె ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఉండటానికి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాదీ చిలుక ప్రవీణ్ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు మరియు అలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మరియు భవిష్యత్తులో ఎవరూ అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ధైర్యం చేయకుండా దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు ఏ మతానికి వ్యతిరేకంగానైనా ఇటువంటి చర్యలు చేసే వారిపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు, తద్వారా ఎవరూ అలా చేయడానికి ధైర్యం చేయరు. ప్రతినిధి బృందంలో సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ, సజ్జాదా నషీన్ ముహమ్మద్ మహమూద్ సూఫీ, హఫీజ్ ముహమ్మద్ ఇర్ఫాన్, ముహమ్మద్ అజీముద్దీన్ ఖాద్రీ ముహమ్మద్ ముస్తెయిన్ నవాజ్ ముహమ్మద్ ఇంతియాజ్ సాకి, హఫీజ్ ముహమ్మద్ హమీద్ ముహమ్మద్ ఇబ్రహీం ఖలీల్ ముహమ్మద్ రఫీ, స్టేషనరీ ముహమ్మద్ ఫయాజ్ అహ్మద్, క్రైమ్ రిపోర్టర్ మరియు ఇతరులు ఉన్నారు.

గ్రామదేవతలకు పూజలు.

కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జేష్ట మాసం గ్రీష్మ రుతువు తదియ బుధవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 ప్రతినెల నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగంగా పంచామృతాలు సరస్వతి పుష్కర జలంతో అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నిర్వహించారు.

పాఠ్యపుస్తకల పంపిణీ.

పాఠ్యపుస్తకల పంపిణీ

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం ఎంఈవో శంకర్ నాయక్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటుందని, నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ విద్యా బోధన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

అట్టహాసంగా చెల్పూర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

అట్టహాసంగా చెల్పూర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూర్ లో 2007-2008 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు అంతా కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని బుధవారం ఆ పాఠశాల ప్రాంగణంలో అపూర్వంగా నిర్వహించుకున్నారు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గతంలో ఉపాధ్యాయులు గా పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులందరూ అతిధులుగా హాజరయ్యారు
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆ సంవత్సరం చదివిన మొత్తం మందిలో ఎనిమిది మంది దురదృష్టవశాత్తూ మృతి చెందారని వారికి ఘనంగా నివాళులర్పించిన పిమ్మట మిగతా పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క పరిచయాన్ని తాము జీవితంలో స్థిరపడ్డ విధానాన్ని సభా కార్యక్రమంలో వివరించారు.

తాము పదవ తరగతి చదువుకొని అప్పుడే 18 సంవత్సరాలు గడిచాయి అంటే నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు

విద్యార్థులందరూ గత స్మృతులను నెమరువేసుకొంటూ నాడు సెల్ ఫోన్ లే కాదు ల్యాండ్ ఫోన్లు కూడా లేని సమయంలో అత్యంత సీదా సాదాగా ఉండేవారమని పూర్తి సమయాన్ని చదువుతోపాటు ఆటపాటలకు కేటాయించే వారమని ఇంటి పనులు కూడా చేసుకునే వారమని చెప్పారు ఎలక్ట్రానిక్ మీడియా విస్తృత ప్రచారంలో లేని కాలంలో ఉపాధ్యాయులే జీవితంగా శ్వాసగా ఉండేవారమని వారు ఏది చెబితే అది శిరసావహించే వారమని కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం విద్యార్థినీ విద్యార్థులంతా సెల్ ఫోన్ ప్రభావములో ఉండడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు

Teachers

తమ ఉపాధ్యాయుల సేవలు త్యాగాలు ఎన్నడు మరువలేమని తమ జీవితాల్లో స్థిరపడడానికి వారు అందించిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం కారణమని నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు
తాము చదివిన కాలంలో తమతో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు 8 మంది దివంగతులు అయినందున వారి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల లతో పాటు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం.

ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం

కల్వకుర్తి నేటి దాత్రి:

కల్వకుర్తి పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఈనెల 30వ తేదీన వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఆటోలు, బైకులు వాహనాలను వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.!

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కులను పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా వివాహం చేసుకున్న జంటలకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరంగా ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,పార్టీలకు అతీతంగా కల్యాణ లక్ష్మి ఇవ్వడం ఎంతో గొప్ప కార్యక్రమం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల, నడికుడ మండల అధ్యక్షులు కట్కురి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,శ్రీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగురి రాజేశ్వర్ రావు, పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎంపిటిసిలు,మాజీ సర్పంచ్ పర్నెం మల్లారెడ్డి,కోతపెల్లీ రవి,చాడ తిరుపతి రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, ఎఏంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, ఏజీపీ లక్కం శంకర్,కాంగ్రెస్ నాయకులు ఎకు రవికుమార్,ఎండి షఫీ,గోవింద సురేష్ తదితరులు పాల్గొన్నారు.నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రేవూరిపట్టణ కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో నార్లపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తాటికొండ మౌనిక వివాహనికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పరకాల,నడికుడ మండల అధ్యక్షులు కట్కురి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్, పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,శ్రీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగురి రాజేశ్వర్ రావు,మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ పర్నెం మల్లారెడ్డి,కోతపెల్లీ రవి,చాడ తిరుపతి రెడ్డి,ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఎఏంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి,పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,ఏజీపీ లక్కం శంకర్,కాంగ్రెస్ నాయకులు ఎకు రవికుమార్,ఎండి షఫీ,గోవింద సురేష్, తదితరులు పాల్గొన్నారు.

అచ్చంపేటలో బీజేపీ సంస్థ కథ సమీక్ష.

అచ్చంపేటలో బీజేపీ సంస్థ కథ సమీక్ష

అచ్చంపేట నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట రూరల్ మండలంలోని శక్తి కేంద్ర ప్రముఖ్, ప్రభారీల నియామకాల సంస్థాగత సమీక్ష బీజేపీ మండల అధ్యక్షులు కాట్రావత్ జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు మోక్తల రేణయ్య, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు వరికుప్పల ఆంజనేయులు, బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అఖిల్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గోవిందు అనిల్ పాల్గొన్నారు. మండలంలో 10 శక్తి కేంద్రలకు ప్రముఖ్, ప్రభరీలను నియమించడం జరిగిందన్నారు.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట నేటిధాత్రి:

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నిర్వాహకులను ఆదేశించారు.వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పెద్దమ్మ గడ్డ, మనుబోతుల గడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని తెలిపారు.ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు వర్షంపడే అవకాశం ఉన్నప్పుడు టార్పాలిన్లు కప్పి ఉంచాలని కలెక్టర్ సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు మరియు హమాలీలు సమకూర్చుకోవాలని తెలిపారు.గోనె సంచుల కొరత లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.కలెక్టర్ వెంట డిఆర్డిఓ కౌసల్య దేవి,జిల్లా సహకార అధికారి నీరజ,పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌర సరఫరాల ఆధికారి కిష్టయ్య,మహిళా సంఘాల ప్రతినిధులు రైతులు తదితరులు  ఉన్నారు.

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో పోటీ చేయుటకు.!

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో పోటీ చేయుటకు రెండు నామినేషన్లు దాఖల్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేయుటకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన బచ్చు రామ్ గోనూరు వెంకటయ్య ఎన్నికల నిర్వాహకులకు నామినేషన్ పత్రాలు దాఖల్ చేశారు . ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు ఇటుకూరి వీరయ్య గుప్తా పెబ్బేరు బుచ్చయ్య శెట్టి మారం బాలీశ్వరయ్య కట్టసుబ్బయ్య బాదం వెంకటేష్ బుస్స రమేష్ సంబు వెంకటేశ్వర్లు లలిశెట్టి సాయి ప్రసాద్ లగిశెట్టి అశోక్ ఆకుతోట దేవరాజ్ న్యాయవాదులు భాస్కర్ దార వెంకటేష్ కోట్ర రామకృష్ణ చవ్వ పండరయ్య లారీవేణుగోపాల్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మహబూబ్ నగర్ సరస్వతి పుత్రుల నిలయం.

మహబూబ్ నగర్ సరస్వతి పుత్రుల నిలయం.

గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ నేటిధాత్రి:

మహబూబ్ నగర్ సరస్వతి పుత్రుల నిలయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలో టెట్, డిఎస్సీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 250 మంది అభ్యర్థులకు టెట్ మరియు డిఎస్సీ మెటీరియల్స్ ను క్యాంపు కార్యాలయంలో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాలు విద్యావ్యవస్థ నిర్విర్యం అయ్యిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు నింపకుడా కాలయాపన చేశారని, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన మండిపడ్డారు.

Saraswati

పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్ మరియు డిఎస్సీ కి కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే టెట్ మరియు డిఎస్సీ కోసం హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత ప్రత్యేక ఉచిత కోచింగ్ ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తుందని, ఇప్పటికే ఒకసారి డిఎస్సీ నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. రానున్న టెట్ డిఎస్సీ పరీక్ష లో ఉత్తమ ఫలితాలు సాధించి, జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, టి. పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గుండా మనోహర్, నాయకులు అవేజ్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఉమర్, అంజద్, ఖాజా పాషా, చర్ల శ్రీనివాసులు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా.

కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని నిమ్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ నిమ్టే రైతుల కోసం సీపీఎం పోరాటం చేస్తుందని చెప్పారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు రామచందర్, మల్లేశం, సాయిలు, నర్సింలు పాల్గొన్నారు.

రామారావు గారి జయంతి వేడుకలు.

ఘనంగా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు జహీరాబాద్ పట్టణం రాంనగర్ కాలనీ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు బండమీది శ్రీనివాస్, సురేష్, రాంచందర్, టి.శివన్న,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,లక్ష్మణ్, నాగరాజ్,శికారి శ్రీనివాస్, తుక్కన్న,చేన్ మల్లు,శంకర్, తదితరులు పాల్గొన్నారు,

పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచే విధంగా యజమానులపై.!

పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచే విధంగా యజమానులపై చర్యలు తీసుకోవాలి

సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేత

సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ , వార్పిన్ , కార్మికులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , వార్పిన్ , వైపని కార్మికులకు అదేవిధంగా టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి యజమానులు కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , వార్పిన్ , వైపని కార్మికులకు మరియు టెక్స్టైల్ పార్కు కార్మికులకు కూలి ఒప్పందం ముగిసి సంవత్సరం దాటిందని యజమానులు కూలీ పెంచకపోవడంతో కార్మికులకు సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల కూలి పెంచాలని పలు దఫాలుగా యజమానులకు విన్నవించినా కూడా కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ అగ్రిమెంట్ జరుగుతుందని 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన కూలీ ఒప్పందం 2024 ఏప్రిల్ నెలతో ముగిసిందని కూలీ ఒప్పందం ముగిసి ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా యజమానులు కూలీ పెంచడం లేదని కావున ఇప్పటికైనా లేబర్ అధికారులు యజమానులతో వెంటనే కూలి చర్చలు జరిపించి కూలి పెంచాలని లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎగమంటి ఎల్లారెడ్డి,సిఐటియు నాయకులు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.

సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.

ఘనంగా నేతాజీ పురుషుల పొదుపు సంఘం సిల్వర్ జూబ్లీ మహోత్సవం.

నర్సంపేట నేటిధాత్రి:

గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని ఈ క్రమంలో సంఘాలు మరింత అభివృద్ధి చెందాలంటే యువత సంఘానికి సేవలు అందించడానికి ముందుకు రావాలని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల రవీందర్,ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు.నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం 25 వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ మహోత్సవం కార్యక్రమం సంఘం అధ్యక్షుడు పెండ్యాల మల్లేశం అధ్యక్షతన సంఘం కార్యాలయం వద్ద జరిగింది.ముందుగా సంఘ 2024-25 వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలను సంఘం అధ్యక్షుడు మల్లేశం,గణకుడు
ధూపటి వెంకటేశ్వర్లు ప్రవేశ పెట్టారు.1996లో వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వల్గుబెల్లి రంగారెడ్డి స్థాపించగా అనేక ఒడుదొలుగులతో నేడు ఉత్తమ సంఘంగా రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం అని సంఘం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్య అతిదులుగా హాజరైన నీల రవీందర్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు అంటే ఒక బంగారుబాతులాంటివని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులే అని పేర్కొన్నారు.సభ్యులు సంఘాలను పునాదులుగా ఉంటే తల్లిదండ్రుల పాత్ర పాలకవర్గ సభ్యులు పోషించాల్సి ఉంటున్నదన్నారు.సహకార వికాస సంస్థ ఎలాంటి లాబార్జిత పొందకుండా సేవలు అందిస్తున్నదని సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వల్గుబెల్లి రంగారెడ్డి,సంఘ ఉపాధ్యక్షులు గంగిడి రాజిరెడ్డి పాలకవర్గ సభ్యులు చిట్టోజు రాము, పంజాల భాస్కర్, వల్గుబెల్లి మోహన్ రెడ్డి, మిట్టగడపల సాంబయ్య,అన్నం లింగారెడ్డి,ఓదెల రవి,మెరుగు రాజు, ఒద్దుల బుచ్చిరెడ్డి, వంగపెల్లి కమలాకర్ రెడ్డి, మిట్టగడపల బాబు,మాజీ అధ్యక్షులు నరహరి కట్టారెడ్డి, సాంబరాతి శ్రీనివాస్, చిట్టొజు రమణ చారి,పెండ్యాల మల్లేశం,సాంబరాతి రమేష్, చిట్టోజు రాము,గంగిడి రాజిరెడ్డి, వ్యవస్థాపక పాలకవర్గం లింగాల నరసయ్య, దొడ్డు జయపాల్ రెడ్డి,మాజీ వ్యవస్థాపక పాలకవర్గం సభ్యులు,సమితి పరిది సంఘాల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,ప్రభాకర్,రాయరాకుల రమేష్,బాబు,సమితి గణకుడు రమణాచారి,సభ్యులు పాల్గొన్నారు.

services

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..

నేతాజీ పురుషుల పొదుపు సంఘం 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం ఎన్నికల అధికారి కందుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టగా అధ్యక్షులుగా అన్నం లింగారెడ్డి,ఉపాధ్యక్షులుగా మేర్గు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,సంఘం అధ్యక్షుడు మల్లేశం,ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి పాలకవర్గం పాల్గొన్నారు.

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని.!

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రెటరీ మారేపల్లి మల్లేష్.

చిట్యాల నేటిధాత్రి :

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి 12 జూనియర్ కళాశాలను మూసివేయడానికి కుట్టలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేస్తున్నా ము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగులాంబ గద్వాల కరీంనగర్ చొప్పదండి ఖమ్మం మహబూబాద్ సిద్దిపేట సంగారెడ్డి కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జనగాం మేడ్చల్ మల్కాజిగిరి ఈ 12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరికాదన్నారు విషయం సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియపరుస్తాం అలాగే 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి తెలియక ఆందోళన చెందుతున్నారని వాపోయారు ఆమె నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్విత సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయన్నారు 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసివేయడం వల్ల సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారన్నారు. ఈ విషయాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version